Home /News /life-style /

DO YOU KNOW THAT EVEN THIS HABIT ALSO CAUSE INSOMNIA PROBLEM FOR YOU CLICK TO KNOW PRV

Sleep tips: రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడానికి ఈ అలవాటు కూడా ఓ కారణమట.. జాగ్రత్త పడండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పడుకోగానే నిద్ర ఎందుకు రావట్లేదు. అలా నిద్ర రావాలంటే ఎలాంటి పద్దతులు ఫాలో అవ్వాలి ఇపుడు తెలుసుకుందాం. నిద్రలేమి సమస్య.. అయితే కాఫీతో కూడా నిద్రలేమి సమస్య ఎదుర్కొంటారు . దాని గురించి తెలుసుకుందాం

    బిజీలైఫ్​ కారణంగా ఒత్తిడి (stress) అధికంగా ఉంటోంది. అందుకే నిద్ర (Sleep) కూడా సరిగా పోవడం లేదు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రశాంతమైన నిద్ర (peaceful sleep) చాలా అవసరం. ఒకవేళ నిద్ర పోదామని బెడ్​ ఎక్కినా తొందరగా నిద్ర రాదు. ఏం చేయాలో తోచదు. మరోవైపు ఉదయం కావొస్తుంది. మళ్లీ ఆఫీసులకు, పాఠశాలలకు , కాలేజీలకు పరుగులు తీయాలి. ఇక గృహిణులకైతే అందరి కంటే ముందే లేవాల్సి ఉంటుంది. వారికి నిద్ర (sleep) పట్టక పోతే కష్టం. ఉద్యోగులదీ అదే తీరు. పిల్లలైతే పాఠశాలల్లో, కళాశాలల్లో నిద్ర పోతారు. ఇలా ఎందుకు జరుగుతుంది. పడుకోగానే నిద్ర ఎందుకు రావట్లేదు.  దీనినే నిద్రలేమి సమస్య (Insomnia) అంటారు. అయితే నిద్ర రావాలంటే ఎలాంటి పద్దతులు ఫాలో అవ్వాలి ఇపుడు తెలుసుకుందాం. ..

    ఏం చేయాలి..?

    సాయంత్రం పూట మద్యం, సిగరెట్లు (cigarettes), ఎక్కువ భోజనం మానుకోండి. ఆల్కహాల్ (alcohol), సిగరెట్లు మరియు కెఫిన్ నిద్ర (sleep)కు భంగం కలిగిస్తాయి. ఎక్కువ, కారంగా భోజనం చేయడం వల్ల అజీర్ణం (digest) వల్ల అసౌకర్యం కలుగుతుంది. అది నిద్రపోవటాన్ని కష్టంగా చేస్తుంది. నిద్ర (sleep)కు ముందు (before sleep) రెండు, మూడు గంటలు ముందు ఎక్కువ భోజనం (food) తినొద్దు (don’t eat). ఒకవేళ ఆకలి (hungry)తో ఉంటే నిద్రపోవడానికి 45 నిమిషాల ముందు తేలిక పాటి చిరుతిండి (snacks)ని ప్రయత్నించండి. అప్పుడు హాయిగా నిద్ర పడుతుంది.

    కాఫీ, టీలతో..

    కాఫీ (coffee) లేదా టీ ప్రతి రోజూ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలు (health problems) తలెత్తుతాయి. ముఖ్యంగా మన కేంద్రీనాడీ వ్యవస్థ పై అధిక ప్రభావం చూపి నిద్రలేమి సమస్యకు దారి తీస్తుంది. అదేవిధంగా విపరీతమైన తలనొప్పి, అలసట, ఒత్తిడి (stress) వంటి సమస్యలు తలెత్తుతాయి.మనం కాఫీ ,టీ లను మితంగా తీసుకోవడం వల్ల ఎంతో చురుగ్గా మన పనులను మనం చేసుకోగలుగుతాము. కాబట్టి కాఫీ(Coffee), టీ లను పరిమితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం (health)తో పాటు మనం అనుకున్న పనులలో విజయం సాధించవచ్చు.

    కాఫీ తాగితే..

    మనం తాగే టీ లేదా కాఫీ (coffee)లో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. అదేవిధంగా మన శరీరంలో కేంద్ర నాడీ వ్యవస్థ (సీఎన్ఎఫ్)లో లో అడెసినోసిన్ రిసెప్టార్స్ లేదా పీ1 రిసెప్టార్స్ అని పిలిచే న్యూరోమాడ్యులేటర్ మనకు నిద్ర కలిగించడానికి కారణం అవుతుంది. పీ1 రిసెప్టార్స్ పై ఈ కెఫిన్ ప్రభావం చూపి అడెసినోసిన్ ను అడ్డుకుంటుంది. అందువల్ల కాఫీ తాగిన తర్వాత మనకు నిద్ర (sleep) రాదు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Coffee, Sleep tips

    తదుపరి వార్తలు