Beauty tips: మన జుట్టు రాలిపోవడాన్ని జామకాయ, ఆకులు తగ్గిస్తాయి.. ఆ చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

జామ (guava)లో చాలా అధికస్థాయిలో విటమిన్ సి (vitamin c) అనేది ఉంటుంది. ఇది మీ జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఇక జామను మీరు హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు

  • Share this:
    వాతావరణంలోని కాలుష్యం పెరిగింది, మన ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఈ రెండూ మన కేశాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. మహిళల కురులు  (women hairs) మగవారికీ ఇష్టమే. కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా  (beauty) కనిపిస్తారు. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్​ స్టైల్స్​ను ఫాలో అవుతారు. అయితే జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. కాకపోతే మగవారు బట్టతల వస్తుందని తెలిసే సరికి పట్టించుకోవడం మొదలెడతారు. ఇక సెలెబ్రెటీలైతే సరే సరి వారి కోసం పర్సనల్ హెయిర్​ స్పెషలిస్టులను పెట్టుకుంటారు. అయితే మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది.

    అధికస్థాయిలో విటమిన్ సి..

    జామ (guava)లో చాలా అధికస్థాయిలో విటమిన్ సి (vitamin c) అనేది ఉంటుంది. ఇది మీ జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఇక జామను మీరు హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. అలాగే జామ ఆకులను తీసుకొని పేస్ట్‌ లాగా చేసి హెయిర్ మాస్క్‌గా కనుక మీరు అప్లై చేస్తే మీ జుట్టుకు చాలా మంచిది. చాలా ఆరోగ్యంగా ఇంకా దృఢంగా మీ జుట్టు ఉంటుంది.

    ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

    పాలకూరలో..

    పాలకూరలో అనేక విటమిన్లు ఇంకా అలాగే ఖనిజాలు అనేవి ఎంతో సమృద్ధిగా ఉంటాయి. ఇక మీ రెగ్యులర్ డైట్‌లో పాలకూరని కనుక తింటే అది మీ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఇంకా ఆరోగ్యకరంగాను (healthy) ఉంటుంది. ఇక పాలకూరలో విటమిన్ సి, ఫోలేట్, ఐరన్ ఇంకా బీటా కెరోటిన్ అనేవి ఎంతో పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఇంకా దృఢంగా అలాగే అందంగా (beauty) ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇక సాల్మన్‌ చేపలో కూడా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అనేవి ఎంతో పుష్కలంగా ఉన్నాయి.

    గ్రీక్ పెరుగు కూడా జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఇంకా ఎంతో ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. ఇది మీ జుట్టు (hair)ని ఎంతో ఆరోగ్యంగా ఉంచటానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇక గ్రీక్ పెరుగులో విటమిన్ బి 5 అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మీ జుట్టు రాలడాన్ని (hair fall) కూడా వెంటనే తగ్గిస్తుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)



    ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?
    Published by:Prabhakar Vaddi
    First published: