Sleep tips: రాత్రిళ్లు ఎలక్ట్రానికి వస్తువులు దగ్గర పెట్టుకుంటే నిద్ర పట్టదా? ఎందుకు అలా?

ప్రతీకాత్మక చిత్రం

నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. అయితే హాయిగా నిద్ర పోవాలంటే కొన్ని పద్దతులు రోజూ పాటిస్తే నిద్ర దానంతట అదే వస్తుందట. అయితే చాలామందికి నిద్ర సరిగా పట్టకపోవడానికి ఎలక్ట్రానికి వస్తువులు కారణమని అంటుంటారు. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం..

  • Share this:
    కరోనా (corona) నేపథ్యంలో జీవితాలు తలకిందులయ్యాయి. ఉద్యోగాలు ఊడిపోయాయి. వారికి ప్రశాంతత (peace) కరువైంది. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టని వారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి.  చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర (sleep) కూడా కరువు అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. అయితే హాయిగా నిద్ర పోవాలంటే కొన్ని పద్దతులు రోజూ పాటిస్తే నిద్ర దానంతట అదే వస్తుందట. అయితే చాలామందికి నిద్ర సరిగా పట్టకపోవడానికి ఎలక్ట్రానికి వస్తువులు కారణమని అంటుంటారు. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం..

    పుస్తకాలు...

    మీరు నిద్రపోవడానికి కొంత సమయం (time) పడుతుంది, కాబట్టి పడుకునే ముందు పుస్తకాలు (books) చదవడం వంటి ప్రశాంతమైన (peaceful) పనులు చేయండి. కొంతమందికి, ల్యాప్‌టాప్ (laptop) వంటి ఎలక్ట్రానిక్ పరికరాన్ని (electronic things) ఉపయోగించడం వల్ల నిద్రపోవడం కష్టమవుతుంది. ఎందుకంటే ఈ పరికరాల తెరల నుండి వెలువడే నిర్దిష్ట రకం కాంతి (light) వల్ల నిద్ర పట్టదు. మీకు నిద్రించడానికి ఇబ్బంది ఉంటే, నిద్రపోయే ముందు లేదా అర్ధరాత్రి (midnight) ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్‌ని వాడొద్దు.

    ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

    నిద్రకు ముందు (before sleep) రెండు, మూడు గంటలు ముందు ఎక్కువ భోజనం (food) తినొద్దు (don’t eat). ఒకవేళ ఆకలి (hungry)తో ఉంటే నిద్రపోవడానికి 45 నిమిషాల ముందు తేలిక పాటి చిరుతిండి (snacks)ని ప్రయత్నించండి.

    ఉదయం 3.30 నిమిషాల నుంచి 5.30..

    ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. ప్రతి ఒక్కరు బ్రహ్మ ముహూర్తం ( Brahma Muhurat)లో నిద్ర లేవాలని (wakeup) సూచిస్తున్నారు. అంటే తెల్లవారు జామున 3 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల లోపు నిద్ర లేవాలి. ఇలా బ్రహ్మ ముహూర్తంలో  నిద్రలేవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ (positive energy) మనకు వరిస్తుందట. తద్వారా మన ఆలోచనలు కూడా పాజిటివ్ రావడం, సమాజంలో అందరితోనూ ఆనందోత్సహాలతో జీవించడానికి వీలు ఉంటుందట. శరీరానికి కావలసిన శక్తి (energy) లభించడమే కాకుండా ఆరోగ్యంగా (healthy) కూడా ఉంటారు అట.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి
    Published by:Prabhakar Vaddi
    First published: