Home /News /life-style /

DO YOU KNOW THAT HEAVY SPICES IN OUR FOOD WILL CAUSE FOR INSOMNIA SO TRY THESE TIPS FOR GOOD SLEEP PRV

Sleep tips: ఆహారంలో మసాలాలు ఎక్కువ వాడితే రాత్రిళ్లు నిద్ర సరిగా రాదా? నిపుణులు ఏమంటున్నారు?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిద్రలేమి సమస్యను దూరం చేసి ప్రశాంతమైన నిద్ర (peaceful sleep) కావాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి . ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారంలో మసాలాలు (Spices in the diet) ఎక్కువగా ఉన్నా కష్టమేనట..

    ఉరుకుల పరుగుల జీవితం ఒత్తిడితో కూడిన ఉద్యోగం..  అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు.. ఆరోగ్యాన్ని పాడు చేసే సరికొత్త పోకడలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల (health problems)తో నేటి రోజులలో జనాలు బాధపడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.  సాధారణంగా మనిషి జీవన శైలిలో తినడానికి పడుకోవడానికి ఉదయం నిద్ర (sleep) లేవడానికి కూడా ఒక సమయం సందర్భం అంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ నేటి రోజుల్లో మాత్రం సమయం అంటూ ఏదీ లేదు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తినడం ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పడుకోవడం (sleeping)..  ఇక ఇష్టం వచ్చినప్పుడు లేవడం లాంటివి చేస్తున్నారు ఎంతో మందిపై  ఆరోగ్య సమస్యలు దూసుకొచ్చి మీద పడి పోతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో యువత (youngsters) పెద్దలు అందరూ కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏది అంటే నిద్రలేమి (Insomnia) అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ప్రస్తుతం అధునాతన జీవనశైలిలో  ఒత్తిడితో కూడిన లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే ఎంతోమంది పడుకున్నప్పటికీ నిద్ర (sleep) పట్టక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు .  అయితే ఇలా నిద్రపట్టక పోవడానికి కారణాలు ఏమైనప్పటికీ నిద్రపట్టడానికి మాత్రం కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

    ఆహారంలో మసాలాలు..

    నిద్రలేమి సమస్యను దూరం చేసి ప్రశాంతమైన నిద్ర (peaceful sleep) కావాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి అంటున్నారు నిపుణులు. అయితే ఆ చిట్కాలు (sleep tips) ఏమిటో ఇప్పుడు ఇక్కడ చూసి తెలుసుకుందాం.. ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారంలో మసాలాలు (Spices in the diet) ఎక్కువగా ఉన్నా, అది హై ప్రోటీన్ డైట్ అయినా నిద్రలేమికి దారితీస్తుంది అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా మసాలాలు (Spices) ఎక్కువగా ఉండే ఆహారాలు, ఆల్కహాల్, కాఫీ, కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలు, చక్కెర (sugar) ఎక్కువగా ఉండే పదార్థాలను రాత్రి సమయంలో అసలు తినకూడదట. ఇవి మీ నిద్ర (sleep) ను దూరం చేస్తాయని నిపుణులు అంటున్నారు.

    పగటిపూట తిరగడం..

    వెలుతురు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో పగటిపూట తిరగడం (walking at day time) అలవాటు చేసుకోవాలి. పర్యావరణంలో కనీసం 30 నిమిషాల పాటు గడిపేలా, మీ సమయాన్ని కేటాయించుకోవాలి. రాత్రిపూట పడుకునే (before sleep) ముందు సాధ్యమైనంత వరకు ఆరుబయట స్వచ్ఛమైన గాలిని పీల్చి, పడుకునే లాగా ప్రయత్నించాలి. ఇలాంటి పద్ధతులు పాటించడం వల్ల నిద్ర (sleep) సుఖంగా వస్తుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Sleep tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు