Condom History: కండోమ్​ల చరిత్ర తెలుసా.. రబ్బరు రాకముందు దేనితో తయారు చేసేవారంటే..

ప్రతీకాత్మక చిత్రం

రబ్బరు లేక ముందు కూడా కండోమ్​ల వినియోగం ఉండేది. అప్పటి నుంచి ప్రస్తుతం ఇప్పుడున్న కండోమ్​ల వరకు చరిత్ర గమనిస్తే..

  • Share this:
    సంతాన నియంత్రణకు కండోమ్​ల వినియోగమే ఉత్తమైన మార్గం. గర్భనిరోధక మాత్రలు ఉన్నా సేఫ్ సెక్స్​ కు కండోమ్​లే బెస్ట్​. ప్రస్తుతం మార్కెట్లలో లాటెక్స్​​ (రబ్బరు) కండోమ్​లు విరివిగా దొరుకుతున్నాయి. రకరకాల బ్రాండ్లు, ఫ్లేవర్లలో లభిస్తున్నాయి.

    రబ్బరుతో కండోమ్​లను తయారు చేయడం 1855లో కనుగొన్నారు. అయితే అంతకు ముందు కూడా కండోమ్​ల వినియోగం ఉంది. మరి ఎలా తయారు చేసే వారంటే..

    పురాతన కాలంలో ఈజిప్షియన్లు జిడ్డుగా ఉండే జంతువుల చర్మం, పేగులతో కండోమ్​లు తయారు చేసుకొని వాడేవారట. ఇక రోమ్​లోని కొందరు సైనికులు.. తమ చేతిలో ఓడిన ప్రత్యర్థుల చర్మాలని ఒలిచి కండోమ్​లు చేసుకునేవారు. వాటికి విక్టరీ కండోమ్​లని పిలిచేవారని చరిత్ర చెబుతోంది. రబ్బర్ కండోమ్​లకు ముందు అంతా ఎక్కువగా జంతువుల చర్మం, పేగులతో చేసినవే వాడేవారు. అయితే ఇవి గర్భనిరోధానికి ఉపయోగపడినా, లైంగిక వ్యాధుల నుంచి కాపాడేవి కాదని ఓ సీనియర్ ప్రొఫెసర్ వెల్లడించారు.

    ప్రతీకాత్మక చిత్రం


    ఇప్పటికీ జంతువుల చర్మంతో తయారు చేసే కండోమ్​లు ఉన్నాయి. లంబ్​స్కిన్ కండోమ్​లు అంటే అవే. వాటిని ఇప్పటికీ జంతువుల పేగులతోనే తయారు చేస్తున్నారు. అయితే ఇవి గర్భనిరోధానికి పని చేస్తాయే కానీ, సెక్స్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్​ను ఆపలేవు. అందుకే వీటిపై హెచ్చరిక కూడా ఉంటుంది. అయితే వీటి వాడకం మాత్రం చాలా తక్కువ. దాదాపు అందరూ ప్రస్తుతం రబ్బరు కండోమ్​లనే వాడుతున్నారు.

    రబ్బరు కండోమ్​లలోనూ మార్పులు జరుగుతున్నాయి. గత వంద సంవత్సరాలుగా ఎన్నో మార్పులు చెందాయి. పరిమాణం, మందం, నాణ్యతలో ఛేంజెస్​తో పాటు కొత్తగా ఫ్లేవర్లలో సైతం కండోమ్​లు ఉంటున్నాయి.

    1916 యంగ్ రబ్బర్ కార్పొరేషన్ అనే సంస్థ తొలిసారిగా  ట్రోజన్​ పేరుతో రబ్బరు కండోమ్​లను తయారు చేసింది. 1937లో దీన్ని ఎఫ్​డీఏ డ్రగ్​గా గుర్తించింది. దీంతో ఆ తర్వాతి నుంచి రబ్బరు కండోమ్​ల వాడకం పెరుగుతూ వచ్చింది. 1945లో థిన్స్ అనే పేరుతో యంగ్ కండోమ్​లను తయారు చేసింది. వీటని అమెరికా ఆర్మీ, నేవీ, మెరైన్ సైనికుల కోసమే ఉత్పత్తి చేసింది.

    ప్రతీకాత్మక చిత్రం


    అప్పటి నుంచి ట్రోజన్ రకరకాల విధాలుగా కండోమ్​లను తయారు చేస్తూ వచ్చింది. ఇక హెచ్​ఐవీ ప్రమాదం ఎక్కువవడంతో కండోమ్​ల వాడకం మరింత ఎక్కువైంది. దీంతో అనేక సంస్థలు వీటి తయారీలోకి వచ్చాయి. స్కిన్ అనే సంస్థ 2008లో పాలిసోప్రెసన్ (పాలిమర్ చేసింది. ఇదీ ఒకరమైన రబ్బరే) కండోమ్​లను ప్రవేశపెట్టింది. వీటి ద్వారా ఎలాంటి అలర్జీ రాదని చెప్పింది. ఆ తర్వాత చాలా సంస్థలు కండోమ్​లను ఉత్పత్తి చేస్తున్నాయి. రబ్బర్​తోనే థిన్(మందం తక్కువగా ఉండే) అని, విభిన్న అనుభూతిని ఇచ్చేవని, వివిధ ఆకృతుల్లో, రకరాల ఫేవర్లతో మార్కెట్లోకి అనేక కండోమ్​లు వస్తున్నాయి. విరివిగా లభిస్తున్నాయి. ప్రస్తుతం కండోమ్​ల వినియోగం పెరుగుతూనే ఉంది.
    Published by:Krishna P
    First published: