Home /News /life-style /

Fenugreeks Benefits: మెంతులు.. ప్రయోజనాలు బోలెడు.. అయితే, వీరు తీసుకోకపోవడమే మంచిది..!

Fenugreeks Benefits: మెంతులు.. ప్రయోజనాలు బోలెడు.. అయితే, వీరు తీసుకోకపోవడమే మంచిది..!

Fenugreeks Benefits(ప్రతీకాత్మక చిత్రం)

Fenugreeks Benefits(ప్రతీకాత్మక చిత్రం)

Fenugreeks Benefits: మన వంటగదిలోనే అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయగల మూలికలు ఉన్నాయి. అందుకే మన పెద్దలే కాకుండా ఆయుర్వేద నిపుణులు కూడా వంటగది మసాలా దినుసులు, మూలికలను ప్రతిరోజూ వాడాలని సూచిస్తుంటారు.

  రోజువారీ అనారోగ్య సమస్యలను సమర్ధవంతంగా అధిగమించేందుకు ఆసుపత్రులకు, మందుల షాప్‌లకు వెళ్లాల్సిన పనిలేదు. ఎందుకంటే మన వంటగదిలోనే అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయగల మూలికలు ఉన్నాయి. అందుకే మన పెద్దలే కాకుండా ఆయుర్వేద నిపుణులు కూడా వంటగది మసాలా దినుసులు, మూలికలను ప్రతిరోజూ వాడాలని సూచిస్తుంటారు. మన కిచెన్ లో ఎప్పుడూ కనిపించే మెంతికూర లేదా మెంతి గింజలు (Fenugreek Seeds) ఎన్నో ఔషధ విలువలు కలిగి ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మెంతులను ఆహారంలో తరచూ వాడటం వల్ల రుచితో పాటు అనేక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు.

  "మెంతిఅనేది అద్భుతమైన ఆయుర్వేద మూలిక. ఇండియన్ కిచెన్ లో మెంతులను రకరకాలుగా వాడుతుంటారు. ఎన్నో ఔషధ గుణాలున్న మెంతులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మెంతులు వంటకాల రుచిని పెంచడంతోపాటు మధుమేహాన్ని నియంత్రించగలవు. అలాగే ఇవి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించగలవు. చర్మం, జుట్టు ఆరోగ్యానికి మెంతులు ఎంతో మేలు చేస్తాయి.మెంతుల్లో బోలెడు ఔషధ గుణాలు ఉంటాయి. ప్రోటీన్, కొవ్వులు, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సి, కె, బి, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, రాగి, జింక్, ఫైబర్ తదితర పోషకాలు మెంతికూరలో సమృద్ధిగా లభిస్తాయి.

  మెంతి వల్ల కలిగే ప్రయోజనాలు..

  1. మెంతి ఆకలి, జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే తల్లుల బ్రేస్ట్స్ నుంచి పాల స్రావం (secretion) సక్రమంగా జరిగేలా దోహదపడుతుంది. మహిళల్లో పాల ఉత్పత్తి పెరగడానికి కూడా మెంతులు సహాయపడతాయి.

  2. మెంతులు లేదా మెంతికూర తరచుగా తినడం వల్ల మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. అందుకే షుగర్ కంట్రోల్ కోసం పరిగడుపున కొన్ని మెంతులు తినాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు. మెంతులు కొలెస్ట్రాల్ తగ్గించడంతోపాటు రక్తపోటును మెరుగుపరుస్తుంది.

  3.ఇది జుట్టు రాలడం, నెరిసిన జుట్టు, యూరిక్ యాసిడ్ స్థాయిలను (gout) తగ్గిస్తుంది. ఇది బ్లడ్ లెవెల్స్ మెరుగుపరిచి రక్తహీనత సమస్యను తొలగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడానికి (డిటాక్సిఫై) కూడా సహాయపడుతుంది.

  4. న్యూరల్జియా(నరాలవ్యాధి), పక్షవాతం, మలబద్ధకం, కడుపు నొప్పి, ఉబ్బరం తగ్గించడంలో మెంతి దివ్యౌషధంగా పనిచేస్తుంది. వెన్నునొప్పి, మోకాలి కీళ్ల నొప్పులు, కండరాల తిమ్మిరి, శరీరంలోని ఏ భాగంలోనైనా నొప్పిని నయం చేయడంలో మెంతులు బాగా ఉపయోగపడతాయి.

  5. ఇది దగ్గు, ఉబ్బసం, బ్రోన్కైటిస్(bronchitis), ఊపిరితిత్తుల్లో ద్రవాలు, శ్లేష్మం గడ్డ కట్టడం, ఊబకాయం వంటి కఫ (Kapha) వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

  మెంతిని ఎవరు, ఎలాంటి సమయంలో తినకూడదు?

  ముక్కు సంబంధిత రక్తస్రావ వ్యాధులతో బాధపడుతున్న వారు మెంతికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. హెవీ పీరియడ్స్ వంటి రక్తస్రావ సమస్యలతో బాధపడుతున్నప్పుడు కూడా దీనిని వాడకూడదు. ఇటువంటి రుగ్మతలతో బాధపడేవారు ముఖ్యంగా ఎండాకాలంలో మెంతులను తినకూడదు. మెంతులు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి తద్వారా కఫా, వాతాన్ని సమతుల్యం చేస్తాయి.

  ఇది కూడా చదవండి : రాత్రిళ్లు నిద్ర సరిగా పట్టడం లేదా.. అయితే హాయిగా నిద్ర పట్టాలంటే ఈ ఆహారం తీసుకోండి

  మెంతి ఎలా వాడితే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి?

  1. 1-2 టేబుల్ స్పూన్ల మెంతి గింజలు రాత్రిపూట నానబెట్టి, ఉదయాన్నే తినండి. లేదా టీ లాగా కూడా తాగొచ్చు.

  2. భోజనానికి ముందు లేదా రాత్రిపూట గోరువెచ్చని పాలు లేదా నీటితో ఒక స్పూన్ మెంతి పొడిని రోజుకి రెండుసార్లు తీసుకోండి.

  3. మెంతులను పేస్ట్ లా చేసి.. అందులో పెరుగు/కలబంద జెల్/నీటిలో కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం, నెరిసిన జుట్టు వంటి సమస్యలు మటుమాయమవుతాయి.

  4. రోజ్‌వాటర్‌తో తయారు చేసిన మెంతికూర పేస్ట్‌ని ముఖంపై సున్నితంగా మర్దన చేయడం వల్ల డార్క్ సర్కిల్స్, మొటిమలు, మొటిమల మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. అయితే, వీటిని ఫాలో అయ్యే ముందుప్రతి ఒక్కరు కూడా తమ ఆయుర్వేదిక్ డాక్టర్ ని సంప్రదించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Diabetes, Health, Health benefits and secrets, Health food, Life Style

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు