హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health tips: మితిమీరిన ఆహారం, జిమ్​లతో ఎలాంటి సమస్యలు వస్తాయో మీకు తెలుసా?

Health tips: మితిమీరిన ఆహారం, జిమ్​లతో ఎలాంటి సమస్యలు వస్తాయో మీకు తెలుసా?

జిమ్​

జిమ్​

మితిమీరిన శారీరక శ్రమ (వ్యాయాయం) కారణంగా చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు, ఎముకలు త్వరగా ఫ్రాక్చర్ కావడం లాంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ రోజుల్లో ఫుడ్​ లవర్స్​ చాలామందే ఉన్నారు. కరోనా కారణంగా అందరూ ఇంట్లోనే ఉండటంతో శారీరక శ్రమ తగ్గి, ఫుడ్(food)​ తినడంలోనే ఎంజాయ్​ చేశారు. అయితే చాలామందికి ఉబకాయం సైతం వచ్చేసిందని టాక్​. దీంతో కాలరీలు ఖర్చు చేసుకునే దిశలో పరుగులు పెడుతారు. ఈ సమయంలోనే జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు(experts). మితిమీరి తినడంతోనే ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నట్లు, మితిమీరిన ఎక్సర్​సైజ్​లు కూడా మనిషికి చేటు చేస్తాయట. ఆహారపు అలవాట్లు సరిగా లేని వారు ఇతరుల కంటే ఎక్కువగా జిమ్​(gym)పట్ల ఆసక్తి కనబరుస్తారు. జిమ్​లకి వెళ్లి కాలరీలు కరిగించుకోవడం ఆరోగ్యాని(health)కి మంచిదే కానీ, చాలామంది పదేపదే జిమ్​(gym)లలోనే గడుపుతుంటారు. మితిమీరిన వ్యాయామం చేయడం ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని, మానసిక రుగ్మతలకు (డిప్రెషన్) దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహారపు అలవాట్లు లేని, ఆహార నియమాలు పాటించని వ్యక్తులు ఫిజికల్ ఫిట్ నెస్, ఎక్సర్ సైజ్‌ వంటి విషయాలను వ్యసనంగా మార్చుకునే ప్రమాదం ఇతరులతో పోల్చితే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. వేళాపాళా లేని తిండి శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుందని ఓ అధ్యయనం చెబుతోంది.

వేళాపాళా లేని ఆహారపు అలవాట్లతో ఓ పనిని పదే పదే చేయాలనిపించే ‘ఒబెసివ్ కంపల్సివ్ బిహేవియర్స్(Obsessive Compulsive Behaviors)’ అనే వ్యాధి బారిన పడతారని నిపుణులు తెలిపారు. యూకే, అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీలో చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు గుర్తించారు. వేళకు ఆహారం తీసుకునే వారితో పోల్చితే సరైన ఆహారపు అలవాట్లు లేని వ్యక్తులు ఎక్సర్‌సైజ్ కు అడిక్ట్ అయ్యే అవకాశాలు నాలుగు రెట్లు ఉన్నాయని తేలింది. ప్రస్తుతం మారుతున్న జీవన విధానాలతో రోజురోజుకూ కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి.

మితిమీరిన శారీరక శ్రమ (వ్యాయాయం) కారణంగా చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు, ఎముకలు త్వరగా ఫ్రాక్చర్ కావడం లాంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారపు అలవాట్లు మెరుగు పరుచుకుని, జీవనశైలిలో మార్పులు తెచ్చుకుంటే అనారోగ్య సమస్యల్ని అధిగమించడం సులువు. అయితే మితంగా చేసే వ్యాయామం సంపూర్ణ ఆరోగ్యానికి చాలా అవసరం. మన శరీరపు బరువును నియంత్రించడానికి, కండరాలను దృఢంగా శక్తివంతంగా ఉంచడానికి, ఎముకలను బలవంతంగా చేయడానికి, వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. దైనందిక వ్యాయామం వలన అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, నిద్రలేమి, మానసిక రోగాల వంటి వ్యాధులు రాకుండా నివారించవచ్చు. అందుకే వ్యాయామం చేయండి. ఆరోగ్యంగా ఉండటం. కానీ అతి ఎక్కువగా పనికిరాదు. అనారోగ్యం పాలవుతారు.

First published:

ఉత్తమ కథలు