Home /News /life-style /

DO YOU KNOW THAT EVEN THIS HABIT ALSO CAUSE FOR SLEEP PROBLEM IN NIGHT TIMES HERE THE FULL DETAILS PRV

Sleep problems: నిద్ర సరిగా పట్టడం లేదా? అయితే బీ కేర్​ ఫుల్.. దానికి Coffee కూడా ఓ కారణమట..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆరోగ్యంగా ఉండటానికి ప్రశాంతమైన నిద్ర (peaceful sleep) చాలా అవసరం. ఒకవేళ నిద్ర పోదామని బెడ్​ ఎక్కినా తొందరగా నిద్ర రాదు. ఏం చేయాలో తోచదు. అయితే నిద్ర రావాలంటే ఎలాంటి పద్దతులు (Sleep tips) ఫాలో అవ్వాలి ఇపుడు తెలుసుకుందాం. ..

    ఆరోగ్యంగా ఉండటానికి ప్రశాంతమైన నిద్ర (peaceful sleep) చాలా అవసరం. ఒకవేళ నిద్ర పోదామని బెడ్​ ఎక్కినా తొందరగా నిద్ర రాదు. ఏం చేయాలో తోచదు. మరోవైపు ఉదయం కావొస్తుంది. మళ్లీ ఆఫీసులకు, పాఠశాలలకు , కాలేజీలకు పరుగులు తీయాలి. ఇక గృహిణులకైతే అందరి కంటే ముందే లేవాల్సి ఉంటుంది. వారికి నిద్ర (sleep) పట్టక పోతే కష్టం. ఉద్యోగులదీ అదే తీరు. పిల్లలైతే పాఠశాలల్లో, కళాశాలల్లో నిద్రపోతారు. ఇలా ఎందుకు జరుగుతుంది. పడుకోగానే నిద్ర ఎందుకు రావట్లేదు.  దీనినే నిద్రలేమి సమస్య (Sleep problems) అంటారు. అయితే నిద్ర రావాలంటే ఎలాంటి పద్దతులు (Sleep tips) ఫాలో అవ్వాలి ఇపుడు తెలుసుకుందాం. ..

    ఏం చేయాలి..?

    మద్యం, సిగరెట్లు (Cigarettes), ఎక్కువ భోజనం సాయంత్రం సమయాల్లో తగ్గించుకుంటే మంచిది. ఆల్కహాల్ (alcohol), సిగరెట్లు, కెఫిన్ నిద్ర (sleep)కు భంగం కలిగిస్తాయి. ఎక్కువ, కారంగా భోజనం చేయడం వల్ల అజీర్ణం (digest) వల్ల అసౌకర్యం కలుగుతుంది. అది నిద్రపోవటాన్ని కష్టంగా చేస్తుంది. నిద్ర (sleep)కు ముందు (before sleep) రెండు, మూడు గంటలు ముందు ఎక్కువ భోజనం (food) తినొద్దు (don’t eat). ఒకవేళ ఆకలి (hungry)తో ఉంటే నిద్రపోవడానికి 45 నిమిషాల ముందు తేలిక పాటి చిరుతిండి (snacks)ని ప్రయత్నించండి. అప్పుడు హాయిగా నిద్ర పడుతుంది.

    మనం తాగే టీ లేదా కాఫీ (coffee)లో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. అదేవిధంగా మన శరీరంలో కేంద్ర నాడీ వ్యవస్థ (సీఎన్ఎఫ్)లో లో అడెసినోసిన్ రిసెప్టార్స్ లేదా పీ1 రిసెప్టార్స్ అని పిలిచే న్యూరోమాడ్యులేటర్ మనకు నిద్ర కలిగించడానికి కారణం అవుతుంది. పీ1 రిసెప్టార్స్ పై ఈ కెఫిన్ ప్రభావం చూపి అడెసినోసిన్ ను అడ్డుకుంటుంది. అందువల్ల కాఫీ తాగిన తర్వాత మనకు నిద్ర (sleep) రాదు.

    నిద్రలేమి సమస్యకు దారి..

    కాఫీ (coffee) లేదా టీ ప్రతి రోజూ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలు (health problems) తలెత్తుతాయి. ముఖ్యంగా మన కేంద్రీనాడీ వ్యవస్థ పై అధిక ప్రభావం చూపి నిద్రలేమి సమస్యకు దారి తీస్తుంది. అదేవిధంగా విపరీతమైన తలనొప్పి, అలసట, ఒత్తిడి (stress) వంటి సమస్యలు తలెత్తుతాయి.

    మనం కాఫీ ,టీ లను మితంగా తీసుకోవడం వల్ల ఎంతో చురుగ్గా మన పనులను మనం చేసుకోగలుగుతాము. కాబట్టి కాఫీ(Coffee), టీ లను పరిమితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం (health)తో పాటు మనం అనుకున్న పనులలో విజయం సాధించవచ్చు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Coffee, Sleep tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు