చాలామందికి యంగ్ ఏజ్‌లోకి (Young age) అడుగుపెట్టాకగానే ముఖంపై వచ్చే మొటిమలు తెగ ఇబ్బంది పెడుతుంటాయి. అయితే యవ్వన ప్రాయంలో మొటిమలు (Pimples) రావడం అనేది సర్వసాధారణమే. కానీ వయసుతో సంబంధం లేకుండా పెద్దవారిలో కూడా మొటిమలు వస్తే అది చర్మ (skin) సంబంధిత సమస్యేనని గుర్తించాలి. యుక్త వయసు దాటాక కూడా మొటిమలు వస్తుంటే అది ఏదో ఒక జబ్బుకి సంకేతం అయ్యుండొచ్చు. అందుకే మొటిమల సమస్య (acne problems) గురించి ఎప్పటికప్పుడు డాక్టర్లకు తెలియజేయాలి. జీవన విధానం, పేలవమైన చర్మ సంరక్షణ (skin care tips) అలవాట్లు, వాతావరణ పరిస్థితుల వల్ల మొటిమలు (pimples) వచ్చే ఆస్కారం ఉంది.
పింపుల్స్ (pimples) ను చేతి వేళ్లతో నొక్కటం వలన ముఖంపై మచ్చలు ఏర్పడి, బయట తిరగానికి లేదా పార్టీలకు వెళ్ళటానికి ఇబ్బందికరంగా భావిస్తుంటారు. వీటిని తగ్గించుకోటానికి చాలా మంది చర్మ వైద్య నిపుణులను కలవటం లేదా మార్కెట్ లో లభించే ఉత్పత్తులను వాడుతుంటారు.ఇలాంటి సమయంలో రసాయనిక క్రీమ్ ల కన్నా, సహజ ఔషధాలు శక్తివంతంగా పని చేస్తాయి. కారణం- మీ చర్మానికి (skin) కావలసిన పోషకాల స్థాయిలు సమతుల్య పరచుటలో ఇవి శక్తివంతంగా పని చేస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని (skin health) మెరుగుపరిచే ఔషధాలు, ట్రీట్మెంట్ (pimples treatment) గురించి ఒకసారి తెలుసుకుందాం.
ఆస్ప్రిన్ మాత్ర (Aspirin Tablet)తో కేవలం తలనొప్పిని తగ్గించేందుకే కాదు.. మొటిమల్లాంటి చర్మ సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి. ఇందుకోసం ఒక టాబ్లెట్‌ని పొడిగా చేసి.. నీటితో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని మొటిమపై రుద్దాలి. రాత్రంతా అలాగే ఉంచితే చాలు. ఉదయానికి మొటిమలు తగ్గిపోతాయి.
ఈత (Swimming) మొటిమలను దూరం చేస్తారంట. ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఈత మంచి వ్యాయామం, మూడ్‌ని పెంపొందించే మార్గమే కాదు. ఇది మొటిమలు తగ్గించేందుకూ తోడ్పడుతుంది. స్విమ్మింగ్ పూల్‌లోని క్లోరిన్ మొటిమలను ఎండిపోయేలా చేస్తుంది. దీంతో అవి త్వరగా తగ్గుముఖం పడతాయి.
వెల్లుల్లి ( Garlic)లో ఎన్నో యాంటీబ్యాక్టీరియల్ గుణాలున్నాయి. అందుకే ఇది మొటిమలను తగ్గించేందుకు కూడా చక్కగా తోడ్పడుతుంది. మొటిమలపై చిన్న వెల్లుల్లి ముక్కతో బాగా రుద్దండి. ఇలా చేస్తే చాలా తొందరగా మొటిమలు తగ్గుతాయి.
ఆల్కహాల్ (Alcohol)లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు మొటిమలు త్వరగా తగ్గిపోయేలా చేస్తాయి. మరి, మీరు మొటిమల నుంచి విముక్తి పొందాలంటే.. ఆల్కహాల్‌తో మొటిమలున్న ప్రాంతంలో రాస్తే సరి.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.