Health tips: ఎడమ వైపు తిరిగి పడుకుంటే ఎలాంటి రోగాలు నయం అవుతాయో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

కొంతమంది నిద్రపోయే విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన అలవాటు ఉంటుంది. కొందరు బోర్లా పడుకొంటే, మరికొందరు వెల్లకిలా, ఇంకొదరు పక్కకి తిరిగి పడుకొంటారు. ఎసిడిటీతో బాధపడేవారు పడుకొనే విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

  • Share this:
జీవితాలు మెషిన్ల కంటే వేగంగా మారిపోయాయి. బిజీబిజీ లైఫ్​లో వేళకు తినడం లేదు. ఇక కొత్త కొత్త వ్యాధులూ చుట్టుముడుతున్నాయి. గత రెండేళ్లుగా కరోనా (corona) కారణంగా అందరి జీవితాలు తలకిందులయ్యాయి. కష్టాలు వచ్చి నట్టింట్లోనే చేరాయి. వారికి ప్రశాంతత (peace) కరువైంది. మరోవైపు చాలామంది ఉద్యోగాలూ ఊడిపోయాయి. చేతిలో చిల్లి గవ్వలేదు. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.  రోజులో ఒక్కసారి నిద్ర కూడా సరిగా పట్టనివారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి, నిత్యం బిజీబీజీ. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర కూడా కరువు (Sleeping problems) అవుతుంది.

నిద్రపోయే భంగిమ..

నిద్ర లేకపోవడం (No sleep) వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్ చేస్తుంటారు. అయితే నిద్రలో ఒక్కొక్కరు ఒక్కో భంగిమలో పడుకుంటారు. కొంతమంది నిద్రపోయే విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన అలవాటు ఉంటుంది. కొందరు బోర్లా పడుకొంటే, మరికొందరు వెల్లకిలా, ఇంకొదరు పక్కకి తిరిగి పడుకొంటారు. ఎసిడిటీతో బాధపడేవారు పడుకొనే విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

ఎసిడిటీ తగ్గుతుంది..

అవి పొట్టను పైకి ఉంచి పడుకోవడం, ఎడమవైపు తిరిగి పడుకోవడం ( lying back on the left side), పొట్టను కిందకు ఉంచి పడుకోవడం. మరి వీటిలో ఏ యాంగిల్ (angle) మంచిది? ఎడమ చేతి వైపుకి తిరిగి నిద్రపోవడం ( lying back on the left side) ద్వారా ఈ గ్యాస్ సమస్య (gas problem) నుంచి ఉపశమనం దొరుకుతుంది. అదెలాగంటే.. జీర్ణవ్యవస్థ విడుదల చేసిన జీర్ణ రసాలు అన్నవాహిక లోకి రాకుండా ఉంటాయి. దీని వల్ల కడుపులో మంటగా అనిపించదు.

ఇది కూడా చదవండి: ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి

పొట్టను పైకి ఉంచి పడుకుంటే..

పొట్టను పైకి ఉంచి... పడుకునేవారు అదృష్టవంతులు అనుకోవచ్చు. మగవారైనా, మహిళలైనా... ఎవరైనాసరే... ఇలా పడుకోవడం బెస్ట్ పొజిషన్. దీని వెల్ల వెన్నెముక (spine) సరిగ్గా ఉంటుంది. ఇలా పొడుకుంటే... మెడ, వెనక భాగం దగ్గర కొంత అసౌకర్యంగా ఉంటుంది. అక్కడి కండరాలు ఇబ్బంది పడతాయి. అయినప్పటికీ ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖంపై ముడుతలు రావు. ముఖ్యంగా మహిళలకు ఇది చక్కటి పొజిషన్. దీని వల్ల వారి వక్షోజాలు దెబ్బతినవు. పటిష్టంగా ఉంటాయి. ఈ పొజిషన్ వల్ల ఉన్న ఒకే ఒక్క సమస్య గురక. నోరు మూసి నిద్రపోతే... అది ఉండదు.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?
Published by:Prabhakar Vaddi
First published: