Home /News /life-style /

Health tips: చంకల్లో దురద ఎందుకు వస్తుందో తెలుసా? మరి ఆ దురద తగ్గాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలంటే..

Health tips: చంకల్లో దురద ఎందుకు వస్తుందో తెలుసా? మరి ఆ దురద తగ్గాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొంత మందిలో చర్మ వ్యాధులు (skin diseases), గజ్జి (Itch), తామర వల్ల కూడా చంకల్లో దురద పుడుతుంది. కొందరికి పొడి చర్మం (dry skin) వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ విధంగా చంకల్లో దురద పెట్టేందుకు అనేక కారణాలు ఉన్నాయి.

    బిజీ లైఫ్​. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మనిషి శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల చంకల్లో (In the armpits) దురద వస్తుంది. అతిగా గోకితే అక్కడ దద్దుర్లు ఏర్పడుతాయి. అయితే చంకల్లో చర్మం (skin) రాపిడికి గురవుతుంది. దీంతో దురద మరింత ఎక్కవవుతుంది. మరి కొంత మందిలో చర్మ వ్యాధులు (skin diseases), గజ్జి (Itch), తామర వల్ల కూడా చంకల్లో దురద పుడుతుంది. కొందరికి పొడి చర్మం (dry skin) వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ విధంగా చంకల్లో దురద పెట్టేందుకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే చంకల్లో దురదతో బాధపడేవారు వెల్లుల్లి, ఉల్లిపాయ, గోంగూర, వంకాయ, చేపలు (fish), కోడిగుడ్లు, చికెన్ లాంటి ఆహారాలను కొన్ని రోజులు మానేయాలి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే... రోజూ రెండు సార్లు స్నానం (bath) చేయాలి. మార్కెట్లో దొరికే యాంటీ కాఫింగ్ పౌడర్లను రోజూ వారితే సమస్య తగ్గుతుంది. వైద్యుల సలహా మేరకు మెడికేటెడ్ సబ్బులు వాడాలి. వేరే వారికి చెందిన టవల్స్, దువ్వెన, దుస్తులు వాడకూడదు.

    నిమ్మకాయ (lemon) ముక్కను చంకలో 5 నిమిషాల పాటు రుద్దండి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రోజుకు 2-3 సార్లు చేయండి. లేదంటే నిమ్మరసాన్ని నీళ్లల్లో కలిపి చంకల్లో రాయండి. ఓ పావుగంట తర్వాత నీటితో శుభ్రం (clean) చేయండి.

    ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

    కొన్ని వేపాకులు (neem leaf) తీసుకుని మెత్తగా పేస్టు చేసి ఆ మిశ్రమాన్ని చంకల్లో రాసి కొంత సమయం అయ్యాక స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల దురదలు తగ్గుతాయి. చంకలకు గాలి తగిలేలా వదులైన దుస్తులు ధరించాలి. టీ-ట్రీ ఆయిల్ చంక దురద మరియు ఇన్ఫెక్షన్లకు అద్భుతమైన ఔషధం (medicine)గా పనిచేస్తుంది. యాంటీ-సెప్టిక్, యాంటీ ఫంగల్ లక్షణాల కారణంగా, ఇది చంకలలో దురదకు కారణమయ్యే ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

    ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ టీ-ట్రీ ఆయిల్ (oil) తీసుకొని 1 టేబుల్ స్పూన్ నీటితో కలపండి. అలాగే 5-6 చుక్కల టీ-ట్రీ ఆయిల్‌ను ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌తో కలపండి. ఈ మిశ్రమాన్ని చంకల్లో అప్లై చేసి 10 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చంకలను చల్లటి నీటితో కడగండి. నిమ్మకాయలోని సిట్రిక్ ఆమ్లం దురద సమస్యను త్వరగా తొలగిస్తుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

    ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Food, Health, Health Tips, Life Style

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు