body parts: మన శరీరంలో ఏ భాగాలు వృద్ధాప్య దశలోకి మొదటగా వెళతాయో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

మన శరీర భాగాలన్నీ (body parts) ఒకే సారి వృద్దాప్య మార్పులకు గురి కావట. ఇదే నిజం. అన్ని శరీర భాగాలు వివిధ స్థాయిలలో వృద్దాప్య (old age) లక్షణాలకు గురవుతుంటాయి. అయితే వీటి గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం..

  • Share this:
    టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లు మారిపోయాయి. కొత్త కొత్త వంటకాలు వస్తున్నాయి. అయితే ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నామో.. మన ఆయుష్షు రేటు అంతలా దిగజారిపోతోంది. పూర్వకాలంలోని వాళ్లు వందేళ్లు పైబడి బతికేస్తుంటే.. మనం మాత్రం 60 ఏళ్లు.. 70 ఏళ్ల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాం. అప్పటి ఆహారపు అలవాట్లు అలా ఉండేవి మరి. అయితే వయసు మీరుతున్న కొలది చర్మం (skin)పై ముడతలు రావడం సహజం. అదేవిధంగా బలహీనంగా మారటం వంటి లక్షణాలు కూడా సాధారణమే. అయితే ఈ లక్షణాలు కొంత మందిలో ఎక్కువగా ఉంటాయి. మరి కొందరిలో తక్కువగా ఉంటాయి. మన శరీర భాగాలన్నీ (body parts) ఒకే సారి వృద్దాప్య మార్పులకు గురి కావట. ఇదే నిజం. అన్ని శరీర భాగాలు వివిధ స్థాయిలలో వృద్దాప్య (old age) లక్షణాలకు గురవుతుంటాయి. అయితే వీటి గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం..

    చేతులకు వృద్ధాప్యం తొందరగానే..

    శరీర భాగాలలో చేతులు (hands) ఎక్కువగా వాతావరణానికి ప్రభావితం అవుతాయి. ఇతర భాగాలతో పోలిస్తే, సాధారణంగా ఇవే వేగంగా వృద్దాప్య లక్షణాలకు బహిర్గతమవుతాయి. సూర్యకాంతి చేతి చర్మాన్ని ప్రమాదానికి గురి చేయటం వలన త్వరగా వృద్దాప్య లక్షణాల బారిన పడతాయి. కొంత మందిలో 30 సంవత్సరాల వయసులో చేతి భాగం వృద్దాప్యానికి గురైతే, ఎక్కువ శాతం వరకు 40 సంవత్సరాల వయసులో వృద్దాప్య లక్షణాలు మొదలవుతాయి.

    మహిళలలో ..

    మహిళలలో రొమ్ము (breast) ప్రాంతంలో హార్మోన్లు ప్రవహించటం వలన ఈ హార్మోన్ల అసమతుల్యతల కారణంగా స్తన కణజాలాలు త్వరగా వృద్దాప్య బారిన పడతాయి. స్త్రీలు వారు ఉన్న వయసు కన్నా, వారి స్తన భాగం రెండు లేదా మూడు సంవత్సరాల వయసు అధికంగా కనపడుతుందట. ఈ కారణం చేతనే మహిళలు రొమ్ము కేన్సర్ కు ఎక్కువగా గురవుతున్నారు.

    వెంట్రుకలు

    వయసు మీరుతున్న కొలది, చర్మంపై నల్లటి వలయాలు లేదా మచ్చలు అధికం అవుతుంటాయి. ఎక్కువగా పిగ్మెంటేషన్ వయసు మీరటానికి కారణం. చర్మంలో కొల్లాజన్ , ఎలాస్టిన్ స్థాయిలు తగ్గటం వలన వయసు మీరిన లక్షణాలు (వలయాలు) బహిర్గతం అవుతాయి. అదేవిధంగా, కనురెప్పలు సాగటం మరియు వాటి చుట్టూ ఉండే కండరాలు బలహీనపడతాయి. వయసు 40 సంవత్సరాలకు చేరగానే వెంట్రుకలు (hairs) పలుచగా, తెల్లగా, పొడిగా,  పోలుసులుగా మారతాయి. గాడతలు ఎక్కువగా గల ఉత్పత్తులు మరియు చికిత్సల వలన ఈ ప్రక్రియ త్వరగా జరుగుతుంది.

    మోచేతులు.. మెడ

    మెడ (neck)  ప్రాంతంలో ఉండే చర్మం పలుచగా ఉండటం వలన మీరున్న వయసు కన్నా ఈ ప్రాంతం ఎక్కువగా కనపడేలా మారిపోతుంది. మోచేతులపై ఉండే వదులైన చర్మం మరొక వృద్దాప్య బహిర్గత లక్షణంగా పేర్కొనవచ్చు.
    Published by:Prabhakar Vaddi
    First published: