Health tips: రాత్రిళ్లు ఎక్కువగా నిద్రపోవడం లేదా? రోజంతా నిద్రలేకపోతే ఏమవుతుందో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం ఎనిమిది గంటల నిద్ర (At least 8 hours sleep) ఉండాలట. కానీ.. ఈరోజుల్లో అంత ప్రశాంతంగా 8 గంటలు నిద్ర పోవడం (sleep) సులభమేనా.. ఇవాళ్టి ఉద్యోగాలు.. పనులు, ఒత్తిళ్లు ఇలా ఎన్నోప్రశాంతమైన నిద్రకు ఎన్నో ఆటంకాలు.. మరి సరిగ్గా నిద్రపోకే పోతే ఏమవుతుంది..

  • Share this:
జీవితం (life) చాలా బిజీబిజీగా అయిపోయింది. వేళకు తినడం లేదు జనం. వాతావరణం కలుషితం అవుతోంది. కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఏడాదిన్నరగా కరోనా (corona) తాండవిస్తోంది. కరోనా నేపథ్యంలో చాలా మందిలో నరాల బలహీనత సమస్య ఎక్కువ అయింది. దీనివలన అప్పుడప్పుడు. తలనొప్పి రావడం (headache), కాళ్లు చేతులు గుంజడం, ఆకలి వేయకపోవడం (not hungry), ఆసక్తి లేకపోవడం, బయటకు చెప్పుకోలేని కొన్ని రకాల రోగాలు రావడం, మానసికంగా బలహీనంగా ఉండటం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, నిద్రలేమి (Insomnia).. వంటి అనేక సమస్యలు వస్తున్నాయి. అయితే కరోనా లాక్​డౌన్​ కారణంగా చాలామంది రాత్రిళ్లు (night) మేల్కునే ఉన్నారు. దీంతో అన్​లాక్‌ అనంతరం మళ్లీ సాధారణ జీవితం గడపాలనుకున్నా.. సాధ్యం కావడం లేదని పలువురు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం. నిద్రలేమి (Insomnia). లాక్​డౌన్​ కాలంలో పనేమీ లేకపోవడంతో ఇంట్లోనే ఇష్టం వచ్చిన సమయంలో నిద్రించేవారు. కానీ. మళ్లీ రొటీన్​ జీవితంలోకి అడుగుపెట్టాక అది ఇబ్బందిగా మారుతోంది. ఉద్యోగస్తులకైతే మరీ కష్టం. రాత్రిళ్లు నిద్ర లేకపోవడం (sleeping problems), ఉదయాన్నే ఆఫీసులో నిద్ర రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి.

8 గంటలు నిద్ర లేకపోతే..

మెదడు (brain)కు నిద్ర కూడా అంతే ముఖ్యం.. కొన్ని గంటలు  సరిగ్గా నిద్ర లేకపోతేనే మనిషి (human) సరిగ్గా పని చేయలేడు.. ఆరోగ్య నిపుణులు చెప్పేదాని ప్రకారం.. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం ఎనిమిది గంటల నిద్ర (At least 8 hours sleep) ఉండాలట. కానీ.. ఈరోజుల్లో అంత ప్రశాంతంగా 8 గంటలు నిద్ర పోవడం (sleep) సులభమేనా.. ఇవాళ్టి ఉద్యోగాలు.. పనులు, ఒత్తిళ్లు ఇలా ఎన్నోప్రశాంతమైన నిద్రకు ఎన్నో ఆటంకాలు.. మరి సరిగ్గా నిద్రపోకే పోతే ఏమవుతుంది.. నిద్రలేమి మనిషి జీవితాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుంది.. తెలుసుకుందాం..

మానసిక సమస్యలు..

ఓ మనిషి రోజంతా (day) నిద్రపోకుండా (without sleep) మేలుకుంటే.. మగతగా అనిపిస్తుందట. రోజంతా నిద్ర లేకపోతే మెదడు పనితీరు మందగిస్తుందట. ఏకాగ్రత దెబ్బతింటుందట. రోజంతా నిద్ర లేకపోతే చిన్న విషయానికి కూడా చిరాకు పడుతుంటారట. మానసిక స్థితి కూడా ఏమాత్రం స్థిరంగా ఉండదట. మూడు రోజులు వరుసగా నిద్ర లేకుండా ఉంటే.. ఆ మనిషి మెదడు (human brain) తీవ్ర ఒత్తిడి (pressure)కి గురవుతుందట. భ్రాంతులకు గురవుతుందట. మనిషి దిగాలుగా ఉండటం, స్థిమితంగా లేకపోవడం జరుగుతుందట. అంతే కాదు.. జ్ఞానేంద్రియాలపై నియంత్రణ (stable) కోల్పోతాడట.

ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

ఇక ఈ నిద్రలేమి వారానికి  మించితే దాని ప్రభావం మెదడుపై బాగా ఉంటుందట. నిద్రలేమితో మనిషి ఏదో కోల్పోతున్నట్టు ఫీలవుతాడట. శరీరంలో తేమశాతం తగ్గుతుందట. చర్మం (skin) కూడా పొడిబారిపోతుందట. ఇక ఇదే పరిస్థితి నెల రోజులు తక్కువ నిద్రతో గడిపితే.. ఆ మనిషి మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింటుందట. తీవ్రమైన ఒత్తిడికి గురై కొన్ని సందర్భాల్లో భయాందోళనతో వణికిపోతాడట. చివరకు ఏది నిజమో.. ఏది భ్రాంతో అర్థం కాని దుస్థితి వస్తుందట.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
Published by:Prabhakar Vaddi
First published: