Home /News /life-style /

DO YOU KNOW WHAT TYPE WATER WILL BETTER TO USE FOR YOUR HAIR IN WINTER IS HOT WATER EFFECT OR NOT LETS KNOW HERE PRV

hair problem tips: శీతాకాలంలో మీ జుట్టును వేడి నీటితో కడిగితే మంచిదా.. లేదా చల్ల నీటితోనా? ఇక్కడ తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చలికాలంలో జుట్టు కడగడం గురించి మనం అయోమయం చెందుతాం.  చలికాలంలో జుట్టును ఏ నీటితో శుభ్రం చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం.

    శీతాకాలం (winter) మొదలైపోయింది. ఈ కాలంలో జలుబు, దగ్గు వంటి జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు చలికాలంలో చర్మ సమస్యలతో పాటు జుట్టు సమస్యలూ (hair problem) వేధిస్తుంటాయి. చలికాలం మొదలు కాగానే తేమ ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల తలమీది చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మనిషి అందాన్ని వారి కేశాల (hair)ను బట్టి కూడా అంచనా వేస్తున్నారు. చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్​ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం జరుగుతుంది. జుట్టు రాలిపోతుంటే (hair fall) విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు (black hair) ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు (health issues) వలన జుట్టు రాలే సమస్య (hair problem)ను ఎదుర్కొంటున్నారు.

    ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన జుట్టు రాలిపోవడం (Hair fall), తెల్లజుట్టు చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (hair problem tips) మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే చలికాలంలో జుట్టు సంరక్షణపై చాలామందికి చాలా అనుమానాలుంటాయి.  చలికాలంలో చలి వస్తుందనే భయంతో మనలో చాలా మంది జుట్టును వేడి నీటి (hot water)తో కడగడం ప్రారంభిస్తారు, అయితే వేడి నీరు మన జుట్టుకు చాలా హాని (harm) కలిగిస్తుంది. కాబట్టి చలికాలంలో జుట్టు కడగడం (Wash hair in winter) గురించి మనం అయోమయం చెందుతాం.  చలికాలంలో జుట్టును ఏ నీటితో శుభ్రం చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం.

    చలికాలంలో జలుబు రాకుండా ఉండేందుకు చాలా మంది జుట్టును వేడి నీళ్లతో కడగడం ఇష్టం. వేడి నీళ్లతో జుట్టు కడుక్కోవడం వల్ల చల్లగా అనిపించదు, కానీ జుట్టు గరుకుగా మరియు పొడిగా మరియు చిట్లిపోయేలా చేస్తుంది. వేడి నీటిలో జుట్టును కడగడం వల్ల జుట్టుకు తీవ్ర నష్టం జరుగుతుంది.

    చలికాలంలో జుట్టును చల్లటి నీటి (Cold water)లో కడగడం అంత సులభం కాదు. ఈ సమయంలో జుట్టు సంరక్షణను గోరువెచ్చని నీటి (Lukewarm water)తో కడగాలి. గోరువెచ్చని  నీటి (Lukewarm water)లో జుట్టు కడగడం వల్ల జుట్టుకు పెద్దగా నష్టం జరగదు. గోరువెచ్చని  నీటి (Lukewarm water)ని ఉపయోగించి జుట్టు గడ్డకట్టదు. చలికాలంలో జుట్టు కడుక్కునేటపుడు షాంపూని జుట్టు మీద ఎక్కువసేపు ఉంచకూడదు. వర్షాకాలం, వేసవి కాలంలో జుట్టుకు ఎక్కువసేపు షాంపూ (Shampoo)తో తలస్నానం చేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో జుట్టుకు సెబమ్ ఎక్కువగా వస్తుంది. కానీ, వింటర్ సీజన్లో సెబమ్ అలా రాదు. కాబట్టి షాంపూతో జుట్టును త్వరగా కడగడం అవసరం.

    చలికాలంలో ఎక్కువసేపు జుట్టు కడుక్కోవడం వల్ల వెంట్రుకల అడుగుభాగంలో ఉండే సహజ నూనె (natural oil) తగ్గుతుంది, దీని వల్ల జుట్టు పల్చబడి నిర్జీవంగా మారుతుంది. కాబట్టి జుట్టును త్వరగా కడగాలి. చలికాలంలో జుట్టు కడిగిన తర్వాత హెయిర్ కండీషనర్ అప్లై చేయండి. అయితే, కండీషనర్‌ను ఎక్కువగా ఉపయోగించవద్దు. అదనపు కండీషనర్ ఉపయోగించడం వల్ల జుట్టు పల్చగా ఉంటుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Cold water, Hair fall, Hair problem tips, Water, WINTER

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు