హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Beauty tips: టమాటాలతోనూ మీ ముఖాన్ని కాంతివంతంగా తీర్చిదిద్దుకోవచ్చంట.. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి..

Beauty tips: టమాటాలతోనూ మీ ముఖాన్ని కాంతివంతంగా తీర్చిదిద్దుకోవచ్చంట.. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి..

కొంతమంది టీవీల్లో ప్రకటనలు చూసి.. మంచి వాసన వచ్చే ఫేస్ వాష్‌లను ఇష్టపడతారు. ఇలాంటివి వాడితే మీ చర్మానికి ఎక్కువ నష్టం కలుగుతుంది.  అందుకే మీ చర్మ రకాన్ని బట్టి.. దానికి తగ్గ ఫేస్‌వాష్‌ని మాత్రమే ఉపయోగించాలి. పెరుగు, కొబ్బరినూనె వంటి సహజసిద్ధ పదార్థాలతో  ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ఇంకా మంచిది.
(ప్రతీకాత్మక చిత్రం)

కొంతమంది టీవీల్లో ప్రకటనలు చూసి.. మంచి వాసన వచ్చే ఫేస్ వాష్‌లను ఇష్టపడతారు. ఇలాంటివి వాడితే మీ చర్మానికి ఎక్కువ నష్టం కలుగుతుంది. అందుకే మీ చర్మ రకాన్ని బట్టి.. దానికి తగ్గ ఫేస్‌వాష్‌ని మాత్రమే ఉపయోగించాలి. పెరుగు, కొబ్బరినూనె వంటి సహజసిద్ధ పదార్థాలతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ఇంకా మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)

మన ఇంట్లో చేసుకునే కొన్ని ప్యాక్​లు మన చర్మాన్ని (skin) సంరక్షిస్తాయి. మన చర్మం కాంతివంతంగా ప్రకాశించడానికి (glow brighter) తోడ్పడుతాయి. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం..

వర్షాకాలం (monsoon) చర్మాన్ని ఎక్కువగా రక్షించుకోవాల్సిన సమయాలు. చాలామందికి బయటి వాతావరణం ఆహ్లాదంగా కనిపించినా వారి చర్మం (skin)లో వచ్చే మార్పులు చూసి తట్టుకోలేరు. బాహ్య చర్మ సంరక్షణ (External skin care ) చాలా కీలకమవుతుంటుంది. ముఖ్యంగా చర్మ సంరక్షణ విషయంలో..  చర్మం సంరక్షణ (Skin protection ) అనేది చాలా కీలకం. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టం కలుగుతుంది. అంతర్గత ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. బాహ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యం. శీతాకాలంలో సహజంగా ఎదురయ్యే సమస్య చర్మం పగలడం లేదా చర్మం (Skin ) పొడి బారి..దురద రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ కాలంలో చర్మాన్ని సాధ్యమైనంతగా మృదువుగా తేమగా ( Soft skin ) ఉంచుకుంటే మంచిది.

అందం (beauty). ఈ రోజుల్లో దీనికోసం ఉన్న డబ్బంతా ఖర్చు చేసే వారున్నారంటే నమ్మాల్సిందే. సమాజంలో మంచి గుర్తింపు కోసమో.. బంధువుల దగ్గర మెప్పు కోసమో.. ప్రయత్నిస్తూ తెలిసీ తెలియని ఫేస్​ప్యాక్​లను వాడుతుంటారు. అయితే మన ఇంట్లో చేసుకునే కొన్ని ప్యాక్​లు మన చర్మాన్ని (skin) సంరక్షిస్తాయి. మన చర్మం కాంతివంతంగా ప్రకాశించడానికి (glow brighter) తోడ్పడుతాయి. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం..

మెరిసే చర్మానికి టమాటా..

మెరిసే చర్మం (shiny skin) కోసం టమాటా (tomato)లు ఎంతగానో ఉపయోగపడతాయి. టమోటాలో యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని బాగా మెరుగుపరుస్తుంది. టమోటా రసాన్ని తీసుకొని చర్మంలోని టాన్ ఉన్న ప్రదేశాలకు అప్లై చేసి బాగా మసాజ్ చెయ్యండి. ఒక 15 నిమిషాలు బాగా ఆరనిచ్చిన తర్వాత చల్లని నీటితో బాగా శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా వారానికి మూడుసార్లు చేయాలి.

ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

కొబ్బరి పాలలో విటమిన్​ సీ..

అలాగే కొబ్బరి పాల (coconut milk)లో ఉండే విటమిన్ సి ఇంకా తేలికపాటి ఆమ్లాలు మంచి డి-టానింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. తాజా కొబ్బరి పాలను తీసుకొని అందులో కాటన్ బాల్‌ను ముంచి టాన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చెయ్యండి. ఇక కొద్దిసేపు ఆరిన తర్వాత ముఖాన్ని కడగండి. అలాగే చర్మ (skin) నిగారింపు (brightness) కోసం తేనె-బొప్పాయి ప్యాక్ చాలా మంచిది. ఎందుకంటే బొప్పాయిలో ఉండే పాపైన్ ఎంజైమ్ టాన్ ని తొలగించడానికి ఎంతగానో సహాయపడుతుంది.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

వర్షంలో తడిచాక మీ జుట్టు పాడైపోతుంది కదా? ఈ చిట్కాలతో మీ జుట్టును కాపాడుకోండి..



ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి

Published by:Prabhakar Vaddi
First published:

Tags: Beauty tips, Face mask, Life Style

ఉత్తమ కథలు