Home /News /life-style /

DO YOU KNOW THAT POTATOES IS ENOUGH TO LOOSE WEIGHT EASILY LETS SEE HOW IT IS PRV

weight loss tips: ఈజీగా బరువు తగ్గడానికి బంగాళాదుంపలు చాలట.. అయితే ఆ విషయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలామంది బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. డాక్టర్లు చెప్పిన పద్దతులు, జిమ్​ ట్రైన్లరు చెప్పినవీ చేస్తుంటారు. కానీ, కేవలం బంగాళాదుంపలు మీ బరువును కంట్రోల్ చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయట. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...
    అసలే బిజీ లైఫ్​. చదువులు, ఉద్యోగాలు, ఇతర పనులు, ఇంటి పనులు అన్నీ ఒత్తిడిని ఎక్కువ చేస్తాయి. వేళకు కూడా తినే సమయం దొరకదు చాలామందికి. ఇక పిల్లలకైతే ఆటల్లో పడిపోయే ఏ సమయానికి తింటున్నారో కూడా తెలియని లోకంలో బతికేస్తున్నారు. వేళకు ఆహారం తినకపోవడం కారణంగా అనారోగ్య (Unhealthy) సమస్యలు మెండుగా వస్తాయి. మళ్లీ వాటిని తగ్గించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అప్పటికే కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా అనారోగ్యానికి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మనం రోజు తినే ఆహారంలో (food) గానీ, తినే సమయం (Time) గాని.. తూచా తప్పకుండా సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది.

    ప్రతీ ఒక్కరికి బరువు (weight) అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు బరువు తగ్గడానికి వ్యాయామాలు చేయడం మంచిదని సలహాలు (weight loss tips) ఇస్తుంటారు. అయితే దానికోసం ర‌క‌ర‌కాల ఎక్స‌ర్‌సైజ్‌లు చేయ‌డం మొద‌లు పెడ‌తారు. ఒక‌టి రెండు రోజులు చేయ‌గానే బ‌ద్ద‌కంతోనో, ప‌ని ఒత్తిడితోనో మ‌ధ్య‌లోనే మానేస్తుంటారు. చాలామంది బరువు తగ్గడానికి (weight loss) చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. డాక్టర్లు చెప్పిన పద్దతులు, జిమ్​ ట్రైన్లరు చెప్పినవీ చేస్తుంటారు. కానీ, కేవలం బంగాళాదుంపలు (Potatoes) మీ బరువును కంట్రోల్ చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయట. దాని గురించి (weight loss tips) ఒకసారి తెలుసుకుందాం..

    ఆకుకూరలు (greens).. పోషకాల ఖజానాలు. వీటి నుంచి లభించే కెలరీలు తక్కువ. వీటిలోని పీచు వలన ఈ కూరలు కొద్దిగా తీసుకున్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. బెల్ పెప్పర్.. రంగురంగుల్లో లభించే ఈ కూరగాయ కూడా బరువును తగ్గిస్తుంది (loose weight). దీని నుంచి అందే కెలరీలు చాలా తక్కువ. అలాగే దీనిలో కొవ్వును కరిగించే సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలోని విటమిన్ సి పొట్టలో పేరుకుపోయిన కొవ్వు (fat) నిల్వలను తగ్గిస్తుంది.

    ఉడకబెట్టి తినడం..

    ఆలుగడ్డలు (Potatoes) తింటే ఇక అధికంగా బరువు పెరుగుతాం అనుకుంటారు చాలా మంది. కానీ అది మాత్రం నిజం కాదు. ఆలుగడ్డల్లో పోటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుంది. అయితే దీనిని నూనెలో వేయించి మాత్రం తినకూడదు. కేవలం ఉడకబెట్టి తినడం (Eating boiled) మంచిది. ఇందులో చాలా తక్కువ కెలరీలు ఉంటాయి. అలాగే అన్నం, రొట్టె వంటి కెలరీలు ఉండే ఆహార పదార్థాలకు దీన్ని ప్రత్యామ్నాయంగా దీనిని వాడుకోవచ్చు. కప్పు కాలీఫ్లవర్ నుంచి 25 కెలరీలు అందుతాయి. ఇది మీ బరువును అదుపులో ఉంచుతుందట.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Weight loss tips

    తదుపరి వార్తలు