Home /News /life-style /

Sleep tips: నిద్ర లేచేటపుడు కుడి పక్కనుంచే ఎందుకు లేవాలి ? ఎడమ వైపు నుంచి నిద్ర లేస్తే ఏమవుతుంది?

Sleep tips: నిద్ర లేచేటపుడు కుడి పక్కనుంచే ఎందుకు లేవాలి ? ఎడమ వైపు నుంచి నిద్ర లేస్తే ఏమవుతుంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సరైన నిద్రతో మరుసటి రోజు నూతనోత్తేజంతో పనిచేసేందుకు కావాల్సిన శక్తినిస్తుంది. మీ మెదడు (brain) సరిగ్గా పనిచేయడానికి తగినంత నిద్ర తప్పనిసరి. అయితే నిద్ర పోయి లేచేటపుడు జాగ్రత్తలు పాటించడం ముఖ్యం.

    పని ఒత్తిడి, మానసిక చికాగుల కారణంగా చాలా మంది నిద్రలేమితో భాదపడుతున్నారు. తద్వారా అనేక అనారోగ్య సమస్యలు (Unhealthy problems) కొనితెచ్చుకుంటున్నారు. మానవ శరీరం సరైన రీతిలో పనిచేయాలంటే కంటి నిండా నిద్ర (enough sleep) ఎంతో అవసరం. నిద్ర వల్ల శరీరానికి (body) నూతనోత్తేజం కలుగుతుంది. అంతేకాక వారు రోజువారీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. సరైన నిద్రతో మరుసటి రోజు నూతనోత్తేజంతో పనిచేసేందుకు కావాల్సిన శక్తినిస్తుంది. జీర్ణక్రియ నుండి మీ మానసిక స్థితి (mental health) వరకు అన్నింటిపై నిద్ర (sleep) ప్రభావాల్ని చూపిస్తుంది. అందువల్ల మీ మెదడు (brain) సరిగ్గా పనిచేయడానికి తగినంత నిద్ర తప్పనిసరి. అయితే నిద్ర పోయి లేచేటపుడు జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. ముఖ్యంగా నిద్ర లేవడం అంటే, చటుక్కున లేచి, ఒళ్లు విరుచుకుని మంచం దిగడం మంచిది కాదు. అప్పటి వరకూ విశ్రాంత స్థితిలో ఉన్న శరీరం అంత ఉత్తేజం పొందేలా నిద్ర లేవడానికి నిర్దిష్ట పద్ధతిని అనుసరించాలి. అది ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.

    కుడి పక్కకు బెటర్​..

    ఉదయం నిద్ర లేచే (wakeup) సమయంలో కుడి పక్క (right side)కు తిరిగి లేవాలి. నిద్ర మెలకువ కాగానే కుడి పక్కకు తిరగాలి. నిద్ర లేచిన వెంటనే మెటబాలిజం తక్కువగా ఉంటుంది. కాబట్టి..  కుడిపక్కకు తిరిగి లేచి, మంచం దిగాలి. అలాకాకుండా ఎడమ పక్క (left side)కు తిరిగి, లేచి నిలబడే ప్రయత్నం చేస్తే గుండె (heart) మీద ఒత్తిడి పడుతుంది. అది ఆరోగ్యానికి మంచిది కాదు.

    ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

    పెద్దవాళ్లు చెబుతుంటారు కదా..

    అందుకే మన చిన్నప్పుడు పెద్ద వాళ్ళు.. కుడి పక్క నుంచి నిద్ర లేవాలని మంచి జరుగుతుంది.. ఎడమ పక్క నుంచి లేస్తే నీ రోజు బాగుండదు అని చెబుతుంటారు. నిద్ర లేచిన వెంటనే రెండు అరచేతులు (hands) రుద్దుకుని కళ్ల మీద ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల అరచేతుల్లో ఉండే నాడులు ఉత్తేజితమై శరీర వ్యవస్థ పూర్తి స్పృహలోకి వస్తుంది.

    ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

    నిద్రపోయే భంగిమ..

    నిద్ర లేకపోవడం (No sleep) వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్ చేస్తుంటారు. అయితే నిద్రలో ఒక్కొక్కరు ఒక్కో భంగిమలో పడుకుంటారు. కొంతమంది నిద్రపోయే విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన అలవాటు ఉంటుంది. కొందరు బోర్లా పడుకొంటే, మరికొందరు వెల్లకిలా, ఇంకొదరు పక్కకి తిరిగి పడుకొంటారు. ఎసిడిటీతో బాధపడేవారు పడుకొనే విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

    వర్షంలో తడిచాక మీ జుట్టు పాడైపోతుంది కదా? ఈ చిట్కాలతో మీ జుట్టును కాపాడుకోండి..




    ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health Tips, Life Style, Sleep tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు