Healthy food: మార్కెట్లో తాజా చేపలను ఎలా గుర్తించాలో తెలుసా? ఎలాంటి వారు చేపలు తింటే ఆరోగ్యకరం?

ప్రతీకాత్మక చిత్రం

చేపలు (fish) ఆరోగ్యానికి చాలా ఉపయోగపడేవి. చాలా మంది ఇష్టంగానూ తింటారు. ముఖ్యంగా మాంసాహార ప్రియలు ఇష్టపడే వాటిలో చేపలు ఒకటి. అయితే ఈ మధ్యలో చేపల ధరలు కూడా ఆకాశన్నంటుతున్నాయి. మార్కెట్లోకి వచ్చిన చేపల్లో రెండు మూడు రోజుల చేపలను విక్రయానికి పెడుతారు. అవి తింటే అనారోగ్యం పాలవ్వాల్సిందే. మరి వాటిని ఎలా గుర్తించాలి. మార్కెట్ లో చేపలు తాజా (fresh).. కావో అర్థం కాక చాలామంది తికమక (confuse) అవుతుంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం (Follow these tips) ద్వారా చేపలను సులభంగా గుర్తించడం సాధ్యమవుతుంది.

  • Share this:
    చేపలు (fish) ఆరోగ్యానికి చాలా ఉపయోగపడేవి. చాలా మంది ఇష్టంగానూ తింటారు. ముఖ్యంగా మాంసాహార ప్రియలు ఇష్టపడే వాటిలో చేపలు ఒకటి. అయితే ఈ మధ్యలో చేపల ధరలు కూడా ఆకాశన్నంటుతున్నాయి. అదే అదునుగా చూసుకుని చాలామంది ఇష్టానుసారంగా చేపలకు విషపూరిత మేత వేసి పెంచుతున్నారు. చేపలు తొందరగా బరువు పెరగాలని చాలామంది అలా చేస్తారు. చనిపోయిన జంతువుల కళేబరాలు, కోళ్ల కాళ్లు, ఈకలు తదితరాలతో చేపలను పెంచే వారున్నారు. ఇలాంటి చేపలను గుర్తించడం కష్టం. అయితే మార్కెట్లోకి వచ్చిన చేపల్లో రెండు మూడు రోజుల చేపలను విక్రయానికి పెడుతారు. అవి తింటే అనారోగ్యం పాలవ్వాల్సిందే. మరి వాటిని ఎలా గుర్తించాలి. మార్కెట్ లో చేపలు తాజా (fresh).. కావో అర్థం కాక చాలామంది తికమక (confuse) అవుతుంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం (Follow these tips) ద్వారా చేపలను సులభంగా గుర్తించడం (finding) సాధ్యమవుతుంది.

    గట్టిగా ఉంటేనే తాజావి..

    చేపలను పట్టుకుని ఒత్తిన సమయంలో అవి మెత్తగా (smooth) ఉంటే ఎప్పుడో పట్టిన చేపలని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా గట్టిగా (strong) ఉంటే మాత్రం ఆ చేపలు తాజా చేపలు అని భావించాలి. చేప కళ్ల గుడ్డు లోపలికి వెళ్లిపోయినా కళ్లపై తెల్లటి పొర ఏర్పడినా ఆ చేపలు తాజా (fresh) చేపలు అయితే కాదు. చేపల మొప్పలను పరిశీలించి అవి తాజావో కాదో తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. చేపలకు మొప్పల క్రింద చూస్తే తేమతో కూడిన గులాబీ (Rose) రంగు ఉంటే తాజా చేపలని అర్థం చేసుకోవాలి. ఒకవేళ రంగు మారిపోతే అలాంటి చేపలను కొనకపోవడమే బెటర్​. చేపల నుంచి వెలువడే వాసన (smell)ను బట్టి చేపలు తాజావో కాదో గుర్తించడం సాధ్యమవుతుంది.

    చేపలు తినడం (eat) వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను సైతం పొందవచ్చు. చేపలలో శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉండవు. అందువల్ల ఇవి మీ గుండె (heart) పనితీరును మెరుగుపరుస్తాయి. చికెన్, మటన్లలో గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొలెస్ట్రాల్ ఉంటుంది. అందుకే మాంసాహారం ద్వారా అందే ప్రోటీన్లను కాకుండా, చేపల ద్వారా అందే ప్రోటీన్ల (proteins)ను తీసుకోవడం మంచిది. మీ డైట్లో చేపలను చేర్చుకుంటే హృదయ సంబంధ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. చేపల నుంచి విటమిన్- డి శరీరానికి తగినంత అందుతుంది. వివిధ రకాల పోషకాలను మానవ శరీరం గ్రహించాలంటే విటమిన్ డి క్రమం తప్పకుండా శరీరానికి అందాలి. చేపలను తరచూ తినడం ద్వారా డి విటమిన్తో పాటు ఇతర పోషకాలు కూడా మనకు అందుతాయి.

    చేపలు జీవక్రియలకు ఎంతగానో సహాయపడటంతో పాటు శరీరంలోని కొవ్వులను అదుపులో ఉంచుతాయి. అందువల్ల వైద్యులు చేపలను ఆహారంలో (food) భాగంగా తీసుకోవాలని చెబుతుంటారు. అనారోగ్య సమస్యలకు (Unhealthy problems) చెక్ పెట్టడంలో చేపలు ఎంతగానో సహాయపడతాయి. చేపలు తినడం వల్ల శరీరానికి అవసరమైన జింక్ , అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం, ప్రొటీన్, విటమిన్ డి, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము లభిస్తాయి.
    Published by:Prabhakar Vaddi
    First published: