Home /News /life-style /

DO YOU HAVE YELLOW TEETH THEN YOU MUST KNOW FEW THINGS AND FOLLOW THIS STEPS TO TURN YOUR TEETH WHITE PRV

Teeth white: దంతాలు పసుపురంగులో ఉన్నాయా? అయితే మీరు ఈ జాగ్రత్తలు తీసుకొని, కొన్ని చిట్కాలు పాటిస్తే తెల్లగా మారుతాయి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కాఫీ, టీ, వైన్ వంటి టానిన్‌లు కలిగిన ఆహారాలు, పానీయాలు మీ దంతాలకు పసుపు రంగు వచ్చేలా చేస్తాయి. ఆమ్లత్వంతో కూడిన ఆహార పదార్థాలు (Food items) కూడా దంతాలను పసుపు రంగులోకి మారుస్తాయి.

    దంతాలు (Teeth). ముఖంలో నవ్వు (Smile)ను ప్రతిబించించేవి. అయితే దంతాలు చాలా మందిలో పటిష్టంగా ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రంగు మారుతుంటాయి. పసుపు పచ్చ (yellow)గా తయారవుతాయి. దీంతో నలుగురిలో హాయిగా నవ్వాలన్నా (smile) మొహమాటపడే పరిస్థితికి వస్తారు. అయితే. అందుకే, ఎప్పుడూ పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు. రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్ల (teeth white)గా మిలమిలలాడుతూ ఆరోగ్యంగా ఉంటాయి. అయితే మరికొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపు పచ్చగా కనబడుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీ దంతాలను తెల్ల (teeth white)గా మార్చుకోవచ్చు. మళ్లీ అందంగా ఎలాంటి బాధలు లేకుండా నవ్వుకోవచ్చు. అయితే ఆ చిట్కాలు (teeth white tips) ఏంటనేది ఇపుడు తెలుసుకుందాం..

    పసుపు రంగులోకి ఎలా మారుతాయి..

    జంక్ ఫుడ్ వలన ఎదురయ్యే సమస్యలలో ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఒకటి దంతాలు పసుపు రంగు (yellow color)లో ఉండటం. దీనివల్ల నోటి నుంచి దుర్వాసన (Bad smell) కూడా వస్తుంది. మాములుగా నవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. దంతాలు పసుపు రంగులోకి మారడానికి కారణం దంతాలపైన డెంటినా అనే పొర తొలగిపోవడమే. కాఫీ, టీ, వైన్ వంటి టానిన్‌లు కలిగిన ఆహారాలు, పానీయాలు మీ దంతాలకు పసుపు రంగు వచ్చేలా చేస్తాయి. ఆమ్లత్వంతో కూడిన ఆహార పదార్థాలు (Food items) కూడా దంతాలను పసుపు రంగులోకి మారుస్తాయి.

    కొన్ని రకాల ఆహారపదార్థాలు (food items) దంతాలు రంగు మారడానికి కారణమవుతాయి. బీట్‌రూట్‌, బెర్రీలు, సోయాసాస్‌, వెనిగర్‌, టొమాటో సాస్‌లు ఆ కోవకు చెందినవి. కాబట్టి వీటిని వీలైనంత తగ్గించాలి. టీ, కాఫీలు దంతాల రంగును దెబ్బతీస్తాయి.

    దంతాలు రంగు మారకుండా ఉండాలంటే రోజూ రెండు సార్లు బ్రష్‌ (Brush twice a day) చేయాలి. భోజనం తరువాత మౌత్‌వాష్‌ ఉపయోగించాలి. ఫ్రూట్స్‌, పచ్చి కూరగాయలు తినడం వల్ల దంతాలపై లేయర్‌లా ఏర్పడిన ప్లాక్‌ తొలగిపోతుంది. దంతాలను తెల్లగా మార్చేందుకు బేకింగ్‌ సోడా (baking soda) ఉపయోగపడుతుంది. కాస్త నీళ్లు తీసుకుని ఒక టీస్పూన్‌ బేకింగ్‌ సోడా వేసి పేస్టులా చేసి బ్రష్‌ చేసుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు ఇలా చేయాలి.

    కొబ్బరినూనె (Coconut oil)తో ఆయిల్‌పుల్లింగ్‌ చేయడం వల్ల కూడా దంతాలు తెల్లగా మారతాయి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా తొలగిపోయి ప్లాక్‌ బిల్డప్‌ కాకుండా ఉంటుంది. కొబ్బరినూనెలో లవంగాల నూనె, నువ్వుల నూనె వంటివి కలిపి ఉపయోగిస్తే ఫలితం ఇంకా బాగుంటుంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Teeth

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు