MilK: ఆవు పాలు - బర్రె పాలు.. ఏవి మంచివి..? ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

MilK: బర్రె పాలు సాధారణంగా చిక్కగా.. రుచిగా ఉంటాయి.. అందేకనే ప్రతీ ఒక్కరూ దీనిని ఇష్టపడతారు. బర్రె పాలలో వెన్న శాతం కూడా అధికంగానే ఉంటుంది. కానీ బర్రె పాల కంటే ఆవు పాలే శరీరానికి ఎంతో శ్రేష్టం అని చెబుతున్నారు నిపుణులు.

  • Share this:
    బర్రె పాలు సాధారణంగా చిక్కగా.. రుచిగా ఉంటాయి.. అందుకనే ప్రతీ ఒక్కరూ దీనిని ఇష్టపడతారు. బర్రె పాలలో వెన్న శాతం కూడా అధికంగానే ఉంటుంది. కానీ బర్రె పాల కంటే ఆవు పాలే శరీరానికి ఎంతో శ్రేష్టం అని చెబుతున్నారు నిపుణులు. పాల‌ల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఇందులో ఉండే విట‌మిన్ డీ, కాల్షియం వంటి పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అందుకే ప్ర‌తిరోజు పాలు తాగాల‌ని సూచిస్తుంటారు. అయితే ఆవు పాలు, బర్రె పాలల్తో ఏది మంచిదో తెలుసుకుందాం. ఆవు పాలు ఉపయోగాలల్లో.. ఆవు పాల వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆవు పాలలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. అధిక బరువును నియంత్రించడంలో ఈ పాలు చాలా సహాయపడతాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఆవు పాలలో కాస్త కుంకుమ పువ్వును, చక్కెరను కలుపుకుని తాగితే పైల్స్ సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. పిల్లల ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి ఆవు పాలు చాలా ఉపయోగపడతాయి. ఆవు పాలలో క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి.

    ఎముకల దృఢత్వానికి ఈ పాలు బాగా దోహదపడతాయి. కంటి సమస్యలు రాకుండా కాపాడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో దివ్యౌషధంగా పనిచేస్తాయి. మెదడు చురుకుదనానికి ఇది మంచి ఔషధం. ఆవు పాల‌తో పోలిస్తే బ‌ర్రె పాల‌ల్లో 10-11 శాతం ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల ఇవి ఎక్కువ‌గా వేడి నిరోధ‌క‌త‌ను క‌లిగి ఉంటాయి. అందుకే న‌వ‌జాత శిశువులు, వృద్ధుల‌కు బ‌ర్రె పాలు తాగించొద్ద‌ని చెబుతుంటారు. ఆవు పాల‌తో పోలిస్తే బ‌ర్రె పాల‌ల్లో కొలెస్ట్రాల్ త‌క్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల ఊబ‌కాయం, ర‌క్త‌పోటు, కిడ్నీ సంబంధిత వ్యాధుల‌తో బాధ ప‌డేవారు ఆవు పాల‌కు బ‌దులు బ‌ర్రె పాలు తాగ‌డం మంచిది. ఆవు పాల‌ను రెండు రోజుల‌లోపే తాగాలి.‌ ఆవు పాలు ప‌సుపు, తెలుపు రంగులో ఉంటాయి. అదే బ‌ర్రె పాలు తెలుపు, క్రీమ్ క‌ల‌ర్‌లో ఉంటాయి. బ‌ర్రె పాలల్లోని బీటాకెరోటిన్ రంగులేని విట‌మిన్ ఏగా మారుతుంది. అందుకే బ‌ర్రె పాల‌ల్లో ప‌సుపు రంగు పోతుంది. ఆవు పాలల్లో కూడా బీటాకెరోటిన్ ఉంటుంది. కానీ త‌క్కువ మోతాదులో మాత్ర‌మే ఉంటుంది.‌

    బర్రె పాలు ఉపయోగాలు..
    ఆవు పాల‌ల్లో 3-4 శాతం మాత్ర‌మే కొవ్వు ఉంటుంది. అదే బ‌ర్రె పాలల్లో 7-8 శాతం వ‌ర‌కు కొవ్వు ఉంటుంది. అందుకే ఆవు పాల కంటే బ‌ర్రె పాలు చిక్క‌గా ఉంటాయి. దీనివ‌ల్ల బ‌ర్రెపాలు అర‌గ‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంది. ఆవుపాల‌తో పోలిస్తే బ‌ర్రె పాలల్లోనే కేల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయి. కేల‌రీల‌తో పాటు ప్రోటీన్లు, కొవ్వు అధికంగా ఉంటాయి. ఒక‌ గ్లాస్ బ‌ర్రె పాల‌ల్లో 237 కేల‌రీలు ఉంటే.. ఒక గ్లాస్ ఆవు పాల‌ల్లో 148 కేల‌రీలు మాత్ర‌మే ఉంటాయి. బ‌ర్రె పాల‌ల్లో పెరాక్సిడేస్ అనే ఎంజైమ్ యాక్టివిటీ ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి ఆవు పాల‌తో పోలిస్తే బ‌ర్రె పాలు ఎక్కువ స‌మ‌యం నిల్వ ఉంటాయి. మంచి నిద్ర పోవాలంటే రాత్రి పూట బ‌ర్రె పాలు తాగ‌డం మంచిది. కోవా, పెరుగు, నెయ్యి, ప‌న్నీర్‌, పాయ‌సం వంటివి చేయ‌డానికి బ‌ర్రె పాలు మంచివి.

    అదే ఆవు పాలల్లో త‌క్కువ క్రీమ్ ఉంటుంది కాబ‌ట్టి స్వీట్ల తయారీకి వీటిని ఉప‌యోగించ‌వచ్చు. ఆవు పాలు, బ‌ర్రె పాల మ‌ధ్య తేడా ఉన్న‌ప్ప‌టికీ ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే. రెండింటిలోనూ పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. అయితే మ‌న అవ‌స‌రాల‌ను బ‌ట్టి ఆవు పాలు కావాలా, బ‌ర్రె పాలు కావాలా అన్న‌ది నిర్ణ‌యించుకోవాలి. ఇలా మన అవసరాన్ని బట్టీ ఉపయోగించే తీరును బట్టీ ఏ పాలు ఎంత వరకు ఉపయోగపడుతుందో వాటిని తీసుకోవాల్సి ఉంటుంది.
    Published by:Veera Babu
    First published: