చాలామందిలో దంతాలు అంత అందంగా కనబడవు, పసుపు పచ్చగా కనబడుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీ దంతాలను తెల్ల(white)గా మార్చుకోవచ్చు. మళ్లీ అందంగా ఎలాంటి బాధలు లేకుండా నవ్వుకోవచ్చు. అయితే ఆ చిట్కాలు ఏంటనేది ఇపుడు తెలుసుకుందాం..
దంతాలు(Teeth). ముఖంలో నవ్వు(Smile)ను ప్రతిబించించేవి. అయితే దంతాలు చాలా మందిలో పటిష్టంగా ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రంగు మారుతుంటాయి. పసుపు పచ్చ(yellow)గా తయారవుతాయి. దీంతో నలుగురిలో హాయిగా నవ్వాలన్నా(smile) మొహమాటపడే పరిస్థితికి వస్తారు. అయితే. అందుకే, ఎప్పుడూ పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు. రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్ల(white)గా మిళమిళలాడుతూ ఆరోగ్యంగా ఉంటాయి. అయితే మరికొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపు పచ్చగా కనబడుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీ దంతాలను తెల్ల(white)గా మార్చుకోవచ్చు. మళ్లీ అందంగా ఎలాంటి బాధలు లేకుండా నవ్వుకోవచ్చు. అయితే ఆ చిట్కాలు ఏంటనేది ఇపుడు తెలుసుకుందాం..
అరటి, బత్తాయి తొక్కలతో..
అరటి పండు(banana), బత్తాయి, సంత్రం పండ్లు, నిమ్మకాయ(lemon) తొక్కలలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. అది మీ దంతాలను తెలుపు రంగులోకి తీసుకువస్తుంది. ప్రతిరోజూ బ్రష్ చేసే ముందు అరటి పండు తొక్కలను దంతాలపై రుద్దాలి. అనంతరం బ్రష్ చేయాలి. ఇలా కొద్దిరోజులు చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. దంతాలు తెల్లగా మారుతాయి. లేదా బత్తాయి లేదా నిమ్మకాయ తొక్కలతో దంతాలను రుద్దాలి. ఆ తరువాత బ్రష్ చేస్తే దంతాలు తెలుపు రంగులోకి మారతాయి. బొగ్గు (Charcoal) ద్వారా దంతాలకు మేలు జరుగుతుంది. దంతాలను తళతళ మెరిసేలా చేయడంతో పాటు నోటిలోని విషపూరితాలను, బ్యాక్టీరియాలను తరిమికొడుతుంది. కొంత బొగ్గును తీసుకుని పొడిగా చేసుకోవాలి. ఆ పొడిని టూత్ బ్రష్‌తో గానీ లేదా చేతి వేలితో పళ్లు తోముకోవాలి. దాని వల్ల మీ దంతాలు తళతళలాడతాయి. కొన్ని రకాల బ్యాక్టీరియాలు, విష పూరితాలను తొలగిస్తుంది.
నిమ్మతో తళతళలాడుతాయి..
పళ్లు ఎలా తోముతున్నా పసుపు రంగుగా మారుతున్నాయా.. మీ నోటి నుంచి దుర్వాసన(bad smell) వస్తుందా. అయితే మీ దంతాలు పసుపు రంగులోకి మారడానికి కొన్ని కారణాలున్నాయి. అందుకు మీరు తీసుకునే ఆహారం కూడా ఒక కారణం అవుతుంది. కొన్నిసార్లు దంతాలకు సరైన పోషణ లేకపోవడం, స్మోకింగ్, వయసు రీత్యా కారణాలు, వాతావరణం లాంటి పలు అంశాల కారణంగా మీ దంతాలు తెలుపు నుంచి పసుపు రంగులోకి మారతాయి. ఇక బ్రెష్ చేసుకునేటపుడు జాగ్రత్తలు పాటించాలి. నిమ్మ (lemon) సహజంగా సిట్రిక్ యాసిడ్ కలిగి ఉంటుంది, ఈ సిట్రిక్ యాసిడ్ కు ఉప్పు చేర్చడం వల్ల ఈ రెండింటి మిశ్రమం సహజంగానే దంతాలు తళతళలాడేలా చేస్తాయి. మీ దంతాలు తెల్లగా మారాలంటే ఈ రెండింటి మిశ్రమంతో రెగ్యులర్ గా బ్రష్ చేయాలి.
ఆయిల్ పుల్లింగ్(Oil Pulling)..
కొబ్బరి నూనెతో సమస్యకు చెక్ పెట్టవచ్చు. కొబ్బరి నూనెతో పలు సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు టేబుల్ స్పూన్ మోతాదులో కొబ్బరి నూనె నోట్లో పోసుకుని పుక్కిలించాలి. అలా ఓ 10 నిమిషాలు చేసిన తరువాత ఆ నూనెను ఉమ్మివేయాలి. ఆ తరువాత కొన్ని మంచి నీళ్లు నోట్లో పోసుకుని పుక్కిలించాలి. అనంతరం బ్రష్ చేసుకోవాలి. దంతాలను తెల్లగా మార్చే గుణం బేకింగ్ సోడా కలిగి ఉంటుంది. దీన్ని కొన్ని రకాల టూత్ పేస్టులలో సైతం వాడతారు. కొత బేకింగ్ సోడాను కొన్ని చుక్కలు నీళ్లలో పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పేస్టుగా మార్చి బ్రష్ చేసుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండు పర్యాయాలు ఇలా చేస్తే మీ దంతాలు పసుపు రంగు నుంచి తెలుపు రంగులోకి మారతాయి.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.