హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Beauty with Alcohol: ఆల్కాహాల్​ కూడా మీ చర్మంపై ముడతలు, వలయాలు దూరం చేస్తుందట.. ఇలా చేయండి..

Beauty with Alcohol: ఆల్కాహాల్​ కూడా మీ చర్మంపై ముడతలు, వలయాలు దూరం చేస్తుందట.. ఇలా చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అయితే కొంత మంది చిన్న వయసులోనే వారి ఫేస్​లో యవ్వనత్వం తగ్గిపోతున్నట్లు కనిపిస్తుంది. అలాంటి వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యం కూడా మనిషికి అందాన్నిస్తుందట. ఆ విషయాలు ఒకసారి తెలుసుకుందాం..

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పొల్యూషన్​ కారణంగా ముఖంలో తేడాలు వచ్చేస్తున్నాయి. అందం తగ్గిపోయినట్లు అనిపిస్తుంటుంది. ఈ బిజీ లైఫ్‌లో శరీరం, అందంపై ప్రత్యేక శ్రద్ధ వహించే సమయమే లేకుండా పోతుంది. దీంతో చిన్న వయసులోనే ముఖంపై (face) ముడతలు (wrinkles) వస్తున్నాయి. ముడతలు పడే చర్మం కోసం మీరు ఇంట్లోనే తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ (face pack)లను ఉపయోగించవచ్చు. పాలు, తేనె, పిండి, పసుపు మొదలైనవి కాకుండా మీరు పండ్ల నుంచి తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లను ట్రై చేయాలి. ఇది అనేక చర్మ సంబంధిత సమస్యలను వదిలించడానికి సహాయపడుతుంది. అయితే సోషల్​ మీడియాలో కొన్ని చిట్కాలు సర్క్యలేట్​ అవుతున్నాయి. ఆల్కాహాల్ (Alcohol)​తో మీ అందాన్ని మెరుగు పరచుకోవచ్చంట. వోడ్కా, వైన్ (wine) వంటివి సౌందర్యాన్ని (beauty) ఎలా పెంచుతాయో వివరించారు. ఒకసారి దాని గురించి తెలుసుకుందాం..

వైన్​తో ఫేస్​ప్యాక్​..

రెడ్ వైన్ (red wine) యాంటీ ఆక్సిడెంట్ లను పుష్కలంగా కలిగి ఉంటుంది . ముఖంపై (on face) దీనిని అప్లై చేయటం వలన నల్లటి వలయాలు (dark circles), ముడుతలు తొలగిపోతాయి. అంతేకాకుండా, రెడ్ వైన్ కు కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేసి, 10 నుండి 15 నిమిషాల పాటూ ఉంచటం వలన చర్మం (skin) పున: తాజా అవుతుంది..

పాదాలకు బీర్..

సగం బాటిల్ బీర్ (beer) ను గోరువెచ్చని నీటిలో కలిపి  కాళ్ళను 20 నిమిషాల పాటూ ముంచండి. బీర్ సహజ యాంటీ సెప్టిక్ వలే పని చేసి, కాలి గోర్లను శుభ్రపరుస్తుంది. దీనితో పాటుగా బీర్ పాదాలను మృదువుగా (smooth) మారుస్తుంది. ఉప్పు, ఆలివ్ ఆయిల్ మరియు కొద్దిగా నిమ్మరసం (lemon juice) కలిపిన మిశ్రమాన్ని చర్మంపై వలయాకారంలో రుద్దండి. ఇది మీ శరీరంపై ఉండే నిర్జీవ కణాలను తొలగించి, చర్మాన్ని మృదువు (smooth skin)గా చేస్తుంది. ఈ మిశ్రమంతో చర్మంపై రుద్దిన తరువాత 5 నిమిషాల పాటూ అలాగే ఉంచి, నీటితో చర్మాన్ని కడగండి. అంతేకాదండోయ్​ ఈ మద్యం (బీర్​)ను పాదాలకు వాడితే నొప్పులు (pains gone) కూడా మటుమాయం అవుతాయంట.

జుట్టు మృదువుగా..

రోజు మన చుట్టూ ఉండే వాతావరణానికి జుట్టు బహిర్గతం అవటం వలన వెంట్రుకలు (hair) పొడిగా, అనారోగ్యానికి గురవుతాయి. ఇలాంటి సమయంలో జుట్టును షాంపూతో కడిగిన తరువాత తేలిక పాటి గాడత గల బీర్ లో ముంచండి. ఇలా చేయటం వలన మీ జుట్టు మృదువుగా మారటమే కాకుండా, తలపై చర్మ ఆరోగ్యం (skin health) కూడా మెరుగుపడుతుంది.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

First published:

Tags: Alcohol, Skin care

ఉత్తమ కథలు