DO YOU KNOW THESE MYTHS ABOUT DENGUE FEVER AND COVID 19 RNK
Dengue: డెంగీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు!
ప్రతీకాత్మక చిత్రం
డెంగీని నివారించడానికి ఉత్తమ మార్గం.. దోమలను నివారించడం. డెంగీ బారిన పడిన వారు త్వరగా కోలుకోవడానికి కొన్ని ఆహారపు అలవాట్లు, వారి జీవనశైలిలో మార్పులు చేసుకోవడం మంచిది. డెంగీ నీరు నిలిచిన చోట దోమల బ్రీడింగ్ వల్ల వ్యాధి పెరుతుంది. అయితే, ఆరోగ్య నిపుణులు కొన్ని ఉత్తమ మార్గాలను సూచించారు..
ఒకవైపు డెంగీDengue కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కొవిడ్ covid-19 ముప్పు కూడా పూర్తిగా పోలేదు. దీని కంటే డెంగీ భయంకరంగా ఉంది. వీటి కొత్తరకం వేరియంట్లు ఇలా భయపడటానికి కారణం. కొన్ని నిజాలు ఇటీవలె నిపుణులు బయటపెట్టారు. అవేంటో తెలుసుకుందాం.
అపోహలు డెంగీ.. కరోనా వలె కాకుండా తేలికైన ఇన్ఫెక్షన్?
corona కరోనా సమయంలో డెంగీ జ్వరం కూడా వ్యాప్తి చెందుతోంది. అందుకే ఈ లక్షణాలు కాస్త గందరగోళంగా ఉన్నాయి. రోగనిర్ధారణ, చికిత్సకు ఆలస్యం మాత్రమే కాదు కరోనా మాదిరి ఇది ప్రాణాంతక ఇన్ఫెక్షన్ కాదని భావిస్తారు. అయితే, బ్రేక్‌బోన్ ఫీవర్ అని పిలిచే డెంగీ చాలా ప్రమాదకరమైంది. సకాలంలో వైద్యం తీసుకోకపోతే అనేక సమస్యలకు కారణమవుతుంది. డీ2 సెరోటైప్ అని పిలుస్తున్న కొత్త వేరియంట్‌లో తీవ్రమైన లక్షణాలతోపాటు జ్వరం, అనేక సందర్భాల్లో మరణం కూడా సంభవిస్తుంది. డెంగీ తీవ్రమైన లక్షణాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, రక్తం గడ్డకట్టడం, కిడ్నీఫెయీల్యూర్, మతిమరుపు వంటివి సంభవిస్తున్నాయి.
డెంగీ, కొవిడ్ రెండు ఒకేసారి రావు?
డెంగీ, కొవిడ్ రెండు కలిపి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఏ కొద్దిపాటి లక్షణాలు కనిపించినా.. పరీక్ష చేయించుకోమని వైద్యులు సూచిస్తున్నారు.
కొవిడ్, డెంగీలో కొన్ని లక్షణాలు సాధారణం. ఇవి రెండు కలిసి వస్తే.. శరీరంపై తీవ్ర ఒత్తిడి కలుగుతుంది. అందుకే కొవిడ్ నియమాలను ఇంకా పాటించాలని చెప్పేది.
ఏ దోమ కుట్టినా .. డెంగీ వస్తుందా?
డెంగీ వైరస్ సోకిన దోమకాటు వల్ల ప్రధానంగా వ్యాపిస్తుంది. కానీ, ప్రతీ దోమకాటు డెంగీ అని అనుకోకూడదు. డెంగీ కేవలం ఏడిస్ దోమ వల్ల కలుగుతుంది. అది కూడా ఆడది. మగ ఏడిస్ కాటువేయదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం దోమ కాలు వేసిన వారం రోజుల వరకు వైరస్‌ను తీసుకెళ్లగలదు. ఇతరులకు వ్యాపింపజేస్తుంది కూడా. ఇవి కేవలం పగటిపూట ఎక్కువ సమయం మోకాలి కింద, చీలమండలం లేదా మోచేతుల చుట్టూ కొరుకుతుందని వైద్యులు చెబుతున్నారు.
కేవలం పిల్లలు, వృద్ధులకే డెంగీ ప్రమాదం?
డెంగీ ఇన్ఫెక్షన్ వీరికి తీవ్రంగా ఉండవచ్చు. కానీ, కేవలం వారికి మాత్రమే సోకుతుందని తప్పుగా భావించకూడదు. ఈ రెండు వయస్సుల వారు మాత్రమే కాదు..బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న ఆరోగ్యవంతులు కూడా డెంగీ బారిన పడవచ్చు.. తీవ్రమైన లక్షణాలు అభివృద్ధి చేయవచ్చు.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.