Beauty tips: అందమైన చర్మం కోసం ఈ పండ్లను తరుచుగా తింటే చాలు.. ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం

ప్రతీకాత్మక చిత్రం

పలురకాల ఆహారపు అలవాట్లను (food habits) అలవర్చుకుంటే  సహజసిద్ద అందాన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా చర్మ సౌందర్యం (skin beauty) కోసం పలు రకాల పండ్లు తినడం పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది.

  • Share this:
    వర్షాకాలం (monsoon), చలికాలం (Winter). చర్మాన్ని ఎక్కువగా రక్షించుకోవాల్సిన సమయాలు. చాలామందికి బయటి వాతావరణం ఆహ్లాదంగా కనిపించినా వారి చర్మం (skin)లో వచ్చే మార్పులు చూసి తట్టుకోలేరు. బాహ్య చర్మ సంరక్షణ ( External skin care ) చాలా కీలకమవుతుంటుంది. ముఖ్యంగా చర్మ సంరక్షణ విషయంలో..  చర్మం సంరక్షణ ( Skin protection ) అనేది చాలా కీలకం. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టం కలుగుతుంది. అంతర్గత ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. బాహ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యం. శీతాకాలంలో సహజంగా ఎదురయ్యే సమస్య చర్మం పగలడం లేదా చర్మం  ( Skin ) పొడి బారి..దురద రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ కాలంలో చర్మాన్ని సాధ్యమైనంతగా మృదువుగా తేమగా ( Soft skin ) ఉంచుకుంటే మంచిది.

    ఆహారపు అలవాట్లు..

    అందాన్ని (beauty) పెంచుకోవడం కంటే ఇక పలురకాల ఆహారపు అలవాట్లను (food habits) అలవర్చుకుంటే  సహజసిద్ద అందాన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా చర్మ సౌందర్యం (skin beauty) కోసం పలు రకాల పండ్లు (fruits) తినడం పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది.  కేవలం చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి పైన మెరుగులు దిద్దితే సరిపోదని ఆరోగ్యాన్ని పెంచితే చర్మ సౌందర్యం ఆటోమేటిక్ (automatic) గా మీ సొంతం అవుతుంది అంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

    ద్రాక్షతో సౌందర్యం..

    అయితే పండ్ల (fruits)ను తింటే చర్మ సౌందర్యం పెరుగుతుందట. ఇలా చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు ద్రాక్ష  (grapes) ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు  నిపుణులు. సూర్యరశ్మి ద్వారా వచ్చే యు.వి కిరణాల (UV rays) నుంచి చర్మం దెబ్బతినకుండా రక్షించి ఎప్పుడూ కాంతివంతంగా (bright) ఉంచేందుకు ద్రాక్షలోని పాలి ఫినాల్స్ (polyphenols) అనే సహజసిద్ధ గుణం ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు.

    ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

    అంతేకాకుండా ద్రాక్ష రసాన్ని లోషన్ (lotion) లాగా కూడా చర్మానికి రాసుకునేందుకు అవకాశం ఉంది అంటూ చెబుతున్నారు. ఇలా రెగ్యులర్ గా ద్రాక్ష తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యం అంతకంతకూ పెరిగి పోతుంది అని..  ఆరోగ్యంగా (healthy) కూడా ఉంటుంది అని చెబుతున్నారు నిపుణులు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

     

    26 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌ ఇన్‌ఫ్లూయన్సర్ల డేటా లీక్​.. గుర్తించిన సెక్యూరిటీ పరిశోధకులు
    Published by:Prabhakar Vaddi
    First published: