Home /News /life-style /

Beauty tips: ముఖంపై అవాంఛిత రోమాలు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలతో వాటిని తొలగించుకోండి..

Beauty tips: ముఖంపై అవాంఛిత రోమాలు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలతో వాటిని తొలగించుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ రోజుల్లో అవాంఛిత రోమాలు నలుగురిలో ఇబ్బందికి గురిచేయొచ్చు. ఆ అవాంఛిత రోమాలు అనేవి పోతేనే కానీ మన నిజమైన చర్మ సౌందర్యం కనిపించదు. అవి లేకపోతే చర్మం మరింత అందంగా మెరుస్తూ కనిపిస్తుంది.

    అందం (beauty). అందరూ కోరుకునేదే. ఇది ప్రతిబింబించేది. మన చర్మం (skin) ద్వారానే. అయితే చాలామందిఆ చర్మాన్ని అశ్రద్ధతో పాడుచేసుకుంటారు. మళ్లీ ఏవేవో క్రీమ్​లు వాడుకుంటూ డబ్బులు తగలేస్తుంటారు. కానీ, మనం అప్పుడప్పుడు చేసే కొన్ని పనుల్లో జాగ్రత్తలు తీసుకుంటే (Skin care for boys) మృదువైన (Smooth), అందమైన చర్మం (beautiful skin) మన సొంతమవుతుందని తెలుసా. చర్మాన్ని శుభ్రపరచడం చాలా ముఖ్యమైన విషయం. రోజంతా మీ చర్మం(skin) వివిధ కలుషితాలను ఎదుర్కొంటుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను అడ్డుకుంటుంది. చర్మ రంధ్రాలను కూడా అడ్డుకుంటుంది. ఫలితంగా, చర్మం సరిగా శ్వాస(breath) తీసుకోకపోవచ్చు. అయితే ఈ రోజుల్లో అవాంఛిత రోమాలు నలుగురిలో ఇబ్బందికి గురిచేయొచ్చు. ఆ అవాంఛిత రోమాలు అనేవి పోతేనే కానీ మన నిజమైన చర్మ సౌందర్యం కనిపించదు. అవి లేకపోతే చర్మం మరింత అందంగా మెరుస్తూ కనిపిస్తుంది.

    నిమ్మకాయతోనూ..

    ముఖంపై ఉన్న అవాంఛిత రోమాల (Unwanted hairs)ను తొలగించడానికి కొన్ని పద్దతులు తెలుసుకుందాం..  నిమ్మకాయ (lemon) చర్మానికి సహజమైన బ్లీచింగ్ లా వినియోగించుకోవచ్చు. తద్వారా ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోయి కాంతి వంతంగా తయారవుతుంది. అంతే కాదు ముఖంపై ఉన్న అవాంచిత రోమాలను మాయం చేయడానికి ఉపయోగపడే ఎక్స్‌ఫోలియేటర్ కూడా ఇందులో అధికంగా ఉంటుంది. ఒక కప్పు నీటిలో, రెండు కప్పుల వరకు చక్కెరను వేయాలి. అందులో అర చెక్క లేదా పూర్తి నిమ్మకాయ రసం కలిపి ఆ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి అప్లై చేస్తూ పదినిమిషాల పాటు  మర్దన చేసుకోవాలి. ఒక అరగంట ఆగి గోరు వెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలాంటి పద్దతులతో రోమాలు (hairs) ఎక్కువగా రావు.

    ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

    పసుపుతో..

    పసుపు (Turmeric) అనేది వంటలకు, అందానికి, ఔషధంగా ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. అయితే చర్మంపై ఉన్న అవాంఛిత రోమాలను (Unwanted hairs) తొలగించాలని కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఒక చెంచా పసుపును తీసుకుని, అందులో రెండు చెంచాల సెనగ పిండి వేయండి, పాలు వేసి  పేస్టులా కలుపుకోవాలి. అనంతరం ఆ పేస్టును ముఖానికి అప్లై చేసుకుని దాదాపు 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు అలాగే ఆరనివ్వాలి. అనంతరం చల్లటి నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

    వర్షంలో తడిచాక మీ జుట్టు పాడైపోతుంది కదా? ఈ చిట్కాలతో మీ జుట్టును కాపాడుకోండి..




    ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Beauty tips, Hair problem tips, Life Style

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు