టైటానిక్ (Titanic) ఓడ గుర్తుంది కదా.. 1912 నవంబర్ 14న సముద్రం(sea)లో ప్రయాణిస్తూ మార్గమధ్యలో ఐస్ బర్గ్(Ice berg)ను ఢీకొని, సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది(sunken). ఈ ఘటన తర్వాత హాలీవుడ్(Hollywood)లో టైటానిక్ పేరుతోనే చిత్రం కూడా తెరకెక్కింది. ఆ సినిమా ప్రపంచ సినీ రికార్డులను సైతం తిరగరాసింది. అంతేనా ఓ అపురూప ప్రేమ కావ్య చిత్రంగా ఇప్పటికీ చెప్పుకుంటారు సినీజనం. అయితే సముద్రం అడుగున(In sea) ఉన్న ఈ టైటానిక్.. మరికొన్ని ఏళ్లే కనిపించనుంది. 109 ఏళ్లు దాటినా ఆ ఓడ అవశేషాలు మరికొన్ని ఏళ్లల్లో అవి కనిపించవని పరిశోధకులు(Experts) అంటున్నారు. ఒక రకమైన బ్యాక్టీరియా(bacteria) టైటానిక్ అవశేషాలను వేగంగా (Fastly) తినేస్తోందని(eating) చెబుతున్నారు. మరో 12 ఏళ్లల్లో టైటానిక్ అని చెప్పుకోవడానికి నీళ్లల్లో(water) ఒక్క ముక్క కూడా మిగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటికే టైటానిక్‌కి సంబంధించిన లోహ భాగాలను దెబ్బతిన్నాయని తెలిపారు.
14 ఏళ్ల తర్వాత తొలిసారిగా కలాడన్ ఓషియానిక్ అనే కంపెనీకి చెందిన డైవర్లు టైటానిక్ దగ్గరకు వెళ్లారు. అట్లాంటిక్ ప్రొడక్షన్స్ అనే సంస్థ దానిపై డాక్యుమెంటరీ(documentary) తీస్తోంది. అందులో భాగంగానే కంపెనీ డైవర్లు 4కే రెజల్యూషన్ కెమెరాతో ఫొటోలు, వీడియోలు తీశారు.1997లో దాని షిప్పు పరిస్థితిని, ఇప్పటి స్థితిని పోల్చి చూశారు. డెక్కు సైడ్ భాగంలో పెద్ద రంధ్రం పడిందని, అది ముక్కలైపోతోందని నిర్ధారణకు వచ్చారు.
‘‘టైటానిక్ షిప్పు ఇలా దెబ్బతినడం షాక్కు గురిచేసింది. మున్ముందు ఇలాగే కొనసాగుతుంది. షిప్ నామ రూపాల్లేకుండా పోతుంది” అని టైటానిక్ చరిత్రకారుడు పార్క్ స్టీఫెన్సన్ అన్నారు. టైటానిక్ షిప్పులోని ఫేమస్ కెప్టెన్ బాత్ టబ్ ఇప్పుడు కనుమరుగైపోయిందని చెప్పారు. అయితే టైటానిక్ ఇలా నాశనమవడం సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియేనని సైంటిస్ట్ లోరి జాన్సన్ చెప్పారు. బ్యాక్టీరియా కమ్యూనిటీ (Bacteria community) మొత్తం ఒకే చోటకు చేరి ఓడ(ship) శకలాలను తినేస్తాయని వివరించారు. డాక్యుమెంటరీలో భాగంగా కెనడాలోని న్యూఫౌండ్లాండ్ వద్ద ఐదు సార్లు సముద్రం అడుగున ఉన్న టైటానిక్(titanic) దగ్గరకు వెళ్లొచ్చారు డైవర్లు. బెల్ఫాస్ట్ అండ్ వూల్ఫ్ షి ప్యార్డ్ ఈ షిప్పును తయారు చేసింది.
దాదాపు 4,000 మీటర్ల లోతులోని సముద్రం(Ocean)లో టైటానిక్ ఒక్కటే కాదు భారీ శిథిలాలు ఉన్నాయి. మొదటగా చెప్పుకోవాల్సింది హలోమోనాస్ సూక్ష్మజీవి గురించి. శిథిలాలు సముద్రతీరానికి చేరుకున్నప్పుడు అవి పెద్ద సంఖ్యలో దాని మీదకి చేరుతాయి.. ఇది ఇతర జాతులపై మరింత దాడి చేయడానికి ఒక స్థావరాన్ని అక్కడే ఏర్పాటు చేస్తుంది. దీంతో సూక్ష్మజీవులు శిథిలాల మీద జిడ్డు గల పొరను ఏర్పరుస్తాయి. ఇవే వాటికి స్థావరాలు. ఈ జీవి శిథిలాలోని ఇనుమును నెమ్మదిగా తినేస్తుంది. తద్వారా ఓడ క్షీణతకు దారితీస్తుంది. మరికొన్ని సూక్ష్మజీవులు హలోఫిల్స్, అవి అధిక ఉప్పు సాంద్రత కలిగిన వాతావరణాలను ఇష్టపడతాయి. లోహం వాటి ప్రధాన వనరు. ఫ్లాగెల్లా అనే సూక్ష్మజీవి సాధారణంగా రంగు లేనిది లేదా పసుపురంగు రంగు కలిగి ఉంటాయి. ఇవి కూడా టైటానిక్ని తినేస్తున్నాయంట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ocean, Scientist, Titanic movie, Water