Home /News /life-style /

DO YOU HAVING BODY PAINS PROBLEMS THEN FOLLOW THIS EASY TIPS TO GET RID OF IT AND TAKE PRECAUTIONS FOR THAT PRV

Body pains Treatment: ఒంటి నొప్పులు అధికంగా వస్తున్నాయా? అయితే ఇలా చేసి నొప్పి తగ్గించుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా అనంతరం శారీరక శ్రమ అధికమవుతోంది. శరీరంలో నొప్పులు( body pains) తెచ్చిపెడుతోంది. అటువంటి పరిస్థితిలో చాలా సార్లు వారు కూడా పెయిన్ కిల్లర్స్ తీసుకుని తమ పనిని పూర్తి చేస్తుంటారు. అయితే అలా చేయకూడదంటున్నారు వైద్యులు.

    కరోనా మనల్ని చాలా బద్దకస్తుల్ని చేసింది. కరోనా అనంతరం ఉరుకుల పరుగుల జీవితం. అలసట, ఆందోళన సర్వసాధారణమే. రోజంతా పనిచేసి ఇంటికి చేరుకున్నాక ఒంటినొప్పులు (body pains) మరో బాధను తెచ్చిపెడుతాయి. కనీసం హాయిగా పడుకుందామనుకున్నా.. ఇంటి బాధ్యతలు నిల్చోనివ్వవు, కూర్చోనివ్వవు.  మరోవైపు కరోనా తెచ్చిన సమస్యలు మనిషిని అతలాకుతలం చేసింది. సగటు జీవి ఆర్థికంగానూ బలహీన పడటంతో మళ్లీ గాడిలో పడటానికి (health acre) నానా తంటాలు పడుతున్నారు. ఎక్కువ సమయం పనిచేస్తున్నారు. దీంతో శారీరక శ్రమ అధికమవుతోంది. నొప్పులు ( body pains) తెచ్చిపెడుతోంది. అటువంటి పరిస్థితిలో చాలా సార్లు వారు కూడా పెయిన్ కిల్లర్స్ తీసుకుని తమ పనిని పూర్తి చేస్తుంటారు. కానీ, పదేపదే నొప్పి నివారణ మందులు తీసుకోవడం శరీరానికి ప్రయోజనకరం కాదట. అందుకే ఈ ఒంటినొప్పులు తగ్గించడానికి కొన్ని చిట్కాలు (tips) పాటిస్తే సరి. హాయిగా ఇంటిలోని వైద్యం చేసుకోవచ్చు. చిటికెలో నొప్పులు (pains) తగ్గించుకోవచ్చు. అవేంటో ఓ సారి చూద్దాం..

    యాపిల్ సైడర్ వెనిగర్..

    శరీర నొప్పిని వదిలించుకోవడానికి మీరు ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించవచ్చు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని కారణంగా శరీరం వాపును తగ్గించవచ్చు. ఇది నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి, రుచికి అనుగుణంగా తేనె కలిపిన తర్వాత తాగండి. ఇది నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. అలసటను తొలగించడానికి పసుపు పాలు (Turmeric milk) చాలా ఉపయోగపడుతాయి. రాత్రి పడుకునే ముందు, ఒక గ్లాసు పాలను(milk) వేడి చేయాలి. అందులో ఒక చెంచా పసుపు కలిపి తాగండి (drink). దీని వలన మీరు ఒళ్ళు నొప్పుల నుంచి చాలా ఉపశమనం పొందుతారు. అల్లం వినియోగం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.  శరీర నొప్పి, వాపు మొదలైన వాటిని కూడా తగ్గిస్తుంది. మీరు ఒక అల్లం ముక్కను నీటిలో మరిగించి ఫిల్టర్ చేసి తాగితే ఉపశమనాన్ని ఇస్తుంది.

    వెల్లుల్లి రసంతో..

    కీళ్ల నొప్పులు (joint pains) ఎక్కువగా ఉన్న చోట వెల్లుల్లి రసంతో బాగా మర్దన చేయడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతి రోజు ఒక గ్లాసు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకొని త్రాగటం వలన కీళ్ల నొప్పి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఒకవేళ మీ శరీరంలో వాపు ఉన్నట్లయితే ఆవ నూనె (oil)ను వాడాలి. మీరు ఒక కప్పు ఆవనూనెలో నాలుగు లవంగాలు వెల్లుల్లి వేసి బాగా వేడి చేయాలి. దీని తరువాత అది గోరువెచ్చగా ఉన్నప్పుడు, మీరు దానిని నొప్పి ఎక్కువ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చేయాలి. సల్ఫర్, మెగ్నీషియం ఉప్పులో తగినంత పరిమాణంలో ఉంటాయి. అందువల్ల, మీరు ఉప్పును వేడి చేసి, ఒక వస్త్రంలో ఉంచి, నొప్పి వస్తున్న ప్రదేశంలో అప్లై చేయండి. ఇది మీకు శరీర నొప్పి నుంచి వెంటనే ఉపశమనం ఇస్తుంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health benefits

    తదుపరి వార్తలు