Almonds: బాదం ఆరోగ్యానికి అంత మంచిదా.. రోజుకు ఎన్ని తినాలి

బాదం

హెల్త్ కావాలంటే హెల్తీ ఫుడ్ తినాలి, మరింతకీ హెల్తీ ఫుడ్ అంటే ఏంటి.. సీజనల్ పళ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, నట్స్ కూడా..

  • Share this:
రోజూ గుప్పెడు బాదం తింటే బోలెడన్ని పోషకాలు మీ ఒంట్లో వచ్చి చేరతాయన్న సీక్రెట్ తెలిసీ మీరెందుకు మరిచిపోతున్నారు? మీ రొటీన్లో భాగంగా ఇలా ఆల్మడ్స్ ను తినండి. మీరు ప్రయాణంలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా ఓ నాలుగు బాదంలు తినలేరా? రుచికరమైన, ఆరోగ్యకరమైన, పుష్కలంగా పోషకాలున్న బాదంలు మీకు మంచి ఫిట్నెస్ కూడా ఇస్తాయి. బరువు పెరగాలన్నా, బరువు తగ్గాలన్నా(Weight loss), ఇన్స్టంట్ ఎనర్జీ కావాలన్నా, ఫిట్నెస్ ఫ్రీక్స్ (fitness freaks) అయినా, వేగన్స్ (vegans) అయినా మీరు బాదంను ఆశ్రయించాల్సిందే. రుచికి, ఆరోగ్యానికి కేరాఫ్ గా నిలుస్తున్న ఆల్మండ్ తో ఆల్మండ్ మిల్క్, ఆల్మండ్ స్నాక్స్, ఆల్మండ్ బటర్ వంటి వెరైటీలు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ ఫుడ్ గా నిలుస్తోంది. నిగనిగలాడే చర్మం కోసం, చెక్కిన శిల్పంలా ఉన్న శరీరం కోసం, ఆరోగ్యం కోసమైనా ఆల్మండ్ చక్కగా పనిచేస్తాయి. మరి వాటిని ఎంత తినాలి అనేగా మీ అనుమానం. బాదం గింజలను పరిశీలనగా చూస్తే వీటి సైజులు, షేపుల్లో ఉన్న మార్పులు మీరు గుర్తించగలరు. ప్రపంచ వ్యాప్తంగా పండే బాదంలతో ఎన్నో వెరైటీ వంటలు వండుతారు. స్వీట్లు, హాట్లలో కూడా బాదంను ఉపయోగిస్తారు. సంప్రదాయ వంటకాల్లోనూ బాదంల వాడకం ఎక్కువ. దీనికంతా కారణం వీటిలోని పోషకాలే. నిజానికి ఇది బెస్ట్ వింటర్ ఫుడ్ కూడా.

గుప్పెడు ఆల్మండ్స్‌లొ ఉన్న పోషకాలు..
కెలరీలు: 161
ఫైబర్: 3.5 గ్రాములు
ప్రొటీన్ఛ 6 గ్రాములు
కార్బ్స్: 2.5 గ్రాములు
ఫ్యాట్: 14 గ్రాములు
37శాతం ఈ విటమిన్
32శాతం మెగ్నీషియం

తరచూ ఆల్మండ్స్ తింటే కలిగే ప్రయోజనాలు బోలెడన్ని ఉన్నాయి. చిన్నపిల్లలైనా, పెద్దవారికైనా మంచి పోషకాలు అందించే ఆల్మండ్స్ భలే యమ్మీగా ఉంటాయి. షుగర్ కోటెడ్, పచ్చివి, వేయించినవి ఎలా తిన్నా బాదం రుచికి వేరే ఏదీ సాటిరాదు. శరీరంలోని కొవ్వు నిల్వలను రెగ్యులేట్ చేసే శక్తి దీనికి ఉంది. హై బీపీతో బాధపడుతున్న వారికి బాదంలు బాగా పనిచేస్తాయి. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొవ్వును తగ్గించేలా పనిచేసే గుప్పెడు బాదంలు విటమిన్లను అందిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసే శక్తి కూడా దీనికి ఉంది.

ఎముకల ద్రుఢత్వానికి..
శాకాహారులు, వేగన్లు క్యాల్షియం లోపంతో బాధపడతారనే ప్రచారం ఎక్కువగా ఉంది. కానీ రోజూ బాదంలు తీసుకుంటే క్యాల్షియం లోపం అధిగమించవచ్చు. పాలల్లో ఉన్న నాలుగోవంతు క్యాల్షియం ఆల్మండ్స్ లో ఉంటుంది. ఫ్రాక్చర్లు కాకుండా ఎముకలను బలోపేతం చేసే సత్తువ బాదంకు ఉంది. బాదంలో పాస్ఫరస్ కూడా ఎక్కువగా ఉంటుంది.

ఏజింగ్ కు కళ్లెం
ఎక్కువ యాంటీఆక్సిడెంట్లున్న బాదంలతో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. స్ట్రెస్ ను తగ్గించి, మానసికంగా సంతోషం ఉండేలా చేస్తుంది కూడా. త్వరగా వయసు మీదపడకుండా (Aging) ఇందులోని ఈ విటమిన్ సాయపడుతుంది. శరీరంలో కొత్త కణాలను బాగా వృద్ధి చేసేలా ఈ నట్స్ పనిచేస్తాయి. ఇప్పటి వరకు చికిత్స లేని అల్జీమర్స్ పై బాదంలు బాగా పనిచేస్తున్నాయి.

షుగర్ ఉన్నవారికి మంచిది
మితంగా బాదంలు తినటం షుగర్ ఉన్నవారికి చాలా మంచి చేస్తుంది. పోషకాల లేమిని అధిగమించేలా చేసి, బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచేలా ఇది చక్కగా పనిచేస్తుంది. తక్కువ కార్బోహైడ్రేట్లు , ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల గ్లూకోజ్ ను నియంత్రిస్తుంది. ఇందులోని మెగ్నీషియం బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. మాములుగా డయాబెటిక్ పేషంట్లకు మెగ్నీషియం లోపం ఉంటుంది కనుక వీరికి బాదంలు అత్యవసరం. టైప్-2 డయాబెట్స్ ను (type-2 diabetics) నియంత్రిస్తుంది.

బరువు తగ్గాలంటే..
బరువు తగ్గటంలో ఇది బాగా పనిచేస్తుంది. తక్కువ కార్బ్స్, కెలరీలు ఉండటం వల్ల బాదంలు తింటే బరువు తగ్గుతారు. అలాగని కప్పులకొద్దీ బాదంలు లాగిస్తే బరువు అమాంతం పెరుగుతారు. తరచూ ఆకలిగా ఉండి, ఎక్కువ తిండి తినేవారు బాదంలు కొన్ని తింటే చాలు కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఇందులోని ప్రొటీన్లు తిండి తక్కువ తినేలా చేస్తాయి. ఆకలిని అదుపులో ఉంచేలా చేసే బాదంలు ఎప్పుడూ మీ బ్యాగులో ఉంచండి. ఆకలి బాగా వేసినప్పుడు బింజ్ ఈటింగ్ చేయకూడదంటే గుప్పెడు బాదంలు తినేసి, నీరు తాగండి.

సెలీనియంతో స్ట్రెస్ దూరం
డిప్రెషన్, మానసిక ఒత్తిడి, యాంగ్జైటీ వంటి రుగ్మతలకు బాదం చక్కగా పనిచేస్తుంది. ఇందులోని సెలీనియంలో ఉన్న ఔషధ గుణాలే ఇందుకు కారణం. ఫర్టిలిటీ బూస్టర్ గా కూడా ఇది సాయపడుతుంది.

మరి రోజుకు ఎన్ని ఆల్మండ్స్ తినాలంటే..
రోజూ 8-10 బాదంలు తింటే చాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అతిగా తింటే అజీర్ణం, మందం అయి, బరువు కూడా విపరీతంగా పెరుగుతారు. బాదంలు అతిగా తింటే శ్వాసకోస సమస్యలు వస్తాయి.
Published by:Sumanth Kanukula
First published: