హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Side effects of Cigarettes: సిగరెట్​ తాగితే మీ కనుచూపు పోయే ప్రమాదం ఉందట.. తస్మాత్ జాగ్రత్త

Side effects of Cigarettes: సిగరెట్​ తాగితే మీ కనుచూపు పోయే ప్రమాదం ఉందట.. తస్మాత్ జాగ్రత్త

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎంతోమంది పురుషులే కాకుండా, పలుచోట్ల లో స్త్రీలు కూడా సిగరెట్(cigarette)  తాగడం అలవాటు చేసుకుంటున్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయారు. వీటి వల్ల ప్రాణాలు తొందరగా కోల్పోతున్నారు. ఎక్కువగా వయసు పైబడిన వారి కంటే వయసులో ఉన్న వారే సిగరెట్లు తాగుతున్నట్టు అధ్యయనంలో తేలింది. అయితే సిగరెట్​ తాగడం వల్ల కంటి సమస్యలు (eye problems) కూడా వస్తున్నాయట.

ఇంకా చదవండి ...

  ఇప్పటి యువత ఎక్కువగా సిగరెట్(cigarette) తాగడం ఓ అలవాటుగా మార్చుకున్నారు. ఇక అదొక ఫ్యాషన్ గా అనుకుంటున్నారు. సిగరెట్, మద్యం తాగితే హానికరమని(harmful) ఎంతలా చెప్పినా వినిపెంచుకోరు. పైగా సోషల్​ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. కానీ, ఈ వ్యసనాలే భవిష్యత్తులో అనారోగ్యాలను తెచ్చిపెడుతాయి. మద్యం తాగినే ఎలాంటి అనర్థాలు(Side effects ) కలుగుతాయో తెలిసిందే. ఇక సిగరెట్​ అయితే కేన్సర్(cancer)​ ముప్పు ఎక్కువగా వస్తుంది. వారికే కాదు వారి పక్కనున్నవారికీ క్యాన్సర్​ ప్రమాదం లేకపోలేదు. ఇలా ఎంతోమంది పురుషులే కాకుండా, పలుచోట్ల లో స్త్రీలు కూడా సిగరెట్(cigarette)  తాగడం అలవాటు చేసుకుంటున్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయారు. వీటి వల్ల ప్రాణాలు తొందరగా కోల్పోతున్నారు. ఎక్కువగా వయసు పైబడిన వారి కంటే వయసులో ఉన్న వారే సిగరెట్లు తాగుతున్నట్టు అధ్యయనంలో తేలింది. అయితే సిగరెట్​ తాగడం వల్ల కంటి సమస్యలు (eye problems) కూడా వస్తున్నాయట. ఆ విషయం తెలుసుకుందాం..

  సిగరెట్ తాగడం వల్ల ఎక్కువ ఊపిరితిత్తులు(kidneys), గుండెకు సంబంధించిన వ్యాధులు(diseases) వస్తుంటాయి. ఇప్పటివరకు ఎక్కువగా సిగరెట్లు తాగిన వాళ్ళల్లో చాలామంది గుండెకు, ఊపిరితిత్తుల సమస్యలతో మరణించారు. కానీ తాజాగా చేసిన అధ్యయనం ప్రకారం సిగరెట్ ఎక్కువ తాగితే కంటి చూపు(eye site) కోల్పోయే ప్రమాదం ఉందట. సిగరెట్ లో న్యూరో టాక్సిక్ కెమికల్స్ ఎక్కువగా ఉండటం వల్ల వాటి ప్రభావం కళ్ళపై పడటం వల్ల కంటి చూపు పోతుందని వారి అధ్యయనంలో తేలింది.

  ఇకనైనా మంచి ఆరోగ్యం కోసం సిగరెట్ తాగే ప్రతి ఒక్కరు మానుకోవాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. మూత్రాశయం, కాలేయం వంటి అవయవాలు కూడా దెబ్బతింటాయి. అంతేకాకుండా క్యాన్సర్ వ్యాధులు కూడా వ్యాపించే ప్రభావం ఉందని వైద్య నిపుణులు తెలిపారు.

  మెదడువాపు, శ్వాసకోశ ఇబ్బందులు, అలర్జీ, తీవ్రమైన దగ్గు వంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇదే కాకుండా రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. సిగరెట్లు ఎక్కువగా తాగడం వలన లంగ్ క్యాన్సర్ కూడా వస్తుంది. ఇతరులు సిగరెట్ తాగేటప్పుడు పొగను పీల్చినా వారికి కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. రోజుకొక సిగరేటు తాగితే రక్తనాళాలకు హాని కలుగుతుంది. కేవలం ఒక్క సిగరెట్ తీసుకోవడం వల్ల రక్తనాళాలు గట్టిపడి గుండెపై ప్రభావం చూపుతుంది.

  సిగరెట్ తాగాలనిపించినప్పుడు వ్యాయామం చేస్తే కూడా మర్చిపోయే అలవాటు ఉంటుంది. ఎప్పుడైనా అలా అనిపించిన సమయంలో రన్నింగ్ లేదా వాకింగ్ లాంటివి చేయాలి. అంతేకాకుండా గార్డెనింగ్ వంటి మొక్కలతో సమయాన్ని గడపాలి. వీటివల్ల సిగరేటు పై దృష్టి అనేది ఎక్కువగా పోదు. అందుకే సిగరెట్​ తాగేవారు ఇప్పటికైనా తగ్గించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. హాయిగా జీవించండి.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Cancer, Health benefits, Health Tips, Smokers

  ఉత్తమ కథలు