Sleep tips: రాత్రి పూట తక్కువగా తిన్నవారికి ప్రశాంతంగా నిద్ర పడుతుందా? నిపుణులు ఏమంటున్నారు?

(ప్రతీకాత్మక చిత్రం)

బిజీలైఫ్​ కారణంగా ఒత్తిడి (stress) అధికంగా ఉంటోంది. అందుకే నిద్ర (Sleep) కూడా సరిగా పోవడం లేదు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రశాంతమైన నిద్ర (peaceful sleep) చాలా అవసరం. ఒకవేళ నిద్ర పోదామని బెడ్​ ఎక్కినా తొందరగా నిద్ర రాదు.

  • Share this:
    బిజీలైఫ్​ కారణంగా ఒత్తిడి (stress) అధికంగా ఉంటోంది. అందుకే నిద్ర (Sleep) కూడా సరిగా పోవడం లేదు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రశాంతమైన నిద్ర (peaceful sleep) చాలా అవసరం. ఒకవేళ నిద్ర పోదామని బెడ్​ ఎక్కినా తొందరగా నిద్ర రాదు. ఏం చేయాలో తోచదు. మరోవైపు ఉదయం కావొస్తుంది. మళ్లీ ఆఫీసులకు, పాఠశాలలకు , కాలేజీలకు పరుగులు తీయాలి. ఇక గృహిణులకైతే అందరి కంటే ముందే లేవాల్సి ఉంటుంది. వారికి నిద్ర (sleep) పట్టక పోతే కష్టం. ఉద్యోగులదీ అదే తీరు. పిల్లలైతే పాఠశాలల్లో, కళాశాలల్లో నిద్ర (sleep) పోతారు. ఇలా ఎందుకు జరుగుతుంది. పడుకోగానే నిద్ర ఎందుకు రావట్లేదు. అలా నిద్ర రావాలంటే ఎలాంటి పద్దతులు (sleep tips) ఫాలో అవ్వాలి ఇపుడు తెలుసుకుందాం.

    ఉపవాసంతో నిద్ర..

    మామూలుగా పిల్లలకి ఎప్పుడైనా రాత్రులు అన్నం (night food) తినకుండా ఉంటే చాలు మనం కాస్త అన్నం లేదా పాలు తాగి పడుకో లేకుంటే అర్ధరాత్రి ఆకలేస్తుంది అని పిల్లలకి చెబుతూ ఉంటాము.  కాకపోతే రాత్రులు నిద్ర పట్టనప్పుడు ఉపవాసం ఉంటే మంచిదని అమెరికాలోని ఓ పరిశోధనలో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. రాత్రి పూట (night time) చేసే ఉపవాసంతో మనిషి ప్రశాంతంగా (peaceful) నిద్ర పోతారని తేలింది. దీనితో పాటు అలా ఉపవాసంతో పడుకున్న వారిలో దాదాపు 500 కేలరీలు ఖర్చు అవుతాయట.  అయితే అసలే తినకపోవడం కంటే కొంచెం తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

    కొద్దిగా తినడం బెటర్..

    పరిశోధకులు కొందరు వ్యక్తులను పరిశీలించారు. వారికి కొన్ని రోజులపాటు కడుపునిండా ఆహారం (full food)  ఇచ్చారు. ఇక అలాగే కొన్ని రోజుల పాటు కేవలం నీరు, కొద్దిగా ఆహారం మాత్రమే ఇస్తూ రాత్రి వారు ఎలా నిద్రపోతున్నారు (sleeping) అనే విషయాన్ని గమనించారు. కడుపునిండా తిన్నప్పటితో పోలిస్తే ఆహారం తీసుకోని అప్పుడే వారికి బాగా నిద్ర పట్టిందా (happy sleep) అని వారు చేసిన పరిశోధనలో తేలింది.

    ఇవి కూడా చదవండి:  26 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌ ఇన్‌ఫ్లూయన్సర్ల డేటా లీక్​.. గుర్తించిన సెక్యూరిటీ పరిశోధకులు

    కాబట్టి రాత్రిళ్లు తక్కువ తిని నిద్రపోతేనే (Eat less and sleep) నిద్రలేమి సమస్యలకు పెట్టొచ్చు అంటున్నారు వారు. కాబట్టి ఎవరైనా అధిక బరువు (heavy weight) సమస్యతో ఉన్నవారు ఇలా రాత్రి పూట కాస్త తక్కువగా భోజనం చేసి నిద్రపోతే (Eat less and sleep) హాయిగా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. అయితే మధ్యాహ్నం పూట ఎక్కువగా తింటే.. రాత్రిళ్లు తక్కువగా తినడానికి వీలుంటుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published: