కొన్ని రకాల చెడు అలవాట్లతో బాడీ మెటబాలిజం metabolism పూర్తిగా హరించేస్తుంది. ఆ వివరాలు తెలుసుకుందాం. కేలరీలు తగ్గడం...
వెయిట్ లాస్‌కు కేలరీలు తక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవడం మంచిదే. కానీ, మరీ తక్కువ మోతాదులో ఉండటం వల్ల బాడీ మెటబాలిజం రేటు తగ్గిపోతుంది.
కదలకుండా ఒకే ప్రాంతంలో పనిచేయాల్సిన ఉంటుంది. వర్క్ ఫ్రం హోం వంటి పనులతో పూర్తిగా ఎక్కువసేపు కూర్చొని పనిచేయాల్సి ఉంటుంది. ఇది జీవక్రియ రేటుతోపాటు పూర్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వ్యాయామం చేయడం, ఆటల వల్ల కేలరీలు తగ్గించుకోవచ్చు. నిలబడటం, క్లీనింగ్, మెట్లు వాడటం, శారీరక శ్రమ పెరగడం వల్ల కేలరీలు కరగడానికి ఉపకరిస్తాయి.
చక్కెర ఉన్న పానియాలు తాగడం వల్ల శరీరంలో ఇన్సూలిన్ స్థాయి పెరిగిపోతుంది. దీనివల్ల ఒబేసిటీ, డయాబెటీస్ వస్తుంది. ఒక స్పూన్ షుగర్‌లో 55 శాతం ఫ్రక్టోజ్ ఉంటుంది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల బాడీ మెటబాలిజం తగ్గిపోతుంది.
ప్రోటీన్ల స్థాయి..
ప్రోటిన్లు పుష్కలంగా ఉన్న ఫుడ్‌ను తీసుకోవడం శరీరానికి ఎంతో అవసరం. ఎక్కువ ప్రోటిన్ ఆహారం వల్ల శరీరంలో కేలరీలు బర్న్ చేసే కెపాసిటీ పెరగడంతోపాటు జీర్ణక్రియ తర్వాత జరిగే జీవక్రియ పెరుగుదలను థర్మిక్ ఎఫెక్ట్ అంటారు. ప్రోటిన్ థర్మిక్ ప్రభావం పిండి పదార్థాలు లేదా కొవ్వు కంటే చాలా ఎక్కువ. ప్రోటిన్ల వల్ల 20–30 శాతం జీవక్రియను పెంచుతుంది. కార్బొహైడ్రేట్లకు 5–10 శాతం, ఫ్యాట్ 3 శాతం లేదా అంతకంటే తక్కువ జీవక్రియ రేటును అనివార్యంగా తగ్గిస్తుంది.
సరైన నిద్ర..
నిద్ర శరీరంపై ఎంతో ప్రభావం చూపుతుంది. తక్కువ నిద్రపోవడం వల్ల అనేక రోగాలు వస్తాయి. డిప్రెషన్, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. దీంతో మెటబాలిక్ రేటు కూడా పడిపోతుంది. రోజంతా చిరాకు, బరువు పెరగడం వంటివి జరుగుతాయి.
బ్రేక్‌ఫాస్ట్..
చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తారు. దీనివల్ల కూడా మెటబాలిజం పై ప్రభావం పడుతుంది. పడుకున్న సమయంలో దీనిరేటు తగ్గుతుంది. బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల తిరిగి ఫాస్ట్ అవుతుంది.
మద్యం..
ప్రతిరోజూ ఒక గ్లాస్ మందు తాగితే ఏమవుతుంది అనుకుంటారు. కానీ, వారం మొత్తం తాగితే మెటబాలిజం రేటుపై ప్రభావం చూపుతుంది.
రీఫైన్డ్ కార్బొహైడ్రేట్స్...
ఫ్రూట్స్, వెజిటేబుల్స్‌లో కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. తెల్లగా ఉండే చక్కెర వంటివి రీఫైన్డ్ చేసినవి. అధిక ఫైబర్ తృణధాన్యాలు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. పోషకాలను విచ్చిన్నం చేయడానికి శరీరానికి ఇది కష్టతరమవుతుంది. స్ట్రిక్ట్ డైట్..
బరువు తగ్గించుకోవడం ముఖ్యమని తగినంత తినకపోతే జీవక్రియ నెమ్మదిగా మార్పులు జరుగుతాయి. తగినంత నీరు తీసుకోవడం....
శరీరానికి సరిపోయే నీటిని తీసుకోకపోతే మెటబాలిజం రేటు పడిపోతుంది. నీరు ఎక్కువ శాతం ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి. స్ట్రెస్..
బాగా స్ట్రెస్‌లో ఉన్నపుడు శరీరం కార్టిసల్ అనే హార్మొన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే మీ శరీరానికి శక్తినిచ్చే ఫుడ్ అవసరమని అర్థం. ఇది ఎక్కువవుతే కష్టం.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.