వాతావరణంలో కాలుష్యం, మనం తీసుకునే ఆహారంలో పోషకాల లోపం వంటి కారణాలవల్ల ప్రతి ఒక్కరికి జుట్టురాలే సమస్య, అతి పెద్ద సమస్యగా మారిపోయింది. ఇందు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో డబ్బులు కూడా ఖర్చు చేసి, విసుగు చెంది ఉంటారు చాలామంది. జుట్టు (hair) రాలిపోతుండటాన్ని (loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. మహిళల కురులు (women hairs) మగవారికీ ఇష్టమే. కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా (beauty) కనిపిస్తారు. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్ స్టైల్స్‌ను ఫాలో అవుతారు. అయితే జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది.
జోజోబా నూనె..
అయితే ఇప్పుడు ఇలాంటి వాటన్నింటికీ చెక్ పెట్టాలంటే ఒక నూనెతో చేసుకోవచ్చు. ఈ నూనె జుట్టుకు కావలసిన పోషకాలను అందించి, శిరోజాలు మృదువుగా, కాంతిని సంతరించుకోవడం లో సహకరిస్తుంది. ఈ ఆయిల్ అప్లై చేస్తే అదిరిపోయే అందం మృదువైన జుట్టు మీ సొంతం అవుతుంది. జొజోబా ఆయిల్ (Jojoba oil). మామూలుగా ఉత్తర అమెరికాలో Jojoba plants ఎక్కువగా సాగు చేస్తారు. ఇక్కడ కూడా దొరుకుతుంది. అనేక చర్మ సంరక్షణ అలాగే జుట్టు (hair) సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ఈ ఆయిల్ ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా, దాని తేమ ఇంకా మృదువైన లక్షణాల కారణంగా ఇంకా అలాగే ముఖ్యమైన విటమిన్లు అలాగే ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న జోజోబా ఆయిల్ ఆరోగ్య ప్రయోజనాలను పుష్కలంగా అందిస్తుంది.
సహజ ప్రత్యామ్నాయంగా..
జోజోబా ఆయిల్ (jojoba oil) మీ జుట్టును మృదువుగా చేస్తుంది, అవాంఛిత తేమకు వ్యతిరేకంగా ట్రెసెస్‌ని లాక్ చేస్తుంది. ఇంకా అలాగే జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. అదే సమయంలో, ఇది నెత్తి ఇంకా తంతువులకు అవసరమైన తేమ కోసం సహజ ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. అంతేగాక ఇది తరచుగా షాంపూలలో ఉండే కఠినమైన రసాయనాల ద్వారా తీసివేయబడుతుంది.
జుట్టు ఒత్తుగా ,బలంగా ఉండాలంటే , బయట నుంచి పోషణ అందిస్తే సరిపోదు. లోపలనుంచి శోషణ కూడా అందించాలి. ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ డి , వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా చేపలు, తాజా పండ్లు ,కాయలు, ఆకుకూరలు, పొద్దుతిరుగుడు విత్తనాలు ఆకుపచ్చ కాయగూరలు వంటి వాటిని తినడం అలవాటు చేసుకోవాలి. ధ్యానం చేయడం, విశ్రాంతి తీసుకోవడం వంటి పనుల వల్ల కూడా మనసు ప్రశాంతత పెరిగి తద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Beauty tips, Hair fall, Treatment