హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Walking Benefits: నడిస్తే ప్రయోజనాలెన్నో.. బరువు తగ్గడమే కాదు.. అనారోగ్య సమస్యలకూ చెక్​ పెట్టొచ్చంట.. వివరాలివే

Walking Benefits: నడిస్తే ప్రయోజనాలెన్నో.. బరువు తగ్గడమే కాదు.. అనారోగ్య సమస్యలకూ చెక్​ పెట్టొచ్చంట.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నడక అందరికీ ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు. సాధారణ రోగాల నుంచి పెద్ద పెద్ద రోగాలను ఇది నియంత్రణలో ఉంచుతుందట.

కరోనా అందరి జీవితాలను తారుమారు చేసింది. వేళకు తినకపోవడం, సమయానికి నిద్ర పోకపోవడం తదితర కారణాలు బరువు పెరగడానికి (weight gain) కారణాలవుతాయి. అయితే ఈ అధిక బరువు శారీరక రోగాలకు దారి తీస్తాయి. అందుకే తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ, కొంతమందికి ఆ సమయం (time) కూడా ఉండదు. బరువు తగ్గడానికి (weight loss) కడుపు కాల్చుకుంటారు. ఆహారం (food) ఎక్కువగా తీసుకోరు. అయినా కూడా అలాంటి వారు బరువు తగ్గరు. వారికీ కూడా ఎందుకో అర్థం కాదు. అయితే అలాంటి వారు కొన్నిచిట్కాలు (tips) పాటిస్తే బరువు (weight) తగ్గుతారు. అతిగా వ్యాయామాలు చేయడమే. ఎంత చక్కటి వర్కవుటైనా... ఇన్నిసార్లు... ఇంతసేపు చేయాలనే నియమం ఉంటుంది. అలా కాకుండా త్వరగాబరువు తగ్గాలని మితి మీరి వర్కవుట్లు చేస్తే అనారోగ్యాల బారిన పడతారు. కాబట్టి క్రమపద్ధతిలో చేయాలి. మధ్య మధ్యలో విరామాలూ తప్పనిసరి. రోజుకు పది వేల అడుగులు (Ten thousand feet) వేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చు అన్న భావన చాలా మందిలో ఉంది. అయితే ఇన్నే అడుగులు వేయాలి ఇంతకు మించి అడుగులు (feet) వేయడానికి వీలు లేదు అనే నిబంధనలు ఏమీ లేవు.

నడక ద్వారా మన దరిచేరకుండా చూసుకోవచ్చు..

ఓ  అధ్యయనం ప్రకారం చురుకైన వ్యక్తులు ఐదు వేల అడుగులు లేదా అంతకంటే తక్కువ వేసినప్పుడు వారిలో మరుసటి రోజు జీవ క్రియలు సక్రమంగా జరగడం లేదు. అందుకని రోజుకు ఐదు వేల అడుగులకు తక్కువ కాకుండా చేయడం మంచిదే. గుండె వ్యాధులు (heart problems), స్థూలకాయం (obesity), డయాబెటిస్ (diabetes), వంటి అనారోగ్యాలను నడక ద్వారా మన దరిచేరకుండా చూసుకోవచ్చు. వాకింగ్ చేయడం వల్ల శరీరం ఆక్సిజన్ ను ఎక్కువగా గ్రహిస్తుంది . దీంతో అదే యాక్సిడెంట్ రక్తంలో చేరి అది ఊపిరితిత్తులకు చేరుతుంది. ఈ క్రమంలో సదరు ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్ లు, విష వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. అలాగే ఇతర ఊపిరితిత్తుల సమస్యలు దూరం అవుతాయి.

నడక వల్ల గుండె సంబంధిత వ్యాధులు చాలా శాతం తగ్గుతుందని ఈ పరిశోధనలో వివరించారు. మూడు నెలల పాటు వ్యాయామం చేయడం వల్ల శరీర బరువు తగ్గుతుందని వెల్లడించారు. అడుగుల సంఖ్య పెరిగే కొద్దీ ఆరోగ్య లాభాలు కూడా పెరుగుతాయని వాళ్ళు వెల్లడించారు.

Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

First published:

Tags: Health Tips, Walking, Weight loss tips

ఉత్తమ కథలు