Sleep: రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోతున్నారా? అయితే మీకు భవిష్యత్తులో ఈ సమస్యలు వచ్చే అవకాశం

ప్రతీకాత్మక చిత్రం

ఈ మధ్య కాలంలో అయితే ఎవరూ కూడా పని ఉన్నా లేకపోయినా కూడా సరైన సమయానికి నిద్రపోవడం మాత్రం చేయడం లేదు ప్రతి ఒక్కరూ లేట్ నైట్ వరకు మేలుకుని ఆ తర్వాత నిద్రపోతున్నారు (sleep) ఉదయం సమయంలో కూడా త్వరగా లేవడం లేదు.

  • Share this:
    కరోనా (Corona)  చాలా మందిలో సమస్యలు తీసుకొచ్చింది. కొత్త కొత్త రోగాలనూ బయటకు తీసింది. మనిషికి ఊపిరాడనివ్వలేదు. దీనివలన అప్పుడప్పుడు. తలనొప్పి రావడం, కాళ్లు చేతులు గుంజడం, ఆకలి వేయకపోవడం, ఆసక్తి లేకపోవడం, బయటకు చెప్పుకోలేని కొన్ని రకాల రోగాలు (Diseases) రావడం, మానసికంగా బలహీనంగా ఉండటం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, నిద్రలేమి వంటి అనేక సమస్యలు వస్తున్నాయి. అయితే కరోనా లాక్​డౌన్ (lockdown)​ కారణంగా చాలామంది రాత్రిళ్లు మేల్కునే ఉన్నారు. దీంతో అన్​లాక్‌ అనంతరం మళ్లీ సాధారణ జీవితం గడపాలనుకున్నా.. సాధ్యం కావడం లేదని పలువురు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం నిద్రలేమి(Insomnia).

    లాక్​డౌన్​ కాలంలో పనేమీ లేకపోవడంతో ఇంట్లోనే ఇష్టం వచ్చిన సమయం (time)లో నిద్రించేవారు. కానీ. మళ్లీ రొటీన్​ జీవితంలోకి అడుగుపెట్టాక అది ఇబ్బందిగా మారుతోంది. ఉద్యోగస్తులకైతే మరీ కష్టం. రాత్రిళ్లు నిద్ర (sleep) లేకపోవడం(sleeping problems), ఉదయాన్నే ఆఫీసులో నిద్ర రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే ఎవరూ కూడా పని ఉన్నా లేకపోయినా కూడా సరైన సమయానికి నిద్రపోవడం మాత్రం చేయడం లేదు  . ప్రతి ఒక్కరూ లేట్ నైట్ వరకు మేలుకుని ఆ తర్వాత నిద్రపోతున్నారు (sleep) ఉదయం సమయంలో కూడా త్వరగా లేవడం లేదు.

    జ్ఞాపకశక్తిపై ప్రభావం..

    రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్ర పోతున్న వీరందరూ కూడా ఉదయం ఆలస్యంగానే నిద్ర (sleep) లేస్తారు. అయితే ఒకవేళ మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే వదులుకోవాలి అని సూచిస్తున్నారు నిపుణులు. ఇలాంటి అలవాటు అస్సలు మంచిది కాదు అని చెబుతున్నారు. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మెదడు (brain) పనితీరు తగ్గడంతో పాటు జ్ఞాపకశక్తి (memory) క్రమక్రమంగా సన్నగిల్లుతుంది అని చెబుతున్నారు నిపుణులు. అంతే కాకుండా ఏకాగ్రత (concentration) చురుకుదనం లాంటివి దూరమవుతాయని ఇక ఏ విషయాన్ని కూడా అంతగా పట్టించుకోకుండా ఉంటారట. అంతే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి అని హెచ్చరిస్తున్నారు.

    ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

    సమయపాలన పాటించకుంటే..

    సమయపాలన పాటించకుంటే నిద్రకు (sleep) సరైన సమయం కేటాయించకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడ జనాల తీరులో మాత్రం మార్పు రావడంలేదు.  ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే ఎంతో మంది యువత నైట్ డ్యూటీ (night duty) ఎక్కువగా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు...  ఇక మరికొంతమంది వీడియో గేమ్స్ (video games) చాటింగ్ అంటూ లేట్ నైట్ వరకు నిద్ర పోకుండా నే ఉంటున్నారు ఇంకెంత మంది ఇక టీవీలు చూస్తూ అలాగే నిద్ర (sleep) పోకుండా ఉంటున్నారు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

    ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
    Published by:Prabhakar Vaddi
    First published: