Fermented garlic: ఫర్మెంటెడ్‌ గార్లిక్‌ తింటే ఏమవుతుందో తెలుసా!

ప్రతీకాత్మక చిత్రం

Fermented garlic health benefits: ఫెర్మెంటెడ్‌ వెల్లుల్లిలో బయోయాక్టివిటీ మెరుగ్గా ఉంటుంది. అందుకే దీన్ని మీరు కూడా తప్పకుండా ప్రయత్నించమని నిపుణులు చెబుతున్నారు.

  • Share this:
గార్లిక్‌ చాలా మందికి ఇష్టం. దీన్ని ఏ విధంగా అయినా తమ ఆహారంలో చేర్చుకుంటారు. దీన్ని పచ్చిగా తినేవారు కూడా లేకపోలేరు. అయితే, ఈ మధ్య ఫెర్మెంటెడ్‌ గార్లిక్‌ ( fermented garlic) పేరు బాగా వినబడుతోంది. దీన్ని తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అందుకే ఇలా తిసుకుంటున్నారు. కానీ, దీన్ని మనం ఇలా ఫెర్మెంట్‌ చేసి తినవచ్చా? లేదా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

వెల్లుల్లి (Garlic) లో యాంటీఆక్సిడెంట్స్‌ (Anti oxidants) పుష్కలంగా ఉంటాయి. అయితే, విభిన్న రుచి, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాల కారణంగా వెల్లుల్లి అంటే ఇష్టం ఉంటుంది. అయితే, ఈ సారి కాస్త ప్రయోగం చేయాల్సిందే. దీన్ని రోజువారీ మన ఆహారంలో చేర్చుకోవడంలో కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

ఇది కూడా చదవండి: వైరల్‌ అవుతున్న రాశిఖన్నా బ్యూటిఫుల్‌ పిక్స్‌! ఒకప్పుడు బుమ్రాతో..


మన భారతీయులందరికీ తెలిసిన విషయం ఏంటంటే వెల్లుల్లితో ఇన్ఫెక్షన్స్ (infections) , జలుబు వంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. దీంతో జీర్ణాశయ, శ్వాసకోశ సంబంధిత సమస్యలకు కూడా చెక్‌ పెట్టొచ్చు. ఇది ప్రీబయోటిక్, ప్రయోజనకరమైన బాక్టీరియాను(ఫంక్షనల్‌ ఫైబర్‌) ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. నెగిటీవ్‌ బ్యాక్టిరియాను నాశనం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పరిశోధనల ప్రకారం ఫెర్మంటెడ్‌ గార్లిక్‌లో దీని న్యూట్రియెంట్స్‌ స్థాయి పెరుగుతుంది. ఇవి శరీరాన్ని గ్రహించడంలో తోడ్పడతాయి. 90 రోజులపాటు పులియబెట్టిన వెల్లుల్లిలో పోషకాలు పెరుగుతాయి. అత్యధిక ఫ్యాట్, కార్బొహైడ్రేట్‌ కంటెంట్, అత్యధిక ప్రోటీన్‌ కంటెంట్‌ పులియబెట్టిన వెల్లుల్లిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: అరటి ఆకులో ఇది తింటే.. ఏం జరుగుతుందో తెలుసా?

అయితే, ఇది దాని రుచి, వాసనను కోల్పోతుంది. గార్లిక్‌ను తీపి, రుచికరమైన వంటల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా జపాన్, థాయ్‌లాండ్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఇది చాలా కాలం నుంచి తమ ఆహారంలో వాడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు విస్తరించింది. సాధారణ వెల్లుల్లితో పోలిస్తే.. ఫెర్మెంటెడ్‌ వెల్లుల్లిలో మెరుగైన బయోయాక్టివిటీ ఉంటుంది. వెబ్‌ ఎండీ ప్రకారం ఫుడ్‌లో బయోయాక్టివ్‌ శరీర పనితీరుకు, మెరుగైన ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం నల్ల వెల్లుల్లి మీ శరీరంలో బహుళ విధులకు సహాయపడుతుంది. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. అలర్జీని నివారిస్తుంది. యాంటీ డయాబెటీస్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్‌ వంటివి వెల్లుల్లిలో ఉంటాయి.

వెల్లుల్లిని ఫర్మెంట్‌ చేసే విధానం..
వెల్లుల్లిని పొట్టు తీయాలి. ఆ తర్వాత పరిశుభ్రమైన గ్లాస్‌ జార్‌లోకి లవంగాలు తీసుకోవాలి. దాంట్లో నీరు, ఉప్పు, మీకు నచ్చిన ఇతర హెర్బ్స్‌ను కూడా దీనికి జోడించవచ్చు. ఇప్పుడు ఈ బాటిల్‌ను చల్లటి ప్రదేశంలో ఉంచాలి. ఒక 3–6 వారాలు రూం టెంపరేచర్‌లో పెట్టాలి.
మీరు ఏ ఫుడ్‌ అయినా కొత్తగా డైట్‌లో చేర్చుకున్నట్లయితే, ముందుగా నిపుణుల సూచనలు తీసుకోవడం మంచిది.
Published by:Renuka Godugu
First published: