Home /News /life-style /

DO YOU KNOW THAT IF YOU DO THESE THINGS AFTER YOUR DINNER IT WILL EFFECTS TO SLEEP AT NIGHT PRV

sleep tips: రాత్రిళ్లు భోజనం తర్వాత ఈ పనులు చేస్తే ప్రశాంతమైన నిద్ర పట్టదట.. అవేంటో ఇక్కడ తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హాయిగా నిద్ర పోవాలంటే కొన్ని పద్దతులు (sleep tips) రోజూ పాటిస్తే నిద్ర దానంతట అదే వస్తుందట. అంతేకాదు రాత్రి భోజనం తర్వాత (After dinner) కొన్ని పనులు చేస్తే అది మీ నిద్రకు ఆటంకాలుగా మారుతాయట. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం..

    టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ బిజీబిజీ జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవడం (Sleeping ) అనేది ఒక వరంలాంటిదే. కరోనా(corona) నేపథ్యంలో జీవితాలు తలకిందులయ్యాయి. లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. వారికి ప్రశాంతత(peace) కరువైంది. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టని వారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర (sleep) కూడా కరువు అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. అయితే హాయిగా నిద్ర పోవాలంటే కొన్ని పద్దతులు (sleep tips) రోజూ పాటిస్తే నిద్ర దానంతట అదే వస్తుందట. అంతేకాదు రాత్రి భోజనం తర్వాత (After dinner) కొన్ని పనులు చేస్తే అది మీ నిద్రకు ఆటంకాలుగా మారుతాయట. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం..

    నిద్రవేళకు కొన్ని గంటల ముందు..

    మీరు మీ డిన్నర్ తర్వాత కాఫీ తాగితే (Coffee after dinner), అది మీ నిద్రకు భంగం కలిగించే అవకాశం ఉంది. కెఫిన్ ఒక ఉత్ప్రేరకంగా ఉండటం వలన నిద్రపోయే సమయం వచ్చినప్పుడు కూడా మేల్కొని ఉంటుంది. అందుకే కాఫీ తాగకండి. అది మీ నిద్రకు ఆటంకం (Coffee after dinner cause Insomnia) కలిగిస్తుంది.

    కొన్ని గంటల ముందు తినడం..

    నిద్రవేళకు కొన్ని గంటల ముందు తినడం (eating before sleep) కూడా యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమవుతుంది. మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. అలాగే, ఆల్కహాల్ (Alcohol) తాగడం వలన డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. మీరు రాత్రిపూట వ్యాయామం చేస్తే, వ్యాయామాలకు ముందు.. ఆ తర్వాత తినవద్దు ఎందుకంటే వాటిలో చాలా వరకు కెఫిన్ వంటి ఉత్ప్రేరకాలు ఉంటాయి.

    సమయానుగుణంగా నిద్ర..

    మీరు ఐదు గంటల నిద్ర (Five hours sleep)ను మాత్రమే తట్టుకోగలరని.. మీ పనిని పూర్తి చేయడానికి రోజులోని ప్రతి నిమిషాన్ని ఉపయోగించగలరని మీరు అనుకుంటే.. మీరు చాలా తప్పుచేస్తున్నట్లే. మనం ఆలస్యంగా మేల్కొన్నప్పుడు (late wakeup), అది రివర్స్ మెలటోనిన్ , కార్టిసాల్ రిబ్బన్‌లకు కారణమవుతుంది. మనం చురుకుగా పని చేస్తున్నప్పుడు మన శరీరం కార్టిసాల్, ఆడ్రినలిన్‌తోపాటు ఇతర హార్మోన్లను విడుదల చేస్తుంది.

    మీరు ఆలస్యంగా మేల్కొన్నప్పుడు ఈ చక్రం రివర్స్‌లో పని చేస్తుంది. ఎందుకంటే మీరు రాత్రి పని చేసేటప్పుడు శరీరం కార్టిసాల్‌ (Cortisol‌)ని విడుదల చేస్తుంది. అలాగే మీరు నిద్రించడానికి ప్రయత్నించినప్పుడు మెలటోనిన్ విడుదల అవుతుంది. కానీ అప్పటి వరకు రోజంతా అలానే ఉంటుంది. ఇది చివరికి మీ చక్కని నిద్ర వ్యవస్థను తగ్గిస్తుంది. ఈ ప్రభావంతో మీరు తక్కువ గంటలు నిద్రపోతారు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Coffee, Food, Sleep tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు