Home /News /life-style /

DO YOU KNOW THAT WHAT KIND OF REASONS BEHIND HAIRFALL AND HOW WE OVERCOME THAT HERE THE FULL DETAILS PRV

hair problems tips: జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జుట్టు రాలుతోందని (hair fall) తెలిస్తే చాలు ఏదో ఆందోళన. మన దగ్గర నుంచీ ఏదో దూరమైపోతోందన్న ఇబ్బంది. తెలియకుండానే ఒక రకమైన టెన్షన్‌లో పడిపోతుంటారు చాలా మంది

    కేశాలు (Hairs) మనిషికి అందాన్ని ఇస్తాయనడంలో అతిశయోక్తి లేదు. వాతావరణం కలుషితం కావడం, మనం తినే ఆహారంలో నాణ్యత లేకపోవడం తదితర కారణాల వల్ల  జుట్టు యవ్వనం (young)లోనే ఊడిపోతోంది. పూర్వకాలంలో అయితే రాజులు, రాణులు పొడవాటి కేశాలతో తిరిగారు. అప్పటి వారి ఆహారం (food) వేరు మనది వేరు.  ఇపుడు జుట్టు రాలుతోందని (hair fall) తెలిస్తే చాలు ఏదో ఆందోళన. మన దగ్గర నుంచీ ఏదో దూరమైపోతోందన్న ఇబ్బంది. తెలియకుండానే ఒక రకమైన టెన్షన్‌లో పడిపోతుంటారు చాలా మంది. ఇక జీవితం ముగిసిపోయినట్లుగా, ముసలితనం వచ్చేసినట్లుగా రకరకాలుగా ఊహించుకుంటూ, తమలో తామే కుమిలిపోతుంటారు.

    ఎక్కువ వేడి తగిలించడం..

    ఇంతకీ జుట్టు ఎందుకు ఇంతలా రాలిపోతుంది (why hair falling) అంటే.. చాలా కారణాలే (reasons) ఉన్నాయి. అధిక జుట్టు రాలడం, జీవంలేని జుట్టు , జుట్టు చిట్లిపోవడం , పొడిబారి పోవడం, గిరజాల జుట్టు, అల్లిన జుట్టు,  హెయిర్ ఫోలికల్స్ తగ్గడం లాంటివిగా చెప్పవచ్చు. ఇక కొంచెం డీప్​గా తెలుసుకుందాం.. జుట్టు రాలకుండా ఉండేందుకు ఏం చెయ్యాలా అని రకరకాల షాంపూలూ, క్రీములూ వాడతారు. అవేవీ పనిచెయ్యకపోతే, చివరకు హెయిర్ లాస్ ట్రీట్‌మెంట్లు కూడా చేయించుకుంటారు.  ముందుగా జుట్టు ఎందుకు రాలుతుందో తెలిస్తే పెరగడానికి జాగ్రత్తలు (precautions) తీసుకోవచ్చు. మీ జుట్టు యొక్క నాణ్యత (quality) అలాగే బలాన్ని నిర్ణయించడంలో జన్యువులు కీలకపాత్ర పోషిస్తాయి. ఇక జుట్టు యొక్క అలంకరణ పై ఆధారపడి, మీకు అందమైన జుట్టు (beautiful hair) అలాగే మృదువైన జుట్టు ఉండవచ్చు. జుట్టుకు ఎక్కువ వేడి తగిలించడం వల్ల కూడా జుట్టు దెబ్బతింటుంది. వేడి  జుట్టు కుదుళ్లు తాకినపుడు తల మీద ఉండే నూనె (Oli)లు  బయటికి పోయి చర్మం (skin) దెబ్బతింటుంది.  అలాగే కుదుళ్ళు నష్టపోయి జుట్టుకు నష్టం కలుగుతుంది.

    జుట్టుకు ఉపయోగించే హెయిర్ డై ల  కారణంగా కూడా జుట్టు (hair) సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.  అంటే ఈ డై లో ఉపయోగించే రసాయనాల (Chemicals) కారణంగా జుట్టు బలహీనంగా మారి , జుట్టు రాలడానికి (hair fall) దారితీస్తుంది..

    ఇక మనం తీసుకొనే ఆహారంలో సరైన విటమిన్లు (No vitamins) , ఖనిజాలు, ప్రోటీన్లు (proteins) లేకపోవడం వల్ల కూడా జుట్టు పెరుగుదల ఆగిపోతుంది.. ఇవన్నీ కూడా జుట్టు బలహీనమవడానికి (hair weak) కారణాలు. సాధారణంగా జుట్టు పెరుగుదలకు ప్రోటీన్లు ఒక ముఖ్యమైన అంశం. హెయిర్ ఫోలికల్స్ తగినంత ప్రోటీన్ ను పొందలేని సమయంలో జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి . ఫలితంగా జుట్టు రాలడం మొదలవుతుంది. అలాగే మన శరీరంలో థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కూడా హార్మోన్ల అసమతుల్యత జుట్టు రాలడానికి కారణం అవుతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Food, Hair Loss, Hair problem tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు