Health tips: రాత్రి తొందరగా పడుకుని ఉదయాన్నే నిద్ర లేచే అలవాటు ఉన్న వారికి డయాబెటిస్​ రాదా?

ప్రతీకాత్మక చిత్రం

ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఇప్పటికే నిపుణులు సూచించారు. ఈ క్రమంలోనే చాలా మంది ఉదయాన్నే (early morning) నిద్రలేచి పలు రకాల వ్యాయామాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

 • Share this:
  కరోనా కారణంగా చాలామంది ఉద్యోగాలూ ఊడిపోయాయి. చేతిలో చిల్లి గవ్వలేదు. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు (mental problems)  ఎదుర్కొంటున్నారు.  రోజులో ఒక్కసారి నిద్ర కూడా సరిగా పట్టనివారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి, నిత్యం బిజీబీజీ. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర (sleep) కూడా కరువు (Sleeping problems) అవుతుంది. నిద్ర లేకపోవడం (No sleep) వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్ చేస్తుంటారు.

  టైప్ 2 డయాబెటిస్ దూరం..

  సాధారణంగా అయితే రాత్రి 9 గంటల లోపు నిద్రపోయి ఇక ఉదయాన్నే నిద్రలేవడం (wakeup) వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఇప్పటికే నిపుణులు సూచించారు. ఈ క్రమంలోనే చాలా మంది ఉదయాన్నే (early morning) నిద్రలేచి పలు రకాల వ్యాయామాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఉదయాన్నే నిద్ర లేచే వారికి ఒక శుభవార్త చెప్పారు నిపుణులు (experts). ఒకవేళ మీకు కూడా ఉదయాన్నే నిద్ర లేచే అలవాటు ఉంటే ఇక మీరు టైప్ 2 డయాబెటిస్ (diabetes) బారిన పడకుండా దూరం అవ్వచ్చంట.

  ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

  ఉదయాన్నే త్వరగా నిద్ర (sleep) లేచే అలవాటు ఉండటం కారణంగా అటు బ్రేక్​ఫాస్ట్ (breakfast)​ కూడా త్వరగానే చేస్తారని.. తద్వారా రక్తంలోని ఇన్సులిన్ లెవెల్స్ ఇక రక్తంలోని చక్కెర స్థాయి కూడా తగిన మోతాదులో ఉండడానికి అవకాశం ఉంది అని చెబుతున్నారు నిపుణులు. ఉదయం సమయంలో తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ ఎంతో ముఖ్యమైనది కాబట్టి ఉదయం తొందరగా లేచి తొందరగా బ్రేక్​ఫాస్ట్ తినడం ఎంతో మంచిది అని చెబుతున్నారు నిపుణులు.

  బోర్లా పడుకోవడం తగ్గించండి..

  రోజూ మనం బోర్లా పడుకుని (lying down before bed) నిద్రపోతున్నప్పుడు వెన్నెముక (Spine) తన సహజ వక్రతను కోల్పోతుందట. దీని వల్ల ఒత్తిడి (Stress) పెరిగి వెన్నెముక అధిక శ్రమకు గురవుతుందంటున్నారు. వెనుక కండరాలు కూడా దెబ్బతిని ఉదయాన్నే వెన్నునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. పొట్టవైపునకు తిరిగి పడుకోవడం వల్ల హైపర్లార్డాసిస్ వంటివి మొదలై వెన్ను చివర్లో నొప్పులు మొదలవుతాయట. పొట్టవైపుకు తిరిగి పడుకున్నప్పుడు మనం ఊపిరి (breath) తీసుకోవాడానికి మెడను ఏదో ఒకవైపుకు తిప్పి ఉంచుతాం. దీని వల్ల మన మెడ (Neck), వెన్నెముక (Spine) మధ్య సంబంధాలు చెడిపోతాయట. మెడ ఒకపక్కకు తిప్పి ఉంచడం వల్ల ఒకవైపు గట్టిపడి.. మరో వైపు బలహీనమవుతుందట. దీని వల్ల మెడ పట్టుకోవడం.. మెడ నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయట.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

  ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

  ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
  Published by:Prabhakar Vaddi
  First published: