Home /News /life-style /

DO YOU KNOW THAT APPLYING OIL TO THE HAIR ACCORDING TO A METHOD MAKES THE HAIR STRONG AND FIRM AND GET RID OF HAIR LOSS PROBLEMS PRV

Hair Loss treatment: జుట్టుకు నూనె పెట్టే పద్దతి కూడా హెయిర్ ఫాల్ సమస్యను దూరం చేస్తుంది.. మరి నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వారానికి కనీసం ఒక్కసారైనా నూనె పెట్టుకోవడం వల్ల స్కాల్ప్ పై ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. చుండ్రు (dandruff) సమస్య రాదు. ఓ పద్ధతి ప్రకారం నూనె (Oil) పెట్టుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.

    ప్రతి ఒక్కరికి జుట్టురాలే సమస్య, అతి పెద్ద సమస్యగా మారిపోయింది. ఇందు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో డబ్బులు కూడా ఖర్చు చేసి, విసుగు చెంది ఉంటారు చాలామంది. జుట్టు (hair) రాలిపోతుండటాన్ని (loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. మహిళల కురులు  (women hairs) మగవారికీ ఇష్టమే. కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా  (beauty) కనిపిస్తారు. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్​ స్టైల్స్​ను ఫాలో అవుతారు. అయితే జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది.

    ఒత్తిడి, తలనొప్పి తగ్గుముఖం..

    వారానికి కనీసం ఒక్కసారైనా నూనె (Oil) పెట్టుకోవడం వల్ల స్కాల్ప్ పై ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. చుండ్రు (dandruff) సమస్య రాదు. వెంట్రుకల కుదుళ్లకు తగిన పోషణ అందుతుంది. ఫలితంగా అవి బలంగా, ఒత్తుగా తయారవుతాయి. ఒత్తిడి, తలనొప్పి తగ్గుముఖం పడతాయి. నిద్ర చక్కగా పడుతుంది. మరీ తక్కువ లేదా మరీ ఎక్కువ నూనె రాసుకొన్నా దానివల్ల ఎలాంటి ప్రయోజనం కలగదు. అలాగే ఏదో రాసుకున్నాంలే అన్నట్టు కాకుండా ఓ పద్ధతి (Hair Loss treatment ) ప్రకారం నూనె (Oil) పెట్టుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.

    తలను చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. సాధారణంగా నూనె (Oil) రాసుకొన్న తర్వాత తల దువ్వుకొంటాం. కానీ నూనె పెట్టుకొనే ముందే చిక్కులు తీసుకోవాలి.
    నూనెను గోరువెచ్చగా ఉండేలా వేడి చేయాలి. అప్పుడే అది మాడుపై సులభంగా పరుచుకుంటుంది. వెంట్రుకలకు బాగా పడుతుంది. గోరువెచ్చగా ఉన్న ఈ నూనె (Oil)లో చేతి వేళ్లను ముంచి మాడుకు రాసుకొని సున్నితంగా మర్దన (Gently massage) చేసుకోవాలి. కనీసం పావుగంట సమయం మసాజ్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితం లభిస్తుంది.

    నూనె స్కాల్ప్ కి మాత్రమే రాసుకొంటే సరిపోదు. వెంట్రుకలు కుదుళ్ల నుంచి చివరి వరకు రాసుకోవాలి (The hair should be written from the scalp to the end). దీనికోసం జుట్టును రెండు పాయలుగా విడగొట్టుకోవాలి. చేతిలో కొద్దిగా నూనె పోసుకొని రెండు చేతులతో బాగా రబ్ (Rub) చేసి వెంట్రుకలకు రాసుకోవాలి. ఇలా నూనె పెట్టుకొనేటప్పుడు ఎక్కువ నూనె ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకొని అప్లై (Apply) చేసుకోవాలి. ఒకవైపు పూర్తయిన తర్వాత మరోవైపు రాసుకోవాలి. ఇప్పుడు వేడి నీటిలో ముంచి బాగా పిండిన టవల్ ను తలకు చుట్టుకొని పదినిమిషాలు ఉండాలి. రెండు గంటల తర్వాత షాంపూతో తలస్నానం చేయాల్సి ఉంటుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Hair Loss, Hair problem tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు