హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Pink Salt: ఈ ఉప్పులో 84 రకాల పోషకాలు ఉంటాయట.. ధర కూడా ఎక్కవేనట.. ఇంతకీ.. ఆ ఉప్పు ఎక్కడ దొరుకుతుందో తెలుసా

Pink Salt: ఈ ఉప్పులో 84 రకాల పోషకాలు ఉంటాయట.. ధర కూడా ఎక్కవేనట.. ఇంతకీ.. ఆ ఉప్పు ఎక్కడ దొరుకుతుందో తెలుసా

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

పింక్​ సాల్ట్​. అయితే ఈ ఉప్పుకీ ఓ స్పెషాలిటీ ఉందట. దీనిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 84 రకాల పోషకాలు ఉన్నాయట. అందుకేనేమూ దీని ధర(rate) కూడా ఎక్కువే. గులాబీ రంగు(pink color) రాతి ఉప్పులా ఉండే ఈ ఉప్పును హిమాలయాల్లోని రాతి స్పటికాలతో ఈ ఉప్పు(salt)ను తయారు చేస్తారు

ఇంకా చదవండి ...

పింక్​ సాల్ట్ (Pink salt)​. ఎక్కడైనా విన్నారా? అదే హిమాలయన్​ సాల్ట్(Himalayan salt)​. మామూలుగా హిమాలయన్​ ఉప్పులో చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకటి ఈ పింక్​ సాల్ట్​. అయితే ఈ ఉప్పుకీ ఓ స్పెషాలిటీ ఉందట. దీనిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 84 రకాల పోషకాలు ఉన్నాయట. అందుకేనేమూ దీని ధర(rate) కూడా ఎక్కువే. గులాబీ రంగు(pink color) రాతి ఉప్పులా ఉండే ఈ ఉప్పును హిమాలయాల్లోని రాతి స్పటికాలతో ఈ ఉప్పు(salt)ను తయారు చేస్తారు. ఇండియాతోపాటు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఈ ఉప్పును ఉత్పత్తి చేస్తున్నారు. హిమాలయా పర్వతాల మొదట్లో ఉండే సహజ నిక్షేపాల నుంచి ఈ ఉప్పును తయారు చేస్తారు. సాధారణ ఉప్పులా కాకుండా.. ఇందులో సహజంగానే అయోడిన్ ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్ ఆక్సైడ్(iron oxide) వల్ల ఈ ఉప్పు పింక్ కలర్‌లో ఉంటుంది. అయితే, ఇది చాలా అరుదుగా లభించే ఉప్పు. దాని వల్ల ఖరీదు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ ఉప్పు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటీ ఇప్పుడు తెలుసుకుందాం.

మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం..

హిమాలయన్ ఉప్పులో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంందులోని మెగ్నీషియం(mg), పొటాషియం(ka), కాల్షియం(ca), జింక్(zn) ఆరోగ్యానికి(health) మేలు చేస్తాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఉప్పును వంటకాల్లో వినియోగిస్తున్నారు. అప్పట్లో సముద్ర ప్రాంతంలో నివసించేవారికే ఉప్పును తయారు చేయడం సులభంగా ఉండేది. అయితే, సముద్ర తీరాలు లేని ప్రాంతాల్లో ఉప్పు లభించడం చాలా కష్టంగా ఉండేది. ఈ నేపథ్యంలో హిమాలయాల్లో రాళ్లకు అంటుకుని ఉండే స్పటికాలను కూడా ఉప్పుగా ఉపయోగించవచ్చని, అవి కూడా సాధారణ ఉప్పులా వంటకాల్లో కరుగుతాయని భావించి ఈ ఉప్పును వినియోగించడం మొదలుపెట్టారు.

పోషకాలు మెండుగా..

అయితే, ఇటీవల జరిగిన పరిశోధనల్లో ఆ ఉప్పులో పోషకాలు మెండుగా ఉన్నాయని తెలుసుకున్నారు. దీంతో ప్రజలు హిమాలయన్ ఉప్పు వినియోగానికి మొగ్గు చూపడం ప్రారంభించారు. సాధారణ ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్, స్ట్రోక్, గుండె జబ్బులు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే.. సాధారణ ఉప్పుకు ప్రత్యామ్నాయంగా హిమాలయన్ సాల్ట్‌ను ఉపయోగించడం మొదలుపెట్టారు. ఎందుకంటే శరీరం ఈ ఉప్పును అరిగించుకోడానికి పెద్దగా శ్రమించక్కర్లేదు.

ఇది కూడా చదవండి:  ఈ ఆహారం తీసుకుంటే క్యాన్సర్​ ముప్పును దూరం చేయొచ్చంట.. అదేంటో తెలుసా

84 రకాల సూక్ష్మ పోషకాలు..

శరీరంలో హైడ్రేషన్ స్థాయిలను సమతుల్యంగా ఉంచేందుకు ఈ ఉప్పు అవసరమవుతుందట. వ్యాయామానికి ముందు లేదా ఆ తర్వాత తగినంత ఉప్పునీరు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఈ ఉప్పులో 84 రకాల సూక్ష్మ పోషకాలు (84 types of micronutrients) ఉంటాయి. తామర వంటి వివిధ చర్మ పరిస్థితుల నుంచి ఈ ఉప్పు ఉపశమనం కలిగిస్తుంది. తామరతో బాధపడేవారు ఈ ఉప్పును నీటిలో కలిపి స్నానం చేస్తే మంట నుంచి ఉపశమనం లభిస్తుందని నేషనల్ ఎగ్జిమా అసోషియేషన్ సిఫార్సు చేసింది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ‘సాల్ట్ థెరపీ’ చేస్తుంటారు.

First published:

Tags: Food, Health Tips, Life Style, Pink, Salt