Home /News /life-style /

DO YOU KNOW THAT IF YOU INCLUDE THESE VEGETABLES IN YOU DIET THEN YOUR WEIGHT WILL LOSS AUTOMATICALLY PRV

Weight loss: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ కూరగాయలను మీ ఆహారంలో చేర్చుకోండి.. బరువు తగ్గుతారు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బరువు తగ్గాలని మితి మీరి వర్కవుట్లు చేస్తే అనారోగ్యాల బారిన పడతారు. కాబట్టి  క్రమపద్ధతిలో చేయాలి. మధ్య మధ్యలో విరామాలూ తప్పనిసరి.. అయితే కొన్నిరకాల కూరగాయలు (Vegetables) మనం ఆహారంలో తీసుకుంటే బరువు తగ్గించుకోవచ్చు. 

    అధిక బరువు (heavy weight). మనిషికి మన: శాంతిని దూరం చేస్తుంది. వేళకు తినకపోవడం, సమయానికి నిద్ర పోక పోవడం తదితర కారణాలు బరువు పెరగడానికి (weight gain) కారణాలవుతాయి. అయితే ఈ అధిక బరువు శారీరక రోగాలకు దారి తీస్తాయి. అందుకే తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ, కొంతమందికి ఆ సమయం (time) కూడా ఉండదు. బరువు తగ్గడానికి (weight loss) కడుపు కాల్చుకుంటారు. ఆహారం (food) ఎక్కువగా తీసుకోరు. అయినా కూడా అలాంటి వారు బరువు తగ్గరు. వారికీ కూడా ఎందుకో అర్థం కాదు. అయితే అలాంటి వారు కొన్నిచిట్కాలు (tips) పాటిస్తే బరువు (weight) తగ్గుతారు. అతిగా వ్యాయామాలు చేయడమే. ఎంత చక్కటి వర్కవుటైనా... ఇన్నిసార్లు... ఇంతసేపు చేయాలనే నియమం ఉంటుంది. అలా కాకుండా త్వరగా బరువు తగ్గాలని మితి మీరి వర్కవుట్లు చేస్తే అనారోగ్యాల బారిన పడతారు. కాబట్టి  క్రమపద్ధతిలో చేయాలి. మధ్య మధ్యలో విరామాలూ తప్పనిసరి.. అయితే కొన్నిరకాల కూరగాయలు (Vegetables) మనం ఆహారంలో తీసుకుంటే బరువు తగ్గించుకోవచ్చు.

    మనం బరువు తగ్గడానికి బంగాళదుంపలు (Potatoes) చాలా వరకూ ఉపయోగపడతాయి. ఈ బంగాళదుంప లో అనేక రకాల పోషక పదార్థాలు లభిస్తాయి. ఈ బంగాళదుంపలు (Potatoes) తినడం వల్ల మనకు ఆకలి ఎక్కువగా కాదు. ఈ బంగాళాదుంపలు ఎక్కువగా తినడం వల్ల మనకు గుండె సంబంధిత సమస్యలు కూడా దరికి చేరవు. బంగాళదుంపతో పాటు సోయా బీన్స్ కూడా బరువును తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే మన శరీరానికి కావలసిన పోషక పదార్థాలు వీటిలో లభిస్తాయి. నిత్యం మనం ఈ డైట్ ను పాటిస్తే సులభంగా బరువు తగ్గవచ్చు.

    ప్రొటీన్లు (proteins) ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఆకలి కూడా తగ్గుతుంది. ప్రొటీన్ల కారణంగా ఆకలి పెంచే గ్రీలిన్, జీఎల్‌పీ-1 వంటి హార్మోన్లను నియంత్రించవచ్చు. చికెన్ (chicken), చేపలు (fish), ఆల్మండ్స్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా ఎక్కువ సేపు ఉల్లాసంగా ఉండొచ్చు. విస్కస్ ఫైబర్ బరువు తగ్గేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఇది ఎక్కువసేపు ఉల్లాసంగా ఉంచడంతో పాటు ఆహారం తక్కువ తినేలా చేస్తుంది. ఆరెంజ్ పండ్లు, బీన్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటి వాటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇది కూడా చదవండి:  మీ మోకాళ్ల అందం తగ్గిపోతుందా? నల్లగా మారుతున్నాయా? అయితే ఇలా చేసి సమస్య దూరం చేసుకోండి
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Weight loss

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు