Chewing Gum: పొరపాటున చూయింగ్ గమ్ మింగేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?

చూయింగ్ గమ్ (ఫైల్ ఫొటో)

చూయింగ్ గమ్ పొరపాటున మింగేస్తే అది కడుపులోనే ఉండిపోతుందని పెద్దవాళ్లు చెప్పేవాళ్లు. చాలా కారణాలు చెప్పి భయపెట్టేవాళ్లు.. మీరూ అలా భయపడిన వారిలో ఒకరేనా? అయితే పొరపాటున చూయింగ్ గమ్ మింగేస్తే ఏమవుతుందో అని ఎప్పుడైనా ఆలోచించారా?

  • Share this:
చిన్నప్పుడు మనమంతా చూయింగ్ గమ్ ల గురించి ఎన్నో మాటలు వినే ఉంటాం. చూయింగ్ గమ్ పొరపాటున మింగేస్తే అది కడుపులోనే ఉండిపోతుందని పెద్దవాళ్లు చెప్పేవాళ్లు.. అంతేనా.. కొందరైతే అది కడుపులో ఏడు సంవత్సరాల పాటు అరగకుండా ఉండిపోతుందని.. మరికొందరైతే కడుపులో పేగులన్నింటికీ అది అతుక్కుపోయి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందని.. ఇక ఏమీ తినడానికి కుదరదని.. ఇలా చాలా చెప్పి భయపెట్టేవాళ్లు.. మీరూ అలా భయపడిన వారిలో ఒకరేనా? అయితే పొరపాటున చూయింగ్ గమ్ మింగేస్తే ఏమవుతుందో అని ఎప్పుడైనా ఆలోచించారా?

చూయింగ్ గమ్ లు ఎలాస్టిక్ గా ఉండి అతుక్కుపోయే గుణాన్ని కలిగి ఉంటాయి. గంటల కొద్దీ నమిలినా వాటి పరిమాణం ఏమాత్రం తగ్గకపోవడానికి కారణం అదే. అయితే మన శరీరం చూయింగ్ గమ్స్ ని అరిగించుకోలేదు. అయితే మన పేగులకు అది అంటుకుపోతుందని లేక కడుపులోనే కొన్ని సంవత్సరాలు ఉండిపోతుందని చెప్పింది మాత్రం అబద్ధమే.. చాలామందికి ఇలాంటి అపోహే ఉంటూ ఉంటుంది. మన పొట్టలోకి వెళ్లిన ప్రతి ఆహారాన్ని అరిగించేందుకు జీర్ణాశయం ఎంజైమ్స్ విడుదల చేస్తుంది. అక్కడ ఆహారం అరిగిపోయి పోషకాలుగా మారి రక్తంలోకి ప్రవేశిస్తుంది. అరగని కొన్ని పదార్థాలు పేగుల ద్వారా బయటకు వెళ్లిపోతాయి. మనం చూయింగ్ గమ్ తిన్నప్పుడు దాన్ని అరిగించే శక్తి శరీరానికి లేకపోవడం వల్ల మిగిలిన ఆహారంతో పాటు మలం ద్వారా అది బయటకు వెళ్లిపోతుంది. ఇలా వెళ్లడానికి 12 నుంచి 48 గంటల వరకూ పట్టే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు రోజుల సమయం కూడా పట్టవచ్చు. అందుకే మీరు అనుకోకుండా చూయింగ్ గమ్ మింగినట్లైతే నీళ్లు ఎక్కువగా తాగడం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల దాన్ని తొందరగా శరీరం నుంచి బయటకు వెళ్లిపోయేలా చేయవచ్చు.
ఇది కూడా చదవండి: స్కేటింగ్ చేస్తుండగా విరిగిపోయిన మంచు.. సరస్సులో పడిపోయి నానా తిప్పలు.. వైరల్ వీడియో

అయితే చూయింగ్ గమ్ తినడం వల్ల ఎలాంటి హాని లేదా? అని అడిగితే ఉందనే చెప్పాలి. చాలా అరుదుగా కొన్ని కేసుల్లో దీనివల్ల మన పేగుల్లో ఇబ్బంది ఏర్పడవచ్చు. మలబద్ధకంతో బాధ పడుతున్న వారు, చాలా ఎక్కువ మోతాదులో చూయింగ్ గమ్ ని మింగినప్పుడు అది పేగుల్లోనే ఉండిపోయి పేగులు బ్లాక్ అయ్యేందుకు కారణంగా మారతుంది. అందుకే చిన్న పిల్లలను చూయింగ్ గమ్ లకు దూరంగా ఉంచేందుకు పెద్దలు ప్రయత్నిస్తుంటారు. చాలా అరుదైన కేసుల్లో చూయింగ్ గమ్ మింగడం వల్ల వాంతులు, కడుపు నొప్పి, మలబద్ధకం, విరేచనాలు వంటివి అవుతుంటాయి.


ఇది కూడా చదవండి: కనిపించకుండా పోయిన కిమ్ జాంగ్ భార్య.. ఏడాది తర్వాత మీడియా ముందుకు..
Published by:Hasaan Kandula
First published: