హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Cancer: ఈ ఆహారం తీసుకుంటే క్యాన్సర్​ ముప్పును దూరం చేయొచ్చంట.. అదేంటో తెలుసా

Cancer: ఈ ఆహారం తీసుకుంటే క్యాన్సర్​ ముప్పును దూరం చేయొచ్చంట.. అదేంటో తెలుసా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

క్యాన్సర్​ ముప్పును దరిచేయకుండా ఉండటానికి ఓ ఆహార పదార్థం రెగ్యులర్​(regular)గా తీసుకుంటే మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు. అదే క్వినోవా( Quinoa ). నిత్య జీవితంలో మనం తినే బార్లీ ( Barley ),  గోధుమలు( Wheats ), ఓట్స్ ( Oats ) లాంటిదే క్వినోవా అనే దినుసులు.

ఇంకా చదవండి ...

  క్యాన్సర్‌(cancer) మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉంది. అయినా గర్భాశయం, రొమ్ము క్యాన్సర్‌, ఊపిరితిత్తులు, పేగులు, శ్వాస నాళాలు మొదలైన భాగాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ. అయితే ఈ క్యాన్సర్​ ముప్పును దరిచేయకుండా ఉండటానికి ఓ ఆహార పదార్థం రెగ్యులర్​(regular)గా తీసుకుంటే మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు. అదే క్వినోవా( Quinoa ). నిత్య జీవితంలో మనం తినే బార్లీ ( Barley ),  గోధుమలు( Wheats ), ఓట్స్ ( Oats ) లాంటిదే క్వినోవా అనే దినుసులు. పోషక పదార్ధాలు పుష్కలంగా లభించే క్వినోవా పంటను యూరోపియన్ దేశాల్లో ఎక్కువగా పండిస్తారు. క్వినోవా ప్రాధాన్యతను గుర్తించింది కాబట్టే ఐక్యరాజ్యసమితి ( UNO ) రెండేళ్ల క్రితమే క్వినోవా ఇయర్‌గా ప్రకటించింది. క్రమం తప్పకుండా క్వినోవా తింటే.. చాలా రకాల వ్యాధులు దూరమవుతాయి. ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మారిని కూడా దూరం చేయవచ్చు. ఈ క్వినోవా గురించి వివరంగా తెలుసుకుందాం..

  రంగులు రంగులుగా లభ్యం..

  గోధుమ రంగు, ముదురు గోధుమ, నలుపు, గులాబీ రంగుల్లో క్వినోవా లభ్యమవుతుంది. గోధుమలతో పోలిస్తే క్వినోవాలోనే ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి. గ్లూటెన్ ఉండకపోవడం వల్ల సహజంగా పిండి పదార్ధాలు ఎక్కువగా తీసుకుంటే ఎదురయ్యే ఒబెసిటీ తప్పించుకోవచ్చు. అంతేకాకుండా మధుమేహం( Diabetes ), గుండె సంబంధ సమస్యలు క్వినోవాతో ఎదురు కావు. క్వినోవాలో ఫైబర్ కంటెంట్ ( Fiber Content ) ఎక్కువగా ఉన్నందున రెగ్యులర్​గా ఆహారంలో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కేలరీలు తక్కువగా ఉన్న కారణంగా బరువు తగ్గించుకోడానికి తోడ్పడుతుంది. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందున జీవక్రియ బాగుంటుంది. బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయంగా క్వినోవా ధాన్యాన్ని వినియోగించవచ్చు.

  ఇది కూడా చదవండి : మీ శరీరంలో రక్తం తక్కువగా ఉందా? అయితే ఈ పండ్ల జ్యూస్​ తాగితే మేలు

  చర్మ సమస్యలూ రావట

  క్వినోవా ని మనం రోజూ తినే అన్నం మాదిరిగా వాడుకోవచ్చు. అంతేకాకుండా కిచిడీలా, పొంగలి, బిర్యానీ, సలాడ్, కుకీ, బ్రెడ్, బిస్కట్ ఇలా విభిన్న రకాలుగా వండుకోవచ్చు. కేవలం 3-4 గంటల్లోనే క్వినోవా మొలకలు వస్తాయి. రక్తంలో నుంచి కొలెస్ట్రాల్‌ను తగ్గించే కాలేయాన్ని యాక్టివ్ చేస్తుంది క్వినోవా ( Quinoa )లో ఫ్యాటీ యాసిడ్స్ , ఒమేగా 3 యాసిడ్స్ ఉంటాయి. క్వినోవాలో విటమిన్ బి, బి3, బి12 ( Vitamin B , B3, B12 rich in Quinoa ) లు పుష్కలంగానే ఉంటాయి. చర్మంలో డార్క్ మెలనిన్‌ను తగ్గించి.. వయస్సుతో పాటు వచ్చే చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది.  క్వినోవాను తరచూ తింటే Cancer దూరం చేయవచ్చని తెలిసింది. క్వినోవా తినేవారిలో క్యాన్సర్ కారకాలు దరి చేరవని వివిధ పరిశోధనల్లో తేలింది. డయాబెటిస్‌తో బాధపడేవారు నిత్యం క్వినోవా తినడం మంచిది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Cancer, Food, Health Tips, Life Style

  ఉత్తమ కథలు