హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Rat eaters: ఆ జాతి ప్రజలకు ఎలుకలే ఆహారం.. అలాంటి ప్రజలు లక్షల్లో ఉన్నారట.. ఎక్కడంటే

Rat eaters: ఆ జాతి ప్రజలకు ఎలుకలే ఆహారం.. అలాంటి ప్రజలు లక్షల్లో ఉన్నారట.. ఎక్కడంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చికెన్​, మటన్​, చేపలు, రొయ్యలు తదితరాలను ఇష్టంగా తింటాం. అయితే కొన్ని ప్రాంతాల ప్రజలు మాత్రం ఎలుకలు(Rats) కూడా తింటారంటా. అవును మీరు విన్నది నిజమే. అది కూడా మనదేశంలోని లక్షలాది మంది ఎలుకలే వారికి ఆహారం అంట.

  ఆహారం(food) . ప్రతీ మనిషికి కావాల్సిందే. తినకుండా ఏ మనిషీ ఎక్కువరోజులు బతకలేడు. ఎవరో హిమాలయాల్లో, ఎక్కడో తపస్సు చేసుకునే వారు అలా అన్నపానీయాలు ముట్టుకోకుండా బతుకుతారని అంటూ ఉంటారు. కానీ, ఆధునిక యుగంలో ప్రజలకు ఆహారం చాలా ముఖ్యం. కాకపోతే ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆహారపు అలవాట్లు ఉంటాయి. అక్కడి పంటల(crops) ఆధారంగా ఆహారం దొరుకుతుంది. మన దేశంలో అయితే ఎక్కువగా వరిపైనే ఆధారపడుతాం. మనలో వెజీటేరియన్ (vegetarian)​, నాన్​ వెజిటేరియన్ (non vegetarian)​ అంటూ భోజనాలు ఆరగిస్తారు. శాఖాహారుల వరకు ఒకే కానీ, నాన్​ వెజిటేరియన్ల మాత్రం కొద్దిగా భోజన ప్రియులే. తమ ఆహారంలో ఎక్కువగా మాంసాన్ని ఉంచుకుంటారు. అయితే మామాలూగా అయితే చికెన్​, మటన్​, చేపలు, రొయ్యలు తదితరాలను ఇష్టంగా తింటాం. అయితే కొన్ని ప్రాంతాల ప్రజలు మాత్రం ఎలుకలు(Rats) కూడా తింటారంటా. అవును మీరు విన్నది నిజమే. అది కూడా మనదేశంలోని లక్షలాది మంది ఎలుకలే వారికి ఆహారం అంట. ఈరోజుల్లో కూడా ఎలుకలు తినే వ్యక్తులు ఉంటారంటే నమ్మకం కలగడం లేదా. అయితే ఓ సారి తెలుసుకుందాం..

  ముసాహర్లు(Musahar).. వీరే ఎలుకలను తమ ఆహారంగా తీసుకుంటారు.  బిహార్(bihar), ఉత్తర ప్రదేశ్(Utthar Pradesh), త్రిపుర(Tripura), అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రలన్నింటిలో కలిపి ఈ తెగ జనాభా దాదాపు 2.5 మిలియన్లపై మాటే. అనేక సంవత్సరాలుగా నిరాక్షరాస్యత వల్ల, కేవలం వ్యవసాయ కూలీలుగా(coolie) మాత్రమే పనిచేయగలిగిన వీరు కడు బీదరికాన్ని జయించడానికి... ఆకలి(hungry) పోరును ఆపడానికి ఎలుకలపై ఆధార పడ్డారట. ఎలుకల(rats)ను పట్టి, వాటిని చంపి వండుకొని తినడం వీరికి తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.

  ముసాహర్ సంప్రదాయం వారి వారసత్వానికి కూడా వచ్చింది. సంచార జాతులుగా జీవించే వీరు సాధ్యమైనంత వరకు తమకు దొరికే ఏ కూలిపనో చేసుకుంటారు. దినసరి కూలీలుగా జీవిస్తారు. ఇక  చేయడానికి ఏ పని కూడా దొరకని రోజున.. ఉన్న కొద్ది బియ్యాన్ని వండుకొని.. ఎలుకలను బాగా కాల్చి నంచుకొని తింటామని చెబుతున్నారు. అయితే ఎలుకలను చంపి తినడం వల్ల వీరికి ఆరోగ్యపరంగా కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయట. అయినా వీరు ఈ అలవాటు మానలేకపోతున్నారు. సంచార జాతులు కావడం వలన వీరు ప్రభుత్వ పథకాలకు కూడా నోచుకోలేకపోతున్నారు. కనీసం రేషన్ కార్డు, ఓటరు కార్డు, ఆధార్ కార్డు అంటే కూడా తమకు ఏంటో తెలియదని.. కేవలం ఊర్లు తిరిగి.. దొరికిన పనిచేసుకొనే జీవితాలు తమవని ఎంతో ఆర్ద్రతతో చెబుతుంటారు ఈ ముసాహర్ తెగవాళ్లు. అయితే మన దేశంలోనే కాదు చైనా, జపాన్​ తదితర దేశాల్లో పాములు కూడా తినేవారు ఉన్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Assam, Food, Meat, Rats, Uttar pradesh, West Bengal

  ఉత్తమ కథలు