టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ బిజీబిజీ జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవడం (Sleeping ) అనేది ఒక వరంలాంటిదే. కరోనా(corona) నేపథ్యంలో జీవితాలు తలకిందులయ్యాయి. లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. వారికి ప్రశాంతత(peace) కరువైంది. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టని వారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర (sleep) కూడా కరువు అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. అయితే ముఖ్యంగా మహిళలు.. అందులోనూ గర్భవతులు (pregnant) నిద్ర పోవడం ఆవశ్యకం అంటున్నారు నిపుణులు. గర్భధారణ సమయంలో ఎన్ని సమస్యలు ఎదురైనా.. కడుపులోని బిడ్డ కోసం వాటిని ఎంతో ఆనందంగా తట్టుకుంటుంది. అంతేకాదు.. ఆ సమయంలో చాలా మంది గర్భిణులు సమస్య నిద్రలేమి (Insomnia) సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. గర్భధారణ సమయంలో గర్భిణులు కొన్ని కారణాల వలన సరిగ్గా నిద్రపోరు.
పగటి పూట..
అయితే అలాంటి సమయంలో కొన్నిటిప్స్ ( sleep tips) పాటిస్తే ప్రశాంతంగా నిద్ర పడుతుందని చెబుతున్నారు. ఇక సాధారణంగా చాలా మంది గర్భిణీలు చేసే పొరపాటు.. పగటి పూట (afternoon time) నిద్ర పోతుంటారు. ఆలా చేయడం వల్ల రాత్రి నిద్రకు ఆటకం ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణులు పగటి పూట నిద్రకు దూరం ఉంటే.. రాత్రి నిద్ర బాగా పడుతుందని సూచించారు. అంతేకాదు.. రాత్రి సమయంలో త్వరగా, ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే.. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు యాలకుల పొడి కలిపి తీసుకోవాలని చెబుతున్నారు.
ఇక ఈ పాల (milk) మిశ్రమం నిద్రకు ఉపక్రమించేలా చేయడంతో పాటు నిద్రలేమిని కూడా దూరం చేస్తుందని తెలిపారు. అంతేకాదు.. గర్భధారణ సమయంలో రాత్రి నిద్ర బాగా పట్టాలంటే.. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలని చెబుతున్నారు. ప్రధాన కారణం ఏంటంటే.. ఇవి నిద్రను ప్రోత్సహిస్తాయని అన్నారు. అంతేకాదు.. అరటి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి తెలిసిన విదితమే. అందుకే నిద్రించే ముందు ప్రెగ్నెన్సీ స్త్రీలు ఒక అరటి పండు తీసుకుంటే.. త్వరగా, ప్రశాంతంగా నిద్ర పడుతుందని తెలిపారు. అంతేకాదు.. ప్రెగ్నెన్సీ స్త్రీలు ప్రతి రోజు శరీరానికి సరిపడా నీరు ఖచ్చితంగా తీసుకోవాలని చెబుతున్నారు. ఆలా తీసుకోవడం వలన నిద్ర బాగా పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.