Home /News /life-style /

DO YOU KNOW THAT DRINKING THIS TEA WILL HELP YOU SLEEP COMFORTABLY FOLLOW THESE PROCEDURE PRV

Sleep tips: ప్రశాంతంగా నిద్ర పట్టడం లేదా? అయితే ఈ టీ తాగితే మీకు హాయిగా నిద్ర పట్టడం ఖాయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలామందికి నిద్ర ప్రశాంతంగా పట్టదు. రోజూ ఎక్కువసేపు పడుకన్నా నిద్ర హాయిగా పట్టదు. అయితే చాలామందికి రాత్రిళ్లు టీ తాగే అలవాటు ఉంటుంది. వారికి ఇంట్లోకి వెళ్లగానే నిద్ర పట్టాలంటే ఓ చిట్కా (sleep tips) ఉంది. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం.. అదే అరటి పండు తో చేసే బనానా టీ (Banana Tea)

ఇంకా చదవండి ...
    పని ఒత్తిడి కారణంగా చాలామందికి ప్రశాంతత (peace) కరువైంది. కరోనా కారణంగా జనం ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టనివారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర (sleep) కూడా కరువు అవుతుంది. అయితే చాలామందికి నిద్ర ప్రశాంతంగా పట్టదు. రోజూ ఎక్కువసేపు పడుకన్నా నిద్ర హాయిగా పట్టదు. అయితే చాలామందికి రాత్రిళ్లు టీ తాగే అలవాటు ఉంటుంది. వారికి ఇంట్లోకి వెళ్లగానే నిద్ర పట్టాలంటే ఓ చిట్కా (sleep tips) ఉంది. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం.. అదే అరటి పండు తో చేసే బనానా టీ (Banana Tea).  ఈ టీ తాగడం వలన చక్కటి నిద్ర (sleep) పడుతుందని, మీరు నిద్ర మాత్రలు వాడం కన్నా ఈ టీ అలవాటు చేసుకోవడం మంచిది. ఈ టీ తయారు చేయడానికి మీరు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ టీ ఎలా చేయాలో తెలుసుకుందాం.

    అరటి పండు, దాల్చిన చెక్క..

    ఈ టీ (tea) తయారు చేయడానికి మీకు కేవలం అరటి పండు (banana), కాస్త నీళ్లు, దాల్చిన చెక్క ఉంటే సరిపోతుంది.  ఒక అరటి పండు (banana) ను తీసుకొని దానిని ముందుగా శుభ్రపరచుకొండి, అరటి పండు కొనలను ఇరువైపులా అంటే పైన కోన, కింద కొన కత్తిరించండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక గ్లాస్ నీళ్లు పోసి, ముందుగా మనం కత్తిరించి పెట్టుకున్న అరటిను అందులో వేసి ఒక పది నిమిషాల పాటు బాగా మారగా పెట్టండి. ఇప్పుడు బాగా మరిగించిన తర్వాత ఆ పాత్రను తీసుకొని దానిని వడకట్టి ఆ నీరు ను వేరు చేయండి. అరటిపండు మామూలుగానే తీయగా (sweet) ఉంటుంది. మనం ప్రత్యేకంగా చక్కర, బెల్లం లాంటి  వాటిని కలుపుకోవాల్సిన అవసరం లేదు.

    ఈ మిశ్రమం ఉడికేటప్పుడే దాల్చిన చెక్క కూడా మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకున్నా దాని పొడి నైనా  మరిగించిన నీటి (water)లో కలుపు కోవచ్చు అది మీ ఇష్టం. బనానాలో సహజం గానే ఎన్నో మూలకాలు ఉండడం వలన అవి మీకు శక్తీ తో పాటు, అందులో వుండే అమైనో ఆమ్లాల వల్ల మీకు చక్కటి నిద్ర కూడా పడుతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)





    ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

     
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Banana, Health Tips, Sleep tips, Tea

    తదుపరి వార్తలు