చర్మం (skin) చాలా సున్నితమైంది (Sensitive). అయితే తెలిసో తెలియకో అప్పుడప్పుడు చర్మం కాలుతుంది (Burns). గాయాలు అవుతాయి. ఎక్కువగా వంట (cooking) చేస్తున్నప్పుడు మనం ప్రమాదానికి గురవుతాం. కాగుతున్న నూనె (oil) పడటం, మరుగుతున్న నీళ్లు (hot water) పడటం లేదా వంటపాత్రలు అనుకోకుండా చేతికి తగలడం వంటివి జరుగుతుంటాయి. అయితే శరీరం కాలిన కొన్ని రోజుల తర్వాత కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాలిన గాయాల విషయంలో ఏదైనా అజాగ్రత్త వహిస్తే, మాత్రం ప్రభావం ఎక్కువై సమస్యలు అధికమవుతాయి. అయితే మనకు చర్మం కాలినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కాలిన భాగంలో అసలు మనం చేయాల్సిన పనులు ఏంటి? చేయకూడని పనులు ఏంటో? ఇప్పుడు ఒకసారి వివరాలు తెలుసుకుందాం.
వెన్నపూస వద్దు..
శరీరం (body) కొద్దిగా కానీ ఎక్కువగా కానీ కాలినప్పుడు (After burning) చాలామంది వెన్నపూస రాయడం చేయకూడదు. అంతేకాకుండా బేకింగ్ సోడా (baking soda) పోయడం, టూత్ పేస్ట్ (tooth paste) పెట్టడం, ఆయింట్మెంట్ రాయడం, బాడీలోషన్ (body lotion) తో పాటు నూనెలు రాయడం లాంటి పనులు చేయకూడదు. అంతేకాకుండా కాలడం వల్ల ఏర్పడిన బొబ్బలను చిదమడం, పొక్కులను పొరపాటున కూడా గిల్లడం చేయకూడదు. కాలినప్పుడు ఒంటి మీద ఉన్న దుస్తులు (dress) చర్మానికి అతుక్కుపోతే, వాటిని లాగడానికి ప్రయత్నించకూడదు. ఇలా చేయడం వల్ల చర్మం దుస్తులకు అంటుకొని, గాయం పెద్దది అయ్యే ప్రమాదం ఉంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
చల్లని నీళ్లతో గాయాన్ని కడగాలి
శరీరం కాలినప్పుడు చల్లని నీళ్ల (cool water)తో గాయాన్ని కడగాలి. ఒక ధారలాగా పడుతున్న నీటి కింద కాలిన భాగాన్ని ఉంచాలి. ఒకవేళ కాలిన శరీరాన్ని బట్టలతో కప్పవలసి వస్తే, ఆ బట్టలను నీటితో తడిపి ఆ తర్వాత కప్పవలసి ఉంటుంది. ఒకవేళ గాయమైన ప్రదేశంలో ఏవైనా ఆభరణాలు ఉంటే వాటిని తీసేయాలి. ఇక కట్టు కట్టేటప్పుడు మెత్తగా గాయానికి అతుక్కోకుండా ఉండే బ్యాండేజీ మాత్రమే తీసుకొని ఉపయోగించాలి.
ఎండ వలన, గాలి వలన, ఏవైనా రసాయనాల వల్ల కానీ గాయాలైనప్పుడు చల్లని నీళ్ళతో గాయాలను కడగడం ఉత్తమం(better). ఒకవేళ మంటలు వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ప్రథమ చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ఒళ్లు కాలినప్పుడు గాలి (Air), వెలుతురు (light) బాగా ఉన్న ప్రాంతంలో ఉండాలి. ఎండలోకి వెళ్లకూడదు. అంతేకాకుండా చల్లని ప్రదేశాలకు దూరంగా (Avoid cool places) ఉండాలి. గాయాలు మానిపోయే దశలో దురద పెట్టడం వంటివి జరుగుతాయి. అటువంటపుడు కొబ్బరినూనె రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఎవరూ లేని స్మశానానికి ఒంటరిగా వెళ్లిన మహిళ.. అక్కడ అస్థిపంజరాన్ని తీసుకొని నృత్యం చేస్తూ..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Beauty tips, Life Style