Home /News /life-style /

DO YOU KNOW THAT A MIXTURE OF PEPPER TO PREVENT HAIR LOSS THEN CLICK HERE FOR THE FULL DETAILS PRV

Hair fall Treatment: జుట్టు రాలిపోకుండా ఉండాలంటే మిరియాల మిశ్రమం చాలు.. ఆ మిశ్రమం ఎలా తయారుచేసుకోవాలంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది.

    జుట్టు (hair) రాలిపోతుండటాన్ని (loss) చూసి తట్టుకోలేరు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. మహిళల కురులు  (women hairs) మగవారికీ ఇష్టమే. కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా  (beauty) కనిపిస్తారు. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్​ స్టైల్స్​ను ఫాలో అవుతారు. అయితే జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. కాకపోతే మగవారు బట్టతల వస్తుందని తెలిసే సరికి పట్టించుకోవడం మొదలెడతారు. ఇక సెలెబ్రెటీలైతే సరే సరి వారి కోసం పర్సనల్ హెయిర్​ స్పెషలిస్టులను పెట్టుకుంటారు. అయితే మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది.

    జుట్టు పెరగడానికి మిరియాలు (Pepper)..

    అందంగా ఉండాలని ఎవరికి ఉండదు. అందులో స్త్రీలకు కొంచెం ఎక్కువ శ్రద్ధ. పెరుగుతున్న కాలుష్యం, రేడియేషన్, ఆహార విధానాల వల్ల కూడా జుట్టు ఊడటం (hair loss), చిట్లడం, తెల్లబడటం వంటి సమస్యలు తలెత్తున్నాయి. అయితే ఈ సమస్య కోసం ఏ మాత్రం ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో దొరికే వాటితోనే పరిష్కరించుకోవచ్చు (hair fall treatment). మిరియాలు (Pepper) జుట్టు పెరగడానికి ఎంతగానో ఉపయోగ పడుతాయట. మిరియాలు (Pepper) మెత్తగా నూరాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని జుట్టు ఊడిన చోట రుద్దాలి. దీంతో వెంట్రుకల కుదుళ్లు గట్టి పడి తిరిగి పెరగటం మొదలవుతుంది.

    జుట్టు తెల్ల పడకుండా..

    పసుపు, మాను పసుపు కలిపి పొడి చేసి ఆ పొడిని వెన్నతో ముద్దగా నూరి తలకు పట్టించి గంట సేపు ఆగిన తరువాత తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు చిట్లడం తగ్గుతుంది., కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి మరిగించాలి. ఆ నూనె చల్లారాక వడకట్టుకుని నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు ఈ నూనె కుదుళ్లకు పట్టించడం వల్ల జుట్టు తెల్ల పడకుండా ఉంటుంది. మినుములు, ఉసిరికాయ బెరడు, సీకాయ, మెంతులను పొడిగా నూరాలి. తర్వాత అర గ్లాసు నీళ్లలో రెండు స్పూన్ల పొడిని వేసి కలపాలి. ఆ నీటిని  హెయిర్ ప్యాక్ లా వేసుకొని అరగంట తర్వాత తల స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Beauty tips, Hair fall, Hair Loss, Treatment

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు