Home /News /life-style /

DO YOU KNOW WHY MOST PEOPLE DO NOT DIGEST FOOD PROPERLY AFTER EATING PRV

Digestive problems: చాలా మందికి ఆహారం జీర్ణం కాదు.. అలా ఎందుకు అవుతుందో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలామందిలో వేళకు తిన్నా జీర్ణం (digest) అవ్వదు. దీంతో వేలకు వేలు ఆసుపత్రులకు ఖర్చు చేయవలసి వస్తుంది. జీర్ణం కాకపోవడానికి ప్రధాన కారణం అసిడిటీ (Acidity), మలబద్దకం వంటి సమస్యలే. అలాగే వేళ తప్పించి భోజనం చేయడం, మద్యపానం (alcohol), ధూమపానం (Smoking), బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ తదితర కారణాల వల్ల కూడా కొందరిలో అజీర్ణ సమస్య (Digestive problems) వస్తుంటుంది.

ఇంకా చదవండి ...
    బిజీలైఫ్​ కారణంగా పని ఒత్తిడి (Stress) పెరిగిపోయింది చాలామందిలో. అందుకే వేళకు తినడమే మరిచిపోయారు జనం. ఈ కారణంగానే అనారోగ్యం కొనితెచ్చుకుంటున్నారు. అయితే చాలామందిలో వేళకు తిన్నా జీర్ణం (digest) అవ్వదు. దీంతో వేలకు వేలు ఆసుపత్రులకు ఖర్చు చేయవలసి వస్తుంది. జీర్ణం కాకపోవడానికి ప్రధాన కారణం అసిడిటీ (Acidity), మలబద్దకం వంటి సమస్యలే. అలాగే వేళ తప్పించి భోజనం చేయడం, మద్యపానం (alcohol), ధూమపానం (Smoking), బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ తదితర కారణాల వల్ల కూడా కొందరిలో అజీర్ణ సమస్య (Digestive problems) వస్తుంటుంది. ఇలాంటి వారు చిన్నపాటి చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.

    జీర్ణం ఎందుకు అవ్వదంటే..

    గట్ (కడుపు) ఆరోగ్యం, మానసిక, శారీరక పరిస్థితితో పాటు రోగనిరోధక వ్యవస్థ (Immunity System) పై ఆధారపడి ఉంటుంది. వీటితో పాటు ఎండోక్రైన్, చర్మ సంబంధిత, కాన్సర్ (Cancer)వంటి వ్యాధులకు కూడా సంబంధం ఉంది. గట్ మైక్రోబియమే అంటే మన శరీరంలో పేగులలో ఉండే సూక్ష్మజీవులు. ఒక వ్యక్తి జీర్ణ వ్యవస్థలో సుమారు 3 వందల నుండి 5 వందల వరకు వివిధ రకాల జాతులకు సంబంధించిన బ్యాక్టీరియాలు ఉంటాయి. వాటిలో కొన్ని బ్యాక్టీరియాలు (bacteria) మనకి అవసరం. వాటి వల్ల మనం ఆరోగ్యంగా (Healthy) ఉంటాం. కాబట్టి వాటి వల్ల మనకి ఎంతో ప్రయోజనం అనే చెప్పాలి. ఈ రకమైన బ్యాక్టీరియా ఉండకపోతే మనం తీసుకునే ఆహారం జీర్ణం (Food digest) అవ్వడం కష్టమే. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా మనం తినే ఆహారాన్ని చిన్న చిన్న భాగాలుగా మారుస్తుంది. దాంతో మన శరీరం పోషక విలువలను తీసుకుంటుంది.

    అధిక చక్కెర..

    మీ ఆహారంలో అధికంగా చక్కెర (Sugar) ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది. దాంతో కడుపులో ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతే కాకుండా చక్కర తినాలని ఆసక్తి పెరిగి పోతుంది. ఇలా అధికంగా చక్కెర తీసుకుంటే కడుపులో మంట కూడా పెరుగుతుంది. దీనికి తోడు అనేక వ్యాధులు, కాన్సర్ లు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి చక్కెరను పరిమితికి మించి వాడకూడదు. ఆహారం, వ్యాయామాలలో ఎటువంటి మార్పులు చేయకుండా తరచుగా బరువు పెరుగుతూ లేదా తగ్గుతూ ఉంటే గట్ ఆరోగ్యం దెబ్బ తింటుంది. దాంతో మన శరీరం ఎక్కువ పోషకాలను గ్రహించలేదు. దాంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిని, కొవ్వు నిల్వ చేయగల సామర్థ్యం క్షీణిస్తుంది.

    బరువు తగ్గిపోవడానికి ఇంకొక కారణం చిన్న ప్రేగుల లో బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగిపోవడం. బరువు పెరగడానికి కారణం శరీరంలో ఇన్సులిన్ శాతం, పోషక విలువలు తీసుకోవడం. తగ్గడం వల్ల ఎక్కువగా తినడం జరుగుతుంది. దానివల్ల సులువుగా బరువు పెరిగిపోతారు. ఎక్కువగా అలసిపోవడం వల్ల లేదా సమయం దొరకక పోవడం వల్ల సరైన నిద్ర ఉండదు. ఇలా ఎక్కువ రోజులు జరిగితే నిద్రలేమితో బాధపడాల్సి ఉంటుంది. దాంతో గట్ అనారోగ్యానికి గురవుతుంది. దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా గట్ లో మూడ్, నిద్రకు సంబంధించిన ఒక హార్మోన్ విడుదల అవుతుంది. ఒకవేళ సరైన నిద్ర లేకపోతే ఈ హార్మోన్ ఉత్పత్తి పై కూడా ప్రభావం చూపుతుంది.

    అజీర్ణ సమస్యకు చక్కటి పరిష్కారం అల్లం. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా అల్లం ముక్కలు వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. అనంతరం అల్లంలో ఉండే సారం ఆ నీటిలోకి చేరుతుంది. ఆ తర్వాత గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల తిన్న ఆహారం జీర్ణమవుతుంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Food, Health Tips, Stomach Pain

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు