Storing coriander: కొత్తిమీరను 7 రోజులపాటు ఇలా నిల్వ చేసుకోవచ్చు!

ప్రతీకాత్మక చిత్రం

Storing coriander: కొత్తిమీర కట్టను ఎప్పుడూ కట్‌ చేసి నిల్వ చేసుకోవాలి. కొత్తిమీర ఆకుల కొమ్మల్లో కొన్నిసార్లు తేమ ఉంటుంది. దీంతో కొత్తిమీర కుళ్లిపోతుంది.

  • Share this:
మనం కూరగాయలు (vegetables) తెచ్చుకునేటపుడు వారానికి కనీసం తెచ్చుకుంటాం. అవన్ని పాడవ్వకుండా ఎక్కువ రోజులు రావడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే, ఆకుకూరలు వంటివి స్టోర్‌ చేయడానికి కాస్త రిస్క్‌ అనిపిస్తుంది. ఎందుకంటే వీటికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆకుకూరలను నేరుగా ఫ్రిజ్‌లో (fridge)  పెట్టలేం. దానికి కొన్ని టిప్స్‌ పాటించాలి. అప్పుడే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అయితే, ఈరోజు మనం కొత్తిమీరను ఎలా ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచుకోవాలో తెలుసుకుందాం.

కొత్తిమీర పాడవ్వడానికి 5 కారణాలు..

మనం సాధారణంగా మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసిన తాజా కొత్తిమీర (coriander) ఇంట్లో ఏ జాగ్రత్తలు తీసుకోకుండా పెట్టుకుంటే పాడవుతుంది. అయితే, సాయంత్రం లేదా కొన్ని గంటల్లో ఈ కొత్తిమీర ఆకులు పొడిగా లేదా కుళ్లిపోయి, అసహ్యంగా మారుతుంది. దీనికి కారణం సరిగ్గా నిల్వ చేయకపోవడమే కారణం. మనం చేసే ఆ 5 తప్పులు ఏంటో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి:  ఈ చిట్కాతో 50 శాతం గ్యాస్‌ ఆదా అవుతుంది!

కొత్తిమీరను (coriander) కడిగిన తర్వాత అలాగే మర్చిపోతారు. కానీ, కడిగిన కొత్తిమీరను ఫ్యాన్‌ కింద లేదా ఎండలో ఆరబెట్టాలి. కొత్తిమీర ఆకులు ఒక్క రోజులో ఎండిపోతాయి. లేదా తేమ వల్ల కుళ్లిపోతాయి. అందుకే దీన్ని ఎప్పుడూ పొడిగా ఉంచడం మంచిది.

కొత్తిమీర కట్టను ఎప్పుడూ కట్‌ చేసి నిల్వ చేసుకోవాలి. కొత్తిమీర ఆకుల కొమ్మల్లో కొన్నిసార్లు తేమ ఉంటుంది. దీంతో కొత్తిమీర కుళ్లిపోతుంది. ఫ్రిజ్‌లో కొత్తిమీరను నిల్వ చేసుకునేటపుడు ఓపెన్‌ చేసి పెట్టకూడదు. ఎందుకంటే ఇలా పెడితే కొన్ని గంటల్లోనే ఆకులు పాడవుతాయి. అంతేకాదు కొత్తిమీరను ఫ్రిజ్‌లో తెరిచి ఉంచితే..దాని వాసన అందరికీ వ్యాపిస్తుంది.

ఇది కూడా చదవండి:   సౌత్‌కొరియా BTS బ్యాండ్‌ సభ్యుల కల్లు చెదిరే లగ్జరీ లైఫ్‌!

కొత్తిమీరను ఎయిర్‌ టైట్‌ బాక్స్‌ (Air tight box) ను ఉపయోగించాలి. మార్కెట్‌ నుంచి తీసుకు వచ్చిన వారం తర్వాత కూడా తాజాగా ఉండాలంటే.. ఎయిర్‌ టైట్‌ బాక్స్‌లో పెట్టాలి. పేపర్‌పై కొత్తిమీరను పెట్టి దాన్ని ఎయిర్‌ టైట్‌ బాక్స్‌లో పెట్టుకోవాలి. దీంతో ఎక్కువ కాలం కొత్తిమీర నిల్వ ఉంటుంది.
Published by:Renuka Godugu
First published: